E-Paper
Advertisement

Induction Stove: క్రేజీ ఇండక్షన్ స్టవ్.. నచ్చిన ఆహారాన్ని.. ఏ గిన్నె పెట్టైనా వండేయచ్చు!

Induction Stove: క్రేజీ ఇండక్షన్ స్టవ్.. నచ్చిన ఆహారాన్ని.. ఏ గిన్నె పెట్టైనా వండేయచ్చు!
Advertisement

Induction Stove: ఎల్‌పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో.. ఇండక్షన్ స్టవ్ లకు భారీ ఎత్తున డిమాండ్ పెరిగిపోయింది. గ్యాస్ సమస్యను అదిగమించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఇండక్షన్ స్టవ్స్ ను కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా కొనేవారి కోసం ఓ అద్భుతమైన ఇండక్షన్ స్టవ్ అందుబాటులో ఉంది. ఇతర వాటిల్లో లాగా ఇండక్షన్ పాత్రలు కాకుండా.. దీనిపై ఏ గిన్నె అయినా పెట్టుకొని వండుకోవచ్చు. అచ్చం గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకీ ఆ ఇండక్షన్ స్టవ్ ఏదీ? దాని ఫీచర్లు, లాభాలు, ధర వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్రేజీ ఇండక్షన్ స్టవ్ ఏదంటే?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉదితి ఇన్ ఫ్రార్డ్ కుక్ టాప్ (Uditi Infrared Cooktop) అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇది చూడటానికి ఇండక్షన్ స్టవ్ లాగే ఉన్నప్పటికీ పనితీరులో మాత్రం ఇతర వాటికి చాలా భిన్నంగా ఉంటుంది. ఉదితి అప్లయన్సెస్ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఇండక్షన్ స్టవ్.. రూ.2,999కి లభిస్తోంది.

ఫీచర్లు ఏంటంటే?

Advertisement

ఏ పాత్రనైనా వాడొచ్చు: సాధారణంగా ఇండక్షన్ స్టవ్‌కు కేవలం ఇండక్షన్ బేస్ ఉన్న పాత్రలే వాడాల్సి ఉంటుంది. కానీ ఈ ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్‌పై స్టీల్, అల్యూమినియం, రాగి, మట్టి పాత్రలు, గాజు పాత్రలు ఇలా ఏదైనా వాడుకోవచ్చు.

హై-పవర్ హీటింగ్: ఈ ఇండక్షన్ కుక్కర్ 2200W సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫలితంగా వంటను చాలా వేగంగా పూర్తి చేయవచ్చు.

Advertisement

టచ్ కంట్రోల్స్, టైమర్: దీనిలో ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి సులభమైన డిజిటల్ టచ్ బటన్లు ఉన్నాయి. వంట అయ్యాక ఆటోమేటిక్‌గా ఆఫ్ అవ్వడానికి టైమర్ సౌకర్యాన్ని సైతం అందించారు.

సెరామిక్ గ్లాస్ టాప్: ఈ ఇండక్షన్ స్టవ్ టాప్ ను సెరామిక్ గ్లాస్ తో రూపొందించారు. కాబట్టి ఇది చూడటానికి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తుంది. క్లీన్ చేయడం కూడా చాలా సులభం. అధిక వేడిని సైతం ఈ గ్లాస్ తట్టుకోలగదని కంపెనీ వర్గాలు తెలిపాయి.

కొనడం వల్ల కలిగే లాభాలు?

కొత్త పాత్రలు అక్కర్లేదు: మీ వంటగదిలో ఉన్న పాత పాత్రలన్నింటినీ నిస్సందేహంగా దీనిపై వాడుకోవచ్చు. కొత్తగా ఇండక్షన్ పాత్రలు కొనాల్సిన అవసరం లేదు.

సమ్మర్‌లో బస్ట్: గ్యాస్ స్టవ్ లాగా దీనిపై మంట ఉండదు కాబట్టి ఎండకాలంలో వంట చేసేటప్పుడు వేడి ఎక్కువగా అనిపించదు. ఫ్యాన్ వేసుకున్నా మంట ఆరిపోతుందనే భయం ఉండదు.

డైరెక్ట్ హీటింగ్: ఈ ఇండక్షన్ స్టవ్.. ఇన్ ఫ్రారెడ్ కిరణాల ద్వారా నేరుగా పాత్రను వేడి చేస్తుంది. దీనివల్ల వేడి సమానంగా వ్యాపించి ఆహారం అన్ని వైపులాగ చక్కగా ఉడుకుతుంది.

ఈజీ క్లీనింగ్: వంట చేస్తున్నప్పుడు ఇండక్షన్ స్టవ్ పైనా ఆహారం పడినా లేదా ఒలికినా ఎలాంటి సమస్య ఉండదు. గ్లాస్ సర్ఫేస్ కాబట్టి తడి బట్టతో సులభంగా తుడిచేయవచ్చు.

Also Read: Dishwasher Uninstall: డిష్ వాషర్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలా? ఈ స్టెప్స్ పాటిస్తే సరి.. ఈజీగా పని అయిపోద్ది!

మల్టీ ఫంక్షన్ మోడ్స్: ఇందులో చాలా రకాల కుకింగ్ మోడ్స్ ఉన్నాయి. దోశలు వేయడానికి, ఫ్రై చేయడానికి, పాలు వేడి చేయడానికి ఇలా వేర్వేరు మోడ్స్ ఉన్నాయి. అంతేకాదు చపాతీని పెనం అవసరం లేకుండానే నేరుగా స్టవ్ పై వేసి కాల్చవచ్చు.

ముఖ్య గమనిక: ఈ ఇండక్షన్ స్టవ్ ధర, ఫీచర్లు, లాభాలు కంపెనీ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అధారంగానే ఇవ్వడం జరిగింది. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కొనే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. ప్రొడక్ట్ లోని లోటు పాట్లకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.

Also Read: Drainage Gas: ప్రధాని చెప్పినట్లు.. డ్రైనేజీ నుంచి గ్యాస్ తీయొచ్చా? ఇదిగో వీళ్లు ట్రై చేస్తే ఏమైందో చూడండి!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×