E-Paper
Advertisement

Air Cooler Cleaning Tips: మీ కూలర్ కూలింగ్ ఇవ్వట్లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. ఇక అంతా కూల్ కూల్!

Air Cooler Cleaning Tips: మీ కూలర్ కూలింగ్ ఇవ్వట్లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. ఇక అంతా కూల్ కూల్!
Advertisement

Air Cooler Cleaning Tips: సమ్మర్ లో కొన్ని కూలర్లు మెురాయిస్తుంటాయి. ఆశించిన స్థాయిలో చల్లగాలి ఇవ్వకపోగా.. ఉక్కపోతతో మరింత ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అయితే కూలర్ లో చల్లదనం రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన సమస్యగా క్లీనింగ్ ను చెబుతుంటారు. కాబట్టి కూలర్ ను శుభ్రంగా ఉంచుకుంటే అది బాగా పనిచేయడంతో పాటు తాజా గాలిని అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ కూలర్‌ను ఇంటి వద్దనే సులభంగా ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ దశలవారీగా పరిశీలిద్దాం.

ట్యాంక్ ఖాళీ చేయడం

కూలర్ ను క్లీన్ చేసే ముందు.. మెుట్టమెుదటగా స్విచ్ ను ఆఫ్ చేయాలి. తర్వాత కూలర్ ట్యాంక్‌లో ఉన్న పాత నీటిని బయటకు తీసేయాలి. డ్రైన్ ప్లగ్ ఉంటే దాన్ని తీసి నీటిని పూర్తిగా బయటకు పోనివ్వండి.

కూలింగ్ ప్యాడ్లను తొలగించడం

Advertisement

కూలర్ ప్యానెళ్లను (panels) జాగ్రత్తగా విప్పి.. కూలింగ్ ప్యాడ్లను బయటకు తీయండి. పాత ప్యాడ్లు ఎక్కువగా పాడైపోయి ఉంటే.. కొత్తవి మార్చడం మంచిది.

ట్యాంక్‌ను శుభ్రం చేయడం

ట్యాంక్‌లో పేరుకుపోయిన దుమ్ము, పాచిని మెత్తని బ్రష్ లేదా పాత గుడ్డతో తుడవండి. ట్యాంక్ లోపల డిటర్జెంట్ లేదా వెనిగర్ కలిపిన నీటిని పోసి ఒకసారి బాగా కడిగి శుభ్రం చేయండి.

ఫ్యాన్ – మోటార్ క్లీనింగ్

Advertisement

తర్వాతి దశలో ఫ్యాన్ బ్లేడ్లు, మోటార్ మీద పేరుకుపోయిన దుమ్మును తడి గుడ్డతో తుడవండి. అలాగే మోటార్, ఎలక్ట్రికల్ భాగాల మీద నీరు పడకుండా జాగ్రత్త వహించండి.

కూలింగ్ ప్యాడ్ల శుభ్రత

మీరు పాత ప్యాడ్లనే వాడుతున్నట్లయితే వాటిని నీటితో బాగా కడగండి. దుమ్ము పోయేలా చేయండి. అవసరమైతే వాటిని ఎండలో ఆరబెట్టండి.

తిరిగి అమర్చడం

అన్నీ ఆరిన తర్వాత ప్యాడ్లను, ప్యానెళ్లను యథావిధిగా అమర్చండి. స్క్రూలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.

Also Read: Air Coolers Under Rs 6000: మధ్యతరగతి ఇళ్లకు.. సరిగ్గా సరిపోయే బడ్జెట్ కూలర్లు.. కళ్లుమూసుకొని కొనేయచ్చు!

చివరిగా ఏం చేయాలంటే!

చివరగా ట్యాంక్‌లో తాజా నీటిని నింపి, పవర్ ఆన్ చేసి కూలర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఒకసారి పరీక్షించండి. గాలి అంతకుముందు దానితో పోలిస్తే.. మరింత చల్లగా, స్వచ్ఛంగా ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది.

Also Read: Portable AC Offers: అమేజింగ్ సమ్మర్ సేల్.. అత్యంత చౌకగా పోర్టబుల్ ఏసీలు.. భలే ఛాన్సులే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×