E-Paper
Advertisement

ఏ డ్రెస్‌కైనా పర్ఫెక్ట్ మ్యాచ్.. ట్రెండింగ్‌లో ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ ఉమెన్స్ వాచెస్

ఏ డ్రెస్‌కైనా పర్ఫెక్ట్ మ్యాచ్.. ట్రెండింగ్‌లో ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ ఉమెన్స్ వాచెస్
Advertisement

Best stainless steel women watches: ఈ రోజుల్లో వాచ్ అనేది కేవలం టైం చూసుకోవడానికి మాత్రమే కాదు.. అది మన పర్సనాలిటీని, స్టైల్‌ని చూపించే ఒక పవర్‌ఫుల్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్! ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్, కాలేజ్ గర్ల్స్ రోజూ వేసుకునేందుకు స్టెయిన్‌లెస్ స్టీల్ వాచెస్ బెస్ట్ ఛాయిస్. ఇవి క్లాసీ లుక్ ఇవ్వడమే కాదు.. చాలా కాలం పాటు పాడవకుండా ఉంటాయి. జులైలో మార్కెట్లో ట్రెండ్ అవుతున్న,ధర, డ్యూరబిలిటీని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసే టాప్ 5 ఉమెన్స్ వాచెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

5 బెస్ట్ స్టెయిన్‌లెస్ స్టీల్ వాచెస్:

1. కాసియో ఎంటైసర్ (Casio Enticer-Rs.3,500-6,000):

Advertisement

బడ్జెట్ ధరలో బ్రాండెడ్ లుక్ , త్వరగా పాడవకుండా ఉండే లాగా కాలేజ్ గర్ల్స్ ,యంగ్ ప్రొఫెషనల్స్ కోసం కాసియో ఎంటైసర్ సిరీస్ బెస్ట్ ఛాయిస్. దీని సింపిల్ సిల్వర్ స్టెయిన్‌లెస్ స్టీల్ డిజైన్ చాలా క్లాసీగా ఉంటుంది. ఇది వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో రావడం వల్ల చిన్నపాటి వర్షం లేదా నీటి తుంపర్లకు అస్సలు పాడవ్వదు. తక్కువ ధరలోనే ప్రీమియం లుక్ దీని సొంతం.

2. టైటాన్ రాగా క్లాసిక్ (Titan Raga Classic–Rs.5,500-8,500):

Advertisement

ఇండియన్ ఉమెన్స్‌కు టైటాన్ రాగా అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం. ఈ సిరీస్‌లోని స్టెయిన్‌లెస్ స్టీల్ వాచెస్ కేవలం వాచ్ లాగా కాకుండా ఒక బ్యూటిఫుల్ బ్రాస్‌లెట్ లాగా కనిపిస్తాయి. దీని రోజ్ గోల్డ్ లేదా సిల్వర్ ఫినిషింగ్ శారీస్, కుర్తీలు ,వెస్ట్రన్ వేర్స్‌కు అదిరిపోయే రాయల్ లుక్‌ను ఇస్తుంది. ఇది రోజూ వాడటానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

3. ఫాసిల్ కార్లీ క్రోనోగ్రాఫ్ (Fossil Karli Chronograph–Rs.9,000-13,000):

మీకు కొంచెం బోల్డ్ అండ్ బాస్ లేడీ లుక్ కావాలంటే.. ఫాసిల్ బ్రాండ్ పర్ఫెక్ట్ ఆప్షన్. దీని స్టెయిన్‌లెస్ స్టీల్ కేస్ , రోమన్ నంబర్ డయల్ వాచ్‌కి వింటేజ్ లుక్‌ను ఇస్తాయి. ఆఫీస్ సూట్స్ లేదా ఫార్మల్స్ వేసుకునే వర్కింగ్ ఉమెన్‌కి ఈ వాచ్ ఒక పర్ఫెక్ట్ మ్యాచ్. దీని డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువ, రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు.

Also Read: రూ.738కే పైసా వసూల్ స్పీకర్.. దీని ముందు హోమ్ థియేటర్స్ బలాదూర్ !

4. టామీ హిల్‌ఫిగర్ క్లాసిక్ (Tommy Hilfiger Classic–Rs.10,500-15,000):

స్పోర్టీ , క్యాజువల్ లుక్‌ను ఇష్టపడే మోడరన్ ఉమెన్ కోసం ఈ వాచ్ సూపర్బ్ ఛాయిస్. దీని బ్లూ లేదా వైట్ డయల్‌తో వచ్చే స్టెయిన్‌లెస్ స్టీల్ మెష్ స్ట్రాప్ చేతికి చాలా లైట్ వెయిట్‌గా, ట్రెండీగా అనిపిస్తుంది. జీన్స్, టీషర్ట్స్,వన్-పీస్ డ్రెస్సులపైకి ఇది చాలా స్టైలిష్‌గా సెట్ అవుతుంది.

5. మైఖేల్ కోర్స్ పార్కర్ (Michael Kors Parker–Rs.18,000-24,000):

కొంచెం లగ్జరీ , గ్లామరస్ లుక్ ఇష్టపడేవారి కోసం మైఖేల్ కోర్స్ వాచెస్ కేక పుట్టిస్తాయి. దీని స్టీల్ స్ట్రాప్ చుట్టూ.. డయల్ లోపల ఉండే చిన్న చిన్న క్రిస్టల్ స్టోన్స్ మెరుస్తూ, అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. గ్రాండ్ ఫంక్షన్లు, వెడ్డింగ్స్ మరియు నైట్ పార్టీలకు ఈ వాచ్ పెట్టుకుంటే మీరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్.

ఒక మంచి వాచ్ అనేది కేవలం టైమ్ చెప్పేది కాదు, మన పర్సనాలిటీని ఎలివేట్ చేసే ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్‌మెంట్. రూ.3,500 బడ్జెట్ నుంచి లగ్జరీ రేంజ్ వరకు లభిస్తున్న ఈ 5 స్టెయిన్‌లెస్ స్టీల్ వాచెస్ లుక్‌లో నెంబర్ వన్. మరి మీ టేస్ట్‌కి ఏది కరెక్ట్‌గా సెట్ అవుతుందో చూసుకుని ఇప్పుడే మీ ఫేవరెట్ వాచ్‌ను ఆర్డర్ చేసేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×