E-Paper
Advertisement

HONDA EV : రెండేళ్లలో హోండా ఈవీ!

HONDA EV : రెండేళ్లలో హోండా ఈవీ!
Advertisement

HONDA EV : కొత్త సంవత్సరంలో జపాన్ ఆటోమేకర్ హోండా(Honda) తీపికబురు అందించింది. ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్(Battery Electric Vehicles)కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రంగంలోకి అడుగిడుతోంది. లాస్‌వెగాస్‌లో ఆరంభమైన కన్య్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES)-2024లో రెండు కొత్త ఈవీ కాన్సెప్ట్‌లను ఆవిష్కరించింది. ‘0 సిరీస్’తో ఈ పాసింజర్ వెహికల్స్ ను ప్రపంచవ్యాప్తంగా విక్రయించనుంది.

భవిష్యత్తు మొత్తం ఈవీ వాహనాలే రానున్న దృష్ట్యా 75 ఏళ్ల ఈ దిగ్గజ ఆటోమేకర్ విద్యుత్తు వాహనాల తయారీపై దృష్టి సారించింది. ప్రస్తుతం యూరప్ దేశాల కోసం ఈ-మినీకార్ ను ఉత్పత్తి చేస్తున్న హోండా సంస్థ.. జనరల్ మోటార్స్‌‌తో కలిసి చౌకైన ఈవీలను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. వీటిని హోండా లోగోతోనే విక్రయించే అవకాశాలున్నాయి.

Advertisement

జీరో(0) సిరీస్ కింద రెండు ఈవీ కాన్సెప్ట్‌లను హోండా బహిర్గతపర్చింది. సెలూన్, స్పేస్-హబ్ పేర్లతో వీటిని పరిచయం చేసింది. సెలూన్‌ను ఫ్లాగ్‌షిప్ కాన్సెప్ట్‌గా హోండా అభివర్ణిస్తోంది. రెండేళ్లలో ఉత్తర అమెరికా మార్కెట్‌లోకి దీనిని ప్రవేశపెడతారు. అలాగే జపాన్, ఆసియా, యూరప్, ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణ అమెరికా మార్కెట్లలోకి ఇది అందుబాటులోకి రానుంది.

ఇక రెండో కాన్సెప్ట్ ‘స్పేస్-హబ్’ కాస్త పెద్దదిగా ఉంటుంది. ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున స్పేస్ హబ్ (Space Hub) ఈవీ కాన్సెప్ట్ గురించి మరే వివరాలు వెల్లడించలేదు. జీరో సిరీస్‌కు సంబంధించి హోండా సంస్థ కొత్త లోగోను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించింది.

Advertisement

Honda Ev, honda Electric Vehicles, EV by Honda, Honda Electric cars, Electric cars By Honda

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×