E-Paper
Advertisement

రెండు రోజులు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్.. ముఖ్యమంత్రి సీరియస్, ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్‌రెడ్డి ఇష్యూ

రెండు రోజులు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్..  ముఖ్యమంత్రి సీరియస్, ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్‌రెడ్డి ఇష్యూ
Advertisement

Telangana Assembly Session 2026:  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆదివారం ఉదయం నుంచి గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ నేతల భూకబ్జా చిట్టా విప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.

సభ నుంచి  రెండు రోజులపాటు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్

Advertisement

ఆ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని స్పీకర్ చెప్పినా ఏ మాత్రం వినలేదు. ఫలితంగా స్పీకర్ పోడియంను చుట్టిముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహించిన సీఎం రేవంత్‌రెడ్డి,  ఆ పార్టీ సభ్యులకు కీలక సూచనలు చేశారు. సభ్యులు తమ తీరు మార్చుకొని సభలో ప్రవేశపెట్టిన బిల్లుల చర్చకు సహకరించాలని కోరారు. ఇదే తీరు కంటిన్యూ అయితే సస్పెన్షన్ ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు.

అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ మాత్రం వినలేదు. దీంతో అప్రమత్తమైన మార్షల్స్ బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నారు. సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అర్ధగంట ఇదే పరిస్థితి కొనసాగింది. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. సభా సంప్రదాయాలకు వ్యతిరేకంగా చైర్‌ని డిక్టేట్ చేసే సంస్కృతి ఎక్కడిదని ప్రశ్నించారు.

Advertisement

పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారం.. ముఖ్యమంత్రి సీరియస్, ఎథిక్స్ కమిటీ వద్దకు

ఇన్నేళ్లు సభ్యులుగా చేశామని చెప్పుకునే వాళ్లకు తెలిసింది ఇదేనా? స్పీకర్ ఎవరికి అవకాశం ఇస్తే వాళ్లు సభలో మాట్లాడాలన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చెయ్యాలని స్పీకర్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండురోజులపాటు సస్పెండ్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ సభ్యుడు కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసభ్యకరంగా, అవమానకరంగా ప్రవర్తించిన కౌశిక్‌రెడ్డిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఆయన వ్యవహారశైలిపై సభలో అన్ని కెమెరాలు రికార్డు అయ్యాయని అన్నారు. వారు వ్యవహరించిన తీరుపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలన్నారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు వివరించారు. విపక్ష సభ్యుల మేరకు ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్.

ALSO READ: మైనింగ్ మీద హౌస్ కమిటీకి పట్టు.. సీబీసీఐడీ ఎందుకు వద్దు?

 

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×