E-Paper
Advertisement

సంచిత ఉగాలే చివరి రీల్ వైరల్.. నమ్మలేకపోతున్న అభిమానులు!

సంచిత ఉగాలే చివరి రీల్ వైరల్.. నమ్మలేకపోతున్న అభిమానులు!
Advertisement

Sanchita Ugale Last Reel Viral: నటి సంచిత ఉగాలే మరణ వార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో, మరణానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.

నవ్వుతూ ఉత్సాహంగా కనిపించిన సంచిత

సంచిత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ రీల్‌ను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె ఓ హిందీ పాటకు లిప్‌ సింక్ చేస్తూ, చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. వీడియోలో ఆమె చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నట్లు కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది గంటల తర్వాత ఇలాంటి విషాద వార్త వినాల్సి రావడం ఎవరూ ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. ఆమె చివరి వీడియో ప్రస్తుతం వివిధ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంచిత చివరిసారిగా కనిపించిన వీడియో కావడంతో అభిమానులు దానిని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఆమె ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని, సాధారణంగానే ఉన్నట్లు అనిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

సంచిత మృతికి పలువురు ప్రముఖల నివాళి

సంచిత మృతి వార్త తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. సంచిత అభిమానులతో పాటు సినిమా, టీవీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

ఇంతకీ సంచిత ఎందుకు చనిపోయింది?

Advertisement

అటు సంచిత మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. సంచిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

చిన్న వయసులోనే మంచి గుర్తింపు

ఇండస్ట్రీలో చిన్న వయసులోనే సంచితకు మంచి గుర్తింపు వచ్చింది. పలు సీరియల్స్‌ లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తన నటనతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే సంచిత, తన అభిమానులతో తరచూ ఫోటోలు, వీడియోలు పంచుకునేవారు. అందుకే, ఆమె చివరి వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవ్వుతూ, ఉల్లాసంగా కనిపించిన వ్యక్తి గురించి ఇలాంటి వార్త వినడం బాధాకరమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: ప్రముఖ నటి ఆత్మహత్య.. షాక్ లో ఇండస్ట్రీ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×