E-Paper
Advertisement

Free Biryani Offer: గ్యాస్ సిలిండర్ ఇస్తే.. నెల రోజులు బిర్యానీ ఫ్రీ.. హోటల్ క్రేజీ ఆఫర్!

Free Biryani Offer: గ్యాస్ సిలిండర్ ఇస్తే.. నెల రోజులు బిర్యానీ ఫ్రీ.. హోటల్ క్రేజీ ఆఫర్!
Advertisement

Free Biryani Offer: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ లో గ్యాస్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లు అందక.. చాలా చోట్ల హోటల్స్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. మరికొందరైతే అధిక మెుత్తంలో డబ్బులు చెల్లించి బ్లాక్ లో సిలిండర్లు కొనుగోలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అటు ప్రజలు సైతం డొమెస్టిక్ సిలిండర్లు లభించక.. ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఎయిర్ ఫ్రైయర్లపై ఆధారపడుతున్నారు. దీనిని గమనించిన ఓ హోటల్ యజమాని.. ప్రజలకు బంపరాఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆఫర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సిలిండర్ కొట్టు.. బిర్యానీ పట్టు..!

తమిళనాడు క్రోసూరులోని తళిరోడ్ లో గల ఓ హోటల్ యజమాని.. కస్టమర్లకు క్రేజీ ఆఫర్ ఇచ్చారు. గ్యాస్ కొరత నేపథ్యంలో.. సిలిండర్ తీసుకొచ్చి ఇచ్చినవారికి నెల రోజుల పాటు ఉచితంగా చికెన్ లేదా మటన్ బిర్యానీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో మెుత్తం ఆరుగురు కస్టమర్లు వచ్చి.. సిలిండర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అందులో నలుగురు మాత్రం.. నాలుగు రోజుల పాటు వచ్చి ఉచితంగా బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత నుంచి రావడం మానేశారని తెలుస్తోంది. మెుత్తం మీద ఆ హోటల్ యజమానికి వచ్చిన ఓ ఐడియా.. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

హాట్ కేకుల్లా ఇండక్షన్ స్టవ్స్..!

Advertisement

మరోవైపు గ్యాస్ కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు ఇండక్షన్ స్టవ్స్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్ లోని స్మార్ట్ కుక్ టాప్స్.. హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. సాధారణంగా ఏడాదికి జరిగే వ్యాపారం గత నెల రోజుల్లోనే జరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఇండక్షన్ స్టవ్స్ ను ప్రజలు ఏ స్థాయిలో కొనుగోలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Also Read: Upcoming Induction Stoves: ఏప్రిల్‌లో విడుదలయ్యే.. టాప్ మోస్ట్ ఇండక్షన్ స్టవ్స్.. నిజంగా అద్భుతం భయ్యా!

ఎలక్ట్రిక్ కుకింగ్ పరికరాలకు డిమాండ్

Advertisement

ఇండక్షన్ స్టవ్స్ తో పాటు ఇతర ఎలక్ట్రిక్ కుకింగ్ పరికరాలకు సైతం మార్కెట్ లో డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. రైస్ కుక్కర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్, ఎలక్ట్రిక్ కెటిల్ వంటి వాటిని గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర ఈ కామర్స్ సైట్స్ లో భారీగా వీటికి షార్టేజ్ ఏర్పడింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

Also Read: Induction Stoves: అమెజాన్‌లో అత్యధికంగా.. సేల్ అవుతున్న ఇండక్షన్ స్టవ్స్.. ధర కూడా తక్కువే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×