E-Paper
Advertisement

iQOO Neo 7 5G: స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు.. అదిరే ఫీచర్లు ఈ ఫోన్ సొంతం..!

iQOO Neo 7 5G: స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు.. అదిరే ఫీచర్లు ఈ ఫోన్ సొంతం..!
Advertisement

iQOO Neo 7 5G: కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం వీటిపైనే ప్రముఖ కంపెనీలు కూడా దృష్టి సారిస్తున్నాయి. అందులో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ నియో ఒకటి. ఈ కంపెనీ రూ.30వేలలో ‘ఐక్యూ నియో7 5జీ’ సిరీస్‌ను లాంచ్ చేసింది. అయితే దీనికి అప్‌గ్రేడ్‌గా తాజాగా ఐక్యూ నియో9 సిరీస్‌ లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో నియో7 మోడళ్ల ధరలను కంపెనీ భారీగా తగ్గించింది.

ఐక్యూ నియో 7 స్మార్ట్‌ఫోన్ గతేడాది ఫిబ్రవరిలో లాంచ్ అయింది. ఈ ఫోన్ 8/128జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా 12/256జీబీ వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. అయితే ఈ రెండు మోడళ్లపై కంపెనీ మంచి తగ్గింపును అందిస్తోంది. 8/128జీబీ వేరియంట్‌పై రూ.3 వేల డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.24,999కి కొనుక్కోవచ్చు. అలాగే 12/256జీబీ వేరియంట్‌పై రూ.4వేల తగ్గింపు అందిస్తోంది. దీంతో ఈ మోడల్‌ను రూ.27,999కి సొంతం చేసుకోవచ్చు. ఇది ఫ్రాస్ట్ బ్లూ, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Advertisement

ఫీచర్స్..

6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 SoC చిప్‌సెట్‌తో రానుంది. కాగా ఈ ప్రాసెసర్‌తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. అలాగే 64 MP ప్రైమరీ కెమెరా, 2 MP డెప్త్, 2 MP మాక్రో కెమెరాలు ఉంటాయి. అలాగే సెల్ఫీల కోసం 16 MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. 5000mAh బ్యాటరీ ఉంటుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×