E-Paper
Advertisement

మీ పేరుతో వేరే ఎవరైనా సీమ్ వాడుతున్నారా? ఇలా చెక్ చేసుకుని డియాక్టివేట్ చేయండి!

మీ పేరుతో వేరే ఎవరైనా సీమ్ వాడుతున్నారా? ఇలా చెక్ చేసుకుని డియాక్టివేట్ చేయండి!
Advertisement

Fake SIM: ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు, నకిలీ సీమ్ కార్డ్ వినియోగం బాగా పెరిగిపోతున్నాయి. ఆధార్ కార్డును ఆధారంగా చేసుకుని మీకు తెలియకుండానే వేరే ఎవరైనా సీమ్ కార్డ్ పొందే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సీమ్‌ను ఏదైనా సైబర్ మోసాలకు, అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. విచారణలో భాగంగా పోలీసులు ముందుగా మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అనవసర చిక్కులు ఫేస్ చేయాల్సి రావొచ్చు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారంగా భారత ప్రభుత్వం ‘TAFCOP’ అనే సులువైన పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అందులో మీ పేరు మీద ఉన్న నకిలీ సిమ్ ను ఈజీగా కనిపెట్టి.. డీయాక్టివేట్ చేసుకోవచ్చు.

అసలేంటీ TAFCOP పోర్టల్?

భారత ప్రభుత్వం ‘సంచార్ సాథీ’ పోర్టల్ సహకారంతో ఫ్రీ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. TAFCOP (టెలికామ్ అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్) పోర్టల్‌ను ఉపయోగించి.. మీ పేరు మీద ఎన్ని సీమ్ కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో ఇంటి నుంచే సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ పేరుపై ఏవైనా తెలియని నంబర్లు ఉంటే, వాటిని వెంటనే రిపోర్ట్ చేసి డియాక్టివేట్ చేయవచ్చు.

చెక్ చేసుకునే విధానం

Advertisement

మీ పేరు మీద నకిలీ సిమ్ ఉందో లేదో చెక్ చేసుకునేందుకు కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. ముందుగా మొబైల్ లేదా కంప్యూటర్‌లోని బ్రౌజర్‌లో tafcop.sancharsaathi.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో మీ ఆధార్ తో లింకైన 10 అంకెల మొబైల్ నంబర్‌ ను ఎంటర్ చేయండి. ఆపై స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ‘Send OTP’పై క్లిక్ చేయండి. అనంతరం మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న అన్ని యాక్టివ్ మొబైల్ నంబర్ల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Also Read: రైల్వే ఉద్యోగులు అన్ని రైళ్లలో ఫ్రీగా వెళ్లొచ్చా? లేక టికెట్ కొనాల్సిందేనా?

డియాక్టివేట్ ఎలా చేయాలి?

Advertisement

స్క్రీన్‌పై కనిపించే జాబితాలో మీది కాని నంబర్ లేదా ప్రస్తుతం మీకు అవసరం లేని నంబర్ ఉంటే.. దానిని డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం అక్కడ కనిపించే ‘Not My Number’ ఆప్షన్ ను ఎంచుకోండి. ఒకవేళ ఆ నంబర్ మీదే అయినప్పటికీ.. ప్రస్తుతం వాడటం లేకపోతే ‘Not Required’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. అనంతరం డియాక్టివేట్ చేయాలనుకుంటున్న నంబర్‌ను ఎంచుకుని.. ‘Report’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ కోసం ‘OK’ ప్రెస్ చేయగానే మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఆ నంబర్‌ను జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. మీరు రిపోర్ట్ చేసిన కొద్దిరోజుల్లోనే ఆ సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అయిపోతుంది.

Also Read: విమానం ఎక్కకపోయినా భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ ను చూడొచ్చా? ఇలా వెళ్తే సరిపోతుంది!

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×