// // బైక్ రేసర్ ప్రేమలో పడ్డ అంధురాలు.. చివర్లో కంటతడి పెట్టించే కథ -->
E-Paper
Advertisement

బైక్ రేసర్ ప్రేమలో పడ్డ అంధురాలు.. చివర్లో కంటతడి పెట్టించే కథ

బైక్ రేసర్ ప్రేమలో పడ్డ అంధురాలు.. చివర్లో కంటతడి పెట్టించే కథ
Advertisement

Romantic Action Drama: ప్రేమకథలు ఎన్నో వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు ప్రేమను మాత్రమే కాదు, జీవితాన్ని కూడా కొత్త కోణంలో చూపిస్తాయి. అలాంటి భావోద్వేగ కథతో తెరకెక్కిన మలేషియా చిత్రం Malaikat Malam ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. యాక్షన్, ప్రేమ, ఎమోషన్ కలిసిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తించేలా రూపొందింది. ప్రమాదకరమైన బైక్ రేసుల్లో దూసుకెళ్లే ఓ యువకుడు, చూపులేని యువతితో ప్రేమలో పడితే వారి జీవితాలు ఎలా మారాయి ? అనే ఆసక్తికరమైన ప్రశ్న చుట్టూనే కథ నడుస్తుంది. వేగవంతమైన రేసింగ్ సన్నివేశాలు ఒకవైపు ఆకట్టుకుంటే, మరోవైపు ఇద్దరి మధ్య పెరిగే అనుబంధం మనసును హత్తుకుంటుంది. మరి ప్రస్తుతం ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

బైక్ రేసింగ్ అంటే ప్రాణంగా భావించే ఓ యువకుడు తన జీవితాన్ని పూర్తిగా రేసింగ్ కే అంకితం చేస్తాడు. ప్రమాదాలు, పోటీలు, గెలుపోటముల మధ్యే అతని లైఫ్ గడుస్తుంటాయి. అలాంటి సమయంలో అతనికి అనుకోకుండా చూపులేని ఓ యువతి పరిచయం అవుతుంది. మొదట చిన్న పరిచయంగా మొదలైన బంధం, క్రమంగా ఇద్దరి మధ్య ఆప్యాయతగా మారి ప్రేమకు దారి తీస్తుంది.

Advertisement

అయితే ఇద్దరి ప్రపంచాలు పూర్తిగా వేరు. ఒకరికి వేగమే జీవితం అయితే, మరొకరికి మనుషులపై నమ్మకమే బలం. అయినప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో వారి బంధం మరింత బలపడుతుంది. కానీ హీరో వృత్తి కారణంగా అతని జీవితంలో వచ్చే ప్రమాదాలు, కొంతమంది వ్యక్తుల వల్ల ఎదురయ్యే సమస్యలు వారి ప్రేమకు అడ్డంకిగా మారతాయి.

ఒక దశలో ఈ ప్రేమను కాపాడుకోవాలంటే జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వారి బంధాన్ని విడదీయాలని ప్రయత్నించే సంఘటనలు వరుసగా ఎదురవుతాయి. చివరకు ఈ జంట ఆ పరీక్షల నుంచి ఎలా బయటపడ్డారు ? వారి ప్రేమకు ఎదురైన అడ్డంకులను ఎలా అధిగమించారు ? చివరికి ఏమైంది ? అనే విషయాలను దర్శకుడు తెరపై ఆకట్టుకునే విధంగా చూపించాడు.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలోని బైక్ రేసింగ్ సన్నివేశాలు యాక్షన్ అభిమానులను అలరిస్తే, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే భావోద్వేగ ఘట్టాలు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే సంఘటనలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కలిసి మరింత ఎఫెక్టివ్ గా ఉంటాయి. సినిమా నెమ్మదిగా మొదలైనా, కథ ముందుకు సాగే కొద్దీ పాత్రలతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. యాక్షన్ మాత్రమే కాదు, హృదయాన్ని తాకే ప్రేమకథ కూడా ఉంది ఇందులో. ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ప్రేమ అంటే ఒకరిని ప్రేమించడం మాత్రమే కాదు, వారి జీవితాన్ని అర్థం చేసుకుని వారికి అండగా నిలబడటమనే భావాన్ని ఈ సినిమాలో అందంగా చూపించారు. అయితే ఈ మూవీ ఓటీటీలో తెలుగులో లేదు.

Read Also: ఒక ప్రయాణం… రెండు ప్రేమకథలు… ప్రతి కుటుంబం చూడాల్సిన రోడ్ ట్రిప్ డ్రామా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×