E-Paper
Advertisement

గూగుల్ పిక్సెల్ ఫోన్లలో Android 17 అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి!

గూగుల్ పిక్సెల్ ఫోన్లలో Android 17 అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి!
Advertisement

Android 17: గూగుల్ తమ సరికొత్త ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఎప్పటిలాగే ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మొదటగా గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లకు అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త ఓఎస్‌లో యాప్ బబుల్స్, స్క్రీన్ రియాక్షన్స్, మెరుగైన డార్క్ థీమ్, మరింత పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లను గూగుల్ జోడించింది. శాంం‌సంగ్, వన్‌ప్లస్ వంటి ఇతర కంపెనీలు రాబోయే రోజుల్లో తమ ఫోన్లకు ఈ అప్‌డేట్‌ను అందిస్తాయి.

ఏయే పిక్సెల్ ఫోన్లకు వస్తుంది?

ఈ ఆండ్రాయిడ్ 17 అప్టేట్ పిక్సెల్ 6 సిరీస్ లేదా ఆ పై మోడల్స్ ఉంటే మీరు ఈ కొత్త అప్‌డేట్‌ను పొందొచ్చు. పిక్సెల్ 6, 7, 8, 9 సిరీస్‌లతో పాటు తాజాగా వచ్చిన పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లకు కూడా ఆండ్రాయిడ్ 17 లభిస్తుంది. అలాగే పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ టాబ్లెట్ వాడుతున్న వారు కూడా దీనికి అర్హులే.

అప్‌డేట్ చేయడం ఎలా?

Advertisement

మీ గూగుల్ పిక్సెల్ ఫోన్‌లో ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. దీనికోసం ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ సిస్టమ్ ఆప్షన్‌ను ఎంచుకుని, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ‘చెక్ ఫర్ అప్‌డేట్స్’ నొక్కితే మీకు ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్ కనిపిస్తుంది. అక్కడ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ బటన్ నొక్కి, ప్రాసెస్ పూర్తయ్యాక ఫోన్‌ను ఒక్కసారి రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది.

Also Read: WhatsApp Plus వచ్చేసింది.. కొత్త ఫీచర్లు, ప్రయోజనాలు ఇవే!

బీటా ప్రోగ్రామ్ వివరాలు:

Advertisement

ఒకవేళ మీకు ఈ అప్‌డేట్ ఇంకా రాకపోతే.. గూగుల్ ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రామ్ వెబ్‌సైట్‌కి వెళ్లి ముందే దీనిని టెస్ట్ చేయవచ్చు. వెబ్‌సైట్‌లోని డివైసెస్ ట్యాబ్‌లోకి వెళ్లి మీ ఫోన్ పక్కన ఉన్న ‘ఆప్ట్ ఇన్’ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా బీటా వెర్షన్‌ను వాడుకోవచ్చు.

ఇతర ఫోన్ల పరిస్థితి ఏంటి?

గూగుల్ ఈ అప్‌డేట్‌ను విడతల వారీగా విడుదల చేస్తోంది. కాబట్టి.. అందరికీ ఒకేసారి రాకపోవచ్చు. ఇక శాంసంగ్ వాడుతున్న వారికి ఆండ్రాయిడ్ 17 ఆధారంగా ‘వన్ యూఐ 9’ అప్‌డేట్ రానుంది. వన్‌ప్లస్, ఒప్పో, షావోమి వంటి కంపెనీలు కూడా ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయని, త్వరలోనే తమ యూజర్లకు అందిస్తాయని తెలుస్తోంది.

Also Read: YouTube Shortsలో బిగ్ చేంజెస్.. లైక్ బటన్ స్థానంలో హార్ట్ సింబల్, ఆ ఫీచర్ కంప్లీట్‌గా అవుట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×