E-Paper
Advertisement

వాషింగ్ మిషన్ బ్యాడ్ స్మెల్ వస్తోందా? వెంటనే ఇలా చేయండి.. కేవలం 10 నిమిషాల్లో!

వాషింగ్ మిషన్ బ్యాడ్ స్మెల్ వస్తోందా? వెంటనే ఇలా చేయండి.. కేవలం 10 నిమిషాల్లో!
Advertisement

Washing Machine: ప్రస్తుతం ప్రతీ ఇంట్లో వాషింగ్ మిషన్ దర్శనమిస్తోంది. సంపన్నుల నుంచి సామాన్యుల వరకూ చాలా మంది బట్టలు ఉతికేందుకు వాషింగ్ మిషన్ మీదనే ఆధారపడుతున్నారు. అయితే ఈ వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలన్నా, బట్టల మురికి శుభ్రంగా పోవాలన్నా దాన్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే టెక్నీషియన్ అవసరం లేకుండా ఇంట్లోనే వాషింగ్ మిషన్ ను క్లీన్ చేసే పద్దతిని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డిటర్జెంట్ షెల్ఫ్ క్లీనింగ్

వాషింగ్ మిషన్ లో డిటర్జెంట్ వేసే డ్రాయర్ లేదా షెల్ఫ్ ను చాలా మంది పట్టించుకోరు. కానీ ఇక్కడే సబ్బు పేరుకుపోయి బ్యాక్టీరియా చేరుతుంది. కాబట్టి డ్రాయర్ ను బయటకు తీసి.. వేడి నీళ్లలో కాసేపు నానబెట్టండి. టూత్ బ్రష్ సాయంతో మూలల్లో ఉన్న మురికిని రుద్ది కడగండి. పూర్తిగా ఆరిన తర్వాత మళ్లీ అమర్చండి.

ఫిల్టర్ క్లీనింగ్

Advertisement

వాషింగ్ మిషన్ లోపల ఉండే ఫిల్టర్ బట్టల నుంచి వచ్చే దారాలు, దుస్తుల నుంచి వచ్చే మురికి, చెత్తను ఆపుతుంది. కాబట్టి ఫిల్టర్‌ను తీసి లోపల ఉన్న మురికిని శుభ్రం చేయండి. ఒకవేళ ఈ ఫిల్టర్ బ్లాక్ అయితే.. మిషన్ నుంచి నీళ్లు సరిగ్గా బయటకు వెళ్లవని నిపుణులు చెబుతున్నారు.

డ్రమ్ క్లీనింగ్

వాషింగ్ మిషన్ లో డ్రమ్ భాగం ఎంతో కీలకమైంది. కాబట్టి దీని క్లీనింగ్ కు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ టాప్ లోడ్ వాడుతున్నట్లయితే.. మిషన్ లో వేడి నీళ్లు నింపి, 2 కప్పుల వెనిగర్, అర కప్పు బేకింగ్ సోడా వేయండి. ఒక రౌండ్ తిప్పిన తర్వాత గంట సేపు అలాగే ఉంచి, ఆపై పూర్తి సైకిల్ రన్ చేయండి. అలాకాకుండా ఫ్రంట్ లోడ్ అయితే డిటర్జెంట్ కంపార్ట్‌మెంట్‌లో వెనిగర్, బేకింగ్ సోడా వేసి ‘టబ్ క్లీన్’ (Tub Clean) మోడ్‌లో రన్ చేయండి. ఇలా చేయడం ద్వారా డ్రమ్ క్లీన్ చేసుకోవచ్చు.

రబ్బర్ గ్యాస్కెట్

Advertisement

ఫ్రంట్ లోడ్ మెషీన్లలో తలుపు దగ్గర ఉండే రబ్బర్ బీడింగ్‌లో తేమ వల్ల బూజు పేరుకుపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వెనిగర్ కలిపిన నీటితో ఆ రబ్బర్ పొరల మధ్య తూడిస్తే బెటర్. దీనివల్ల మెషీన్ నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుందని నిపుణులు స్ఫష్టం చేస్తున్నారు.

Also Read: AC Water Tips: ఏసీ నీటిని మొక్కలకు పోస్తున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

మరికొన్ని చిట్కాలు..

వాషింగ్ మిషన్ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత అనుసరించాల్సి చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. వారి ప్రకారం.. క్లీనింగ్ పూర్తైన వెంటనే మిషన్ డోర్ క్లోజ్ చేయకూడదు. కనీసం గంట సేపు తెరిచి ఉంచితే లోపల తేమ ఆరిపోయి బూజు పట్టకుండా ఉంటుంది. మరోవైపు మిషన్ రకాన్ని బట్టి డిటర్జెంట్ ను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. కనీసం నెలకు ఒకసారి పైన చెప్పిన విధంగా డీప్ క్లీనింగ్ చేయడం వల్ల మిషన్ రిపేర్లు రాకుండా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

Also Read: 45°C వేడిలో ఈవీ కార్లు నడుపుతున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×