E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ పూర్తి.. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్!

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ పూర్తి.. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్!
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ యాక్షన్ సన్నివేశాలు.. ఆయన చెప్పే పవర్‌ఫుల్ డైలాగులు ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పినట్లు సమాచారం.

సినిమా రన్ టైం ఎంతంటే..!

సినిమా మొత్తం 2 గంటలు 29 నిమిషాల రన్‌టైమ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రన్‌టైమ్ మాస్ కమర్షియల్ సినిమాకు సరిపోయేలా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఈ చిత్రాన్ని మాస్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ హైప్ ఏర్పడింది.

ఈ సినిమాలో శ్రీలీల.. రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించగా, నేపథ్య సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, రెండు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాస్ స్టైల్, ఆయన మేనరిజమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ఈ సినిమాను మాస్ ఎంటర్‌టైనర్‌గా చూడబోతున్నామని భావిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటకు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. ‘కోల్లార్ ఏయ్ ఏతరా’ అనే మాస్ బీట్‌తో కూడిన థర్డ్ సింగిల్‌పై అభిమానుల్లో మంచి ఆసక్తి ఉంది. ఈ పాట ప్రోమోను మార్చి 10 సాయంత్రం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పూర్తి పాటను మార్చి 12న గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు.

ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ తలకు ఎర్రటి గుడ్డ కట్టుకుని మాస్ స్టెప్పులతో కనిపించడం అభిమానులను మరింత ఆకర్షిస్తోంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉండదని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన హోదాకు గౌరవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు సెన్సార్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ALSO READ: Allu Arjun AA22: అల్లు అర్జున్ కోసం షారుఖ్ ఖాన్.. అట్లీ మాస్టర్ ప్లాన్..ఐకాన్ స్టార్ అభిమానులకు పండగే..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×