E-Paper
Advertisement

Ghost Fish : రెయిన్‌బో కలర్స్‌ను ప్రతిబింబిస్తున్న చేప చర్మం..

Ghost Fish : రెయిన్‌బో కలర్స్‌ను ప్రతిబింబిస్తున్న చేప చర్మం..
Advertisement
Ghost Fish

Ghost Fish : మనుషులు జీవించే భూమిపైనే ఇంకా ఎన్నో ఇతర జీవరాశులు కూడా జీవిస్తుంటాయి. కానీ వాటిలో మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. కొన్ని జంతువుల గురించి విన్నా, చూసినా.. కొంతమంది ఇప్పటికీ ఆశ్చర్యపోవడానికి కారణం ఇదే. అలాంటి వాటిలో ఒకటి ఘోస్ట్ ఫిష్. మామూలుగా ఈ చేపను చూస్తే.. అసలు దీనికి చర్మం ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ చర్మంపై లైట్ వేసి చూస్తే.. రెయిన్‌బో లాగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అసలు అలా ఎలా జరుగుతుంది అనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు.

ఘోస్ట్ ఫిష్ అనేది ఎక్కువగా థాయ్‌లాండ్‌లో కనిపిస్తుంది. ఇది సముద్రాల్లో జీవించే చేపల జాతికి చెందినది కాదు. ఇది ఒక అక్వేరియం ఫిష్. అయితే చూడడానికి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే ఈ చేప చర్మంపై లైట్ వేస్తే.. అంత గ్లో ఎలా వస్తుంది అని తెలుసుకునే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. ఆ గ్లో అనేది చేప లోపల నుండి వస్తుందని వారు గుర్తించారు. మామూలుగా ఆ చేప చర్మంపై లైట్ వేసినప్పుడు అది చేపలోని ఒక చిన్న మజిల్‌పై పడి తిరిగి కలర్‌ఫుల్ స్పెక్ట్రమ్‌ను బయటికి విడుదల చేస్తుంది.

Advertisement

మామూలుగా ఈ ఘోస్ట్ ఫిష్‌లను ఘోస్ట్ క్యాట్‌ఫిష్, గ్లాస్ క్యాట్‌ఫిష్ అని కూడా అంటారు. ఇవి థాయ్‌ల్యాండ్‌లోని చిన్న చిన్న నదులలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ చేపకు ఉన్న ప్రత్యేకత వల్ల దీనికి అక్వేరియం ఫిష్ అని పేరుపెట్టి కమర్షియల్ మార్కెట్లో విక్రయించడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఒక ప్రాణిపై లైట్ వేస్తే.. అది తిరిగి కలర్‌ఫుల్‌గా ప్రతిబింబించడం అనేది కొన్నిసార్లు జరిగింది. కానీ చేప జాతిలో ఇలాంటిది జరగడం ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

హమ్మింగ్ బర్డ్ రెక్కలు, బటర్‌ఫ్లై రెక్కలపై కూడా లైట్ వేస్తే.. ఇలాంటి ఒక కలర్‌ఫుల్ స్పెక్ట్రమ్ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాటిలాగా ఘోస్ట్ ఫిష్‌లో స్కేల్స్ లేకపోయినా.. ఈ రిఫ్లెక్షన్ రావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఇక అక్వేరియం స్టోర్‌లో ఈ ఫిష్‌ను చూసి ఇంప్రెస్ అయిన శాస్త్రవేత్త చేసిన పరిశోధనల్లో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. స్కేల్స్ లేకపోయినా కూడా వాటిలో ఉండే మజిల్స్ వల్లే ఈ కలర్‌ఫుల్ స్పెక్ట్రమ్ బయటపడుతుందన్న విషయం తెలిసింది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×