E-Paper
Advertisement

ఇక ఫ్రిడ్జ్ అవసరమే లేదు.. ఇంట్లోని మట్టి కుండనే ‘ఐస్’లా మార్చేయండి!

ఇక ఫ్రిడ్జ్ అవసరమే లేదు.. ఇంట్లోని మట్టి కుండనే ‘ఐస్’లా మార్చేయండి!
Advertisement

Pot Water Cooling: వేసవి కాలంలో చాలా మంది ఫ్రిడ్జ్ నీళ్ల కంటే మట్టి కుండ నీటినే తాగడానికే ఇష్టపడతారు. అయితే కొందరి ఇంట్లో కుండ ఉన్నా నీళ్లు సరిగ్గా చల్లబడవు. కొత్త కుండ కొన్నా కూడా నీళ్లు వేడిగానే ఉంటున్నాయని చాలా మంది వాపోతుంటారు. అయితే కుండనీరు ఇలా వేడిగా ఉండటానికి స్వయంగా చేసుకున్న తప్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. కుండ నీళ్లు ఐస్ ముక్కల్లా చల్లగా మారాలంటే 4 చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. అమ్మమ్మల కాలం నుంచి విజయవంతంగా పనిచేస్తూ వస్తున్న ఆ దేశీ చిట్కాలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

గాలి తగలడం మస్ట్

సాధారణంగా మట్టి కుండ నీరు చల్లబడటానికి బాష్పీభవనం అనే ప్రక్రియ కారణంగా చల్లగా మారుతుంటాయి. కాబట్టి కుండను గాలి ఆడని గదిలో లేదా మూలన పెడితే నీళ్లు చల్లబడవు. కుండను ఎప్పుడూ గాలి బాగా వీచే కిటికీ దగ్గర లేదా బాల్కనీకి దగ్గరగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. గాలి తగిలితేనే కుండలోని నీరు త్వరగా చల్లబడుతాయని స్పష్టం చేస్తున్నారు

తడి గుడ్డ మ్యాజిక్

Advertisement

ఇది అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా. ఒక కాటన్ గుడ్డను చల్లటి నీళ్లలో తడిపి దాన్ని కుండ చుట్టూ చుట్టాలి. ఆ గుడ్డ ఆరిపోకుండా మధ్యమధ్యలో దానిపై నీళ్లు చల్లుతుండాలి. ఇలా చేయడం వల్ల కుండలోని ఉష్ణోగ్రత వేగంగా తగ్గి నీరు అమృతంలా చల్లగా మారుతుంది.

ఇసుక ప్లేటు చిట్కా

చాలా ఇళ్లల్లో కుండనే నేరుగా నేలపై పెట్టేస్టుంతారు. ఇది చాలా తప్పని నిపుణులు పేర్కొంటున్నారు. కుండను నేలపై పెట్టకుండా ఒక వెడల్పాటి పళ్లెంలో లావుపాటి ఇసుకను వేసి దానిపై పెట్టాలని సూచిస్తున్నారు. ఈ ఇసుకను క్రమం తప్పకుండా తడుపుతూ ఉంటే.. ఇసుక చల్లదనం కుండకు చేరి.. నీరు చల్లగా మారతాయని వివరిస్తున్నారు.

Advertisement

Also Read: మీ పాత ఏసీని అమ్మాలా? ఆన్‌లైన్ vs ఆఫ్‌లైన్.. ఎక్కడ ఎక్కువ లాభం?

వారానికి ఒకసారి క్లీనింగ్..

మట్టి కుండకు ఉండే కంటికి తెలియని చిన్న చిన్న రంధ్రాల ద్వారా నీరు బయటకు వచ్చి ఆవిరవుతుంది. కుండ పాతబడే కొద్దీ లేదా దానిపై దుమ్ము చేరితే ఆ రంధ్రాలు మూసుకుపోతాయి. అందుకే వారానికి ఒకసారి కుండను ఎలాంటి సోప్స్ వాడకుండా కేవలం ఉప్పు, గోరువెచ్చని నీటితో లోపల, బయట బాగా రుద్ది కడగాలి. ఈ చిన్న దేశీ చిట్కాలను పాటిస్తే ఇంట్లోని మట్టి కుండ.. ఫ్రిడ్జ్ రేంజ్ లో కూలింగ్ వాటర్ ను ఇస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×