E-Paper
Advertisement

టీవీ, ఏసీలపై ఆఫర్ల వర్షం.. 40% డిస్కౌంట్‌, రూ.10 వేల క్యాష్ బ్యాక్.. సామాన్యులకు పండగే!

టీవీ, ఏసీలపై ఆఫర్ల వర్షం.. 40% డిస్కౌంట్‌, రూ.10 వేల క్యాష్ బ్యాక్..  సామాన్యులకు పండగే!
Advertisement

Hisense Offers: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయన్స్ బ్రాండ్ ‘హైసెన్స్ ఇండియా’ (Hisense India).. భారతీయ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ-కామర్స్ దిగ్గజాలు నిర్వహించనున్న ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ (Amazon Prime Day), ‘ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్’ (Flipkart GOAT Sale) లలో తన సరికొత్త స్మార్ట్ టెలివిజన్లు, ఎయిర్ కండీషనర్లపై ఏకంగా 40 శాతం వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక సేల్ ఆఫర్లు జూలై 4 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

టీవీలపై రూ.10 వేల క్యాష్‌బ్యాక్!

ఈ సేల్‌లో భాగంగా హైసెన్స్ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారికి కంపెనీ అదిరిపోయే ప్రయోజనాలను కల్పిస్తోంది. 40 శాతం వరకు నేరుగా లభించే డిస్కౌంట్లతో పాటు అదనంగా రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా పొందొచ్చు. వీటితో పాటు ఎలాంటి ముందస్తు చెల్లింపు అవసరం లేని ‘జీరో డౌన్ పేమెంట్’ ఆప్షన్, అలాగే 18 నెలల వరకు ‘నో కాస్ట్ ఈఎంఐ’ (No Cost EMI) సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. దీనివల్ల మధ్యతరగతి వినియోగదారులు సైతం తమ ఇంట్లోని టీవీలను ప్రీమియం స్థాయికి సులువుగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని హైసెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సేల్‌లో అధునాతన టీవీలు

Advertisement

మరోవైపు సినిమా ప్రియులు, గేమర్లు, క్రీడా అభిమానులను ఆకట్టుకునేలా హైసెన్స్ తన ప్రీమియం టీవీ శ్రేణిని ఈ సేల్లో రంగంలోకి దించింది. ఈ ఆఫర్లలో లేటెస్ట్ ULED Mini LED, QLED, 4K స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇవి ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్‌తో కూడిన మినీ-ఎల్‌ఈడీ టెక్నాలజీ, హై-వ్యూ ఏఐ ఇంజిన్, డాల్బీ విజన్ ఐక్యూ, డాల్బీ అట్మోస్ సౌండ్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన గేమ్ మోడ్ ప్రో వంటి అత్యాధునిక ఫీచర్లతో వస్తున్నాయి. ఇవి అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్స్‌ను అందిస్తాయని హైసెన్స్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఏసీలపై రూ. 4,000 క్యాష్‌బ్యాక్

ఈ-కామర్స్ దిగ్గజాల సేల్ లో హైసెన్స్.. తన అధునాతన ఏసీలపై కూడా ఆఫర్లు ప్రకటించింది. హైసెన్స్ ‘ఇంటెల్లి కూల్ ప్రో సిరీస్’ (Intelli Cool Pro Series) స్మార్ట్ ఎయిర్ కండీషనర్లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు గరిష్టంగా రూ. 4,000 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. ఈ స్మార్ట్ ఏసీలు గదిని త్వరగా చల్లబరచడమే కాకుండా, విద్యుత్‌ను కూడా భారీగా ఆదా చేస్తాయని పేర్కొన్నాయి. ఆధునిక స్మార్ట్ ఫీచర్లతో రూపొందిన ఈ ఏసీలు.. ప్రతీ ఇంటికీ పర్ఫెక్ట్ ఛాయిస్‌గా అని తెలియజేశాయి.

Advertisement

Also Read: దోమలకు వెల్లుల్లి తినిపిస్తే ఏమవుతుందో తెలుసా? మైండ్ బ్లోయింగ్ పరిశోధన!

ఆఫర్లపై సీఈఓ ఏమన్నారంటే?

ఈ ఆఫర్లపై హైసెన్స్ ఇండియా సీఈఓ పంకజ్ రాణా స్పందించారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ సాంకేతికతను భారతీయ వినియోగదారులకు తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ‘అమెజాన్ ప్రైమ్ డే, ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్స్ వంటి షాపింగ్ పండుగలు ఇళ్లను ప్రీమియం టీవీలు, ఏసీలతో అప్‌గ్రేడ్ చేసుకోవడానికి సరైన సమయం. మా ప్రీమియం, లార్జ్ స్క్రీన్ టీవీల అమ్మకాలు 50 నుంచి 60 శాతం వరకు పెరుగుతాయని ఆశిస్తున్నా. భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున తక్కువ ధరలకే సరికొత్త టెక్నాలజీని సొంతం చేసుకునేందుకు వినియోగదారులకు ఇదొక సువర్ణావకాశం’ అని చెప్పుకొచ్చారు.

Also Read: తక్షశిలకు పాక్ తూట్లు.. ‘వారసత్వ హోదా’ ఊడుతుందా? యునెస్కో సీరియస్ వార్నింగ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×