E-Paper
Advertisement

Air Cooler: హనీకోంబ్ ప్యాడ్ vs గ్రాస్ ప్యాడ్.. రెండింటిలో ఏ కూలర్ కొంటే బెటర్?

Air Cooler: హనీకోంబ్ ప్యాడ్ vs గ్రాస్ ప్యాడ్.. రెండింటిలో ఏ కూలర్ కొంటే బెటర్?
Advertisement

Air Cooler: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు కొనసాగుతున్నాయి. అధిక వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు.. కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే మార్కెట్ లోని కూలర్లు ప్రధానంగా హనీకోంబ్ ప్యాడ్ గ్రాస్, ప్యాడ్లతో లభిస్తున్నాయి. దీంతో ఈ రెండింటిలో ఏది మంచిదో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్యాడ్లకు ఉన్న తేడా ఏంటీ? రెండింటిలో ఏది బెటర్? ఇప్పుడు పరిశీలిద్దాం.

మన్నిక, నిర్వహణ

హనీకోంబ్ ప్యాడ్‌లు సెల్యులోజ్ పదార్థంతో తేనెపట్టు ఆకారంలో తయారవుతాయి. ఇవి చాలా దృఢంగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి ఏటా మార్చాల్సిన అవసరం లేదు. వీటిని కేవలం ఒకసారి శుభ్రం చేసుకుంటే రెండు, మూడు ఏళ్ల వరకు మన్నిక వస్తాయి. అయితే దీనికి భిన్నంగా గ్రాస్ ప్యాడ్‌లు ఉంటాయి. ఎండిపోయిన గడ్డితో వీటిని తయారు చేస్తారు. ఇవి కాలక్రమేణా కుళ్లిపోవడం లేదా పాడైపోవడం వంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి వేసవి సీజన్ ప్రారంభంలో వీటిని తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుంది.

కూలింగ్ సామర్థ్యం

Advertisement

హనీకోంబ్ ప్యాడ్‌ల నిర్మాణం.. గాలి ప్రవాహానికి (Airflow) అద్భుతమైన మార్గాన్ని అందిస్తుంది. వేడి గాలి ఈ ప్యాడ్ గుండా వెళ్లినప్పుడు నీటి ఆవిరి ప్రక్రియ సమర్థవంతంగా జరిగి గదిలోకి చల్లని గాలి వెళ్తుంది. మరోవైపు గ్రాస్ ప్యాడ్‌లు తడి ఎక్కువగా ఉన్నప్పుడు మంచి చల్లదనాన్ని ఇస్తాయి. కానీ గడ్డి మందం పెరిగినా లేదా పాతబడ్డా గాలి రాకను అడ్డుకుంటాయి. ఫలితంగా గాలి ప్రవాహం నెమ్మదిస్తుంది. దీంతో కూలింగ్ సామర్థ్యం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.

ఆరోగ్య పరంగా..

హనీకోంబ్ ప్యాడ్‌లు యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీనివల్ల వీటిపై దుమ్ము, బ్యాక్టీరియా తక్కువగా చేరుతుంది. ఇవి గదిలోకి స్వచ్ఛమైన గాలిని పంపడంలో మెరుగ్గా పనిచేస్తాయి. గ్రాస్ ప్యాడ్‌ల విషయానికి వస్తే.. నీటిలో తడవడం వల్ల వీటికి త్వరగా నాచు పట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూలర్ నుండి అప్పుడప్పుడు దుర్వాసన రావడమే కాకుండా అలర్జీలు ఉన్నవారికి ఇబ్బందిగా మారవచ్చు.

ధర పరంగా చూస్తే..

Advertisement

ధర పరంగా చూస్తే గ్రాస్ ప్యాడ్‌లు చాలా చౌకగా లభిస్తాయి. తక్కువ బడ్జెట్‌లో కూలర్ కావాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్. అటు హనీకోంబ్ ప్యాడ్‌ల ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ పదే పదే ప్యాడ్‌లు మార్చే ఖర్చు ఉండదు. కాబట్టి దీర్ఘకాలంలో హనీకోంబ్ ప్యాడ్‌లు లాభదాయకంగా ఉంటాయి.

Also Read: Biogas Business: ఇదే సరైన సమయం.. గ్యాస్ ఉత్పత్తితో బోలెడంత సంపాదన.. ఈ స్కీమ్ గురించి తెలుసా?

ఓవరాల్‌గా ఏది బెటర్?

మీరు నాణ్యత, ఎక్కువ కాలం మన్నికను కోరుకుంటే హానీకోంబ్ ప్యాడ్ ఉత్తమం. పైగా ప్రతీ సమ్మర్ కు ప్యాడ్ మార్చాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా తక్కువ బడ్జెట్, ప్రతి సంవత్సరం కూలర్ సర్వీసింగ్ చేయించుకోగలం అనుకుంటే అనుకుంటే గడ్డి ప్యాడ్ ఎంచుకోవచ్చు. అయితే దీర్ఘకాల ప్రయోజనాల పరంగా చూస్తే.. హనీకోంబ్ ప్యాడ్ లే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. ఇవి కూలింగ్ ను స్థిరంగా ఇవ్వడంతో పాటు అదనపు ఖర్చుల భారం పడకుండా చూస్తాయి.

Also Read: Drainage Gas: ప్రధాని చెప్పినట్లు.. డ్రైనేజీ నుంచి గ్యాస్ తీయొచ్చా? ఇదిగో వీళ్లు ట్రై చేస్తే ఏమైందో చూడండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×