E-Paper
Advertisement

నెట్ స్లోగా ఉందని రూటర్ మారుస్తున్నారా? ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే చాలు.. ఇల్లంతా హై-స్పీడ్ ఇంటర్నెట్!

నెట్ స్లోగా ఉందని రూటర్ మారుస్తున్నారా? ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే చాలు.. ఇల్లంతా హై-స్పీడ్ ఇంటర్నెట్!
Advertisement

Wi-Fi Speed Tips: నేటి ఆధునిక యుగంలో ఇంటి నిండా స్మార్ట్ డివైజ్‌లు, ఆన్‌లైన్ క్లాసులు, వర్క్‌ ఫ్రమ్ హోమ్‌లతో ప్రతి ఒక్కరికీ Wi-Fi అత్యవసరంగా మారింది. అయితే, ఇంట్లోని హాల్లో వైఫై రూటర్ ఉంటే.. కొన్ని గదులకు సిగ్నల్స్ సరిగ్గా అందక ఇంటర్నెట్ నెమ్మదించడం ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఈ నేపథ్యంలో ఇంట్లో ఏ మూలన కూర్చున్న హైస్పీడ్ ఇంటర్నెట్‌ను ఎలా పొందాలో తెలుసుకుందాం.

రూటర్ ప్లేస్‌మెంట్ చాలా ముఖ్యం:

చాలామంది Wi-Fi రూటర్‌ను ఒక మూలనో లేదా టీవీ వెనకాలనో దాచేస్తుంటారు. దీనివల్ల సిగ్నల్స్ సరిగ్గా ప్రసరించవు. రూటర్‌ను ఎప్పుడూ ఇంటికి మధ్యలో, కొంచెం ఎత్తైన ప్రదేశంలో లేదా షెల్ఫ్‌పై ఉంచాలి. మందపాటి గోడలు, ఇనుప వస్తువులకు దీనిని దూరంగా ఉంచడం వల్ల సిగ్నల్స్ అడ్డుపడకుండా ఇల్లంతా సమానంగా అందుతాయి.

టెక్నాలజీకి తగ్గట్టు అప్‌గ్రేడ్ అవ్వాలి:

Advertisement

పాతకాలపు రూటర్లు ఎక్కువ డివైజ్‌లను తట్టుకోలేవు. అందుకే Wi-Fi 6E లేదా Wi-Fi 7 వంటి ఆధునిక రూటర్లను వాడటం మంచిది. ఇవి ఎక్కువ స్పీడ్‌ను ఇవ్వడమే కాకుండా.. ఇంట్లో ఎన్ని డివైజ్‌లు ఉన్నా ఇంటర్నెట్ స్లో అవ్వకుండా చూసుకుంటాయి. ట్రై-బ్యాండ్ సపోర్ట్ ఉన్న రూటర్లు అయితే మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.

Also Read: ఇలాంటి డివైజ్ కోసమే కదా ఇన్నాళ్లూ వెయిటింగ్.. జస్ట్ 3 సెకెండ్స్‌లో హాట్ వాటర్, ఐస్ క్యూబ్స్ రెడీ!

మెష్ Wi-Fi సిగ్నల్ మ్యాజిక్:

Advertisement

పెద్ద ఇల్లు లేదా రెండంతస్తుల ఇల్లు అయితే సాధారణ రూటర్ సరిపోకపోవచ్చు. అలాంటి సమయాల్లో మెష్ Wi-Fi సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇంట్లో వేర్వేరు చోట్ల చిన్న నోడ్స్ లాగా అమరిపోయి, సింగిల్ నెట్‌వర్క్ పేరుతో ఇల్లంతా ఒకేలాంటి హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. దీనివల్ల మనం ఏ గదిలోకి వెళ్లినా సిగ్నల్ ఫుల్‌గా అందుతుంది.

సెట్టింగ్స్‌లో చిన్న మార్పులు:

రూటర్ సెట్టింగ్స్‌ను కాస్త ఆప్టిమైజ్ చేయడం ద్వారా కూడా స్పీడ్ పెంచుకోవచ్చు. దూరంగా ఉన్న రూమ్‌ల కోసం 2.4 GHz బ్యాండ్, వేగవంతమైన ఇంటర్నెట్ కోసం 5 GHz లేదా 6 GHz బ్యాండ్ వాడాలి. అలాగే రూటర్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ.. పక్కింటి వై-ఫై సిగ్నల్స్ అడ్డుపడకుండా ఛానెల్‌ను మార్చుకుంటే మీ నెట్‌వర్క్ ఏదైనా సూపర్ ఫాస్ట్‌గా మారుతుంది.

Also Read: అద్భుతమైన సోనీ సెన్సార్స్, 4K వీడియో.. రూ.30 వేలలో టాప్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×