// // HMD Vibe 2 5G: రూ.15వేల లోపే HMD Vibe 2 5G కొత్త వేరియంట్! -->
E-Paper
Advertisement

యూజర్ల డిమాండ్‌తో మార్కెట్లోకి HMD Vibe 2 5G కొత్త వేరియంట్.. సేల్స్ ఎప్పటి నుంచంటే?

యూజర్ల డిమాండ్‌తో మార్కెట్లోకి HMD Vibe 2 5G కొత్త వేరియంట్.. సేల్స్ ఎప్పటి నుంచంటే?
Advertisement

HMD Vibe 2 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ HMD భారత మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. గత నెలలోనే వైబ్ సిరీస్‌లో ‘హెచ్ఎమ్‌డీ వైబ్ 2 5G’ మోడల్‌ను కంపెనీ లాంచ్ చేసింది. అప్పట్లో 4GB+64GB, 4GB+128GB వేరియంట్లను మాత్రమే మే 26 నుంచి అమ్మకానికి ఉంచింది. అయితే యూజర్ల నుంచి వచ్చిన విపరీతమైన డిమాండ్ కారణంగా.. తాజాగా ఈ ఫోన్‌లో 6GB+128GB స్టోరేజ్ గల మరో కొత్త వేరియంట్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది.

కొత్త వేరియంట్ ధర, ఆఫర్లు:

ఈ కొత్త 6GB+128GB వేరియంట్ అసలు ధర రూ.16,999గా ఉంది. అయితే లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ డిస్కౌంట్లతో కలిపి దీనిని కేవలం రూ.14,999కే సొంతం చేసుకోవచ్చు. జూన్ 16, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. కాగా, పాత 4GB+128GB మోడల్ యథాతథంగా రూ.12,999 ధరకే అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

Advertisement

Also Read: అద్భుతం.. iPhone 18 Pro Max ఫైనల్ కలర్స్ ఇవే.. ఒక్కసారి చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

రెండేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్:

ఈ HMD Vibe 2 5G ఫోన్ 6.745 అంగుళాల పెద్ద హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తోంది. ఫోన్ స్మూత్‌గా పనిచేయడానికి దీనిలో 120Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. అలాగే ఈ ఫోన్‌లో ఉపయోగించిన యూనిసోక్ T8200 ప్రాసెసర్ గేమింగ్‌కు, మల్టీటాస్కింగ్‌కు చక్కగా సెట్ అవుతుంది. అలాగే మెమొరీని పెంచుకోవాలనుకునే వారి కోసం ఎస్‌డీ కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకునే సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీ:

Advertisement

ఫొటోలు, వీడియోల కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో పాటు మరో సెకండరీ కెమెరాను అమర్చారు. అలాగే సెల్ఫీల కోసం ముందు వైపు 8MP కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్ ప్రత్యేకతల్లో చెప్పుకోదగ్గది దీని బ్యాటరీ. ఇందులో ఏకంగా 6000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. దీనికి తోడు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ఇతర ముఖ్యమైన ఫీచర్లు:

భద్రత కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. దుమ్ము, చిన్నపాటి నీటి చినుకుల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ ఉంది. దీనిలో 5G నెట్‌వర్క్‌తో పాటు డ్యూయల్ 4G, వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్-సి వంటి అన్ని రకాల కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్ ధరలో మంచి 5G ఫోన్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఈ కొత్త వేరియంట్ మంచి ఆప్షన్ కానుంది.

Also Read: పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో Oppo Reno 16 Pro ఎంట్రీ.. గీక్‌బెంచ్‌లో లీకైన వివరాలు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×