E-Paper
Advertisement

Gold Slipper : ఆ చెప్పులు చాలా కాస్ట్లీ గురూ..! రేటు రూ.69.40 లక్షలు.. ఎందుకో తెలుసా..?

Gold Slipper : ఆ చెప్పులు చాలా కాస్ట్లీ గురూ..! రేటు రూ.69.40 లక్షలు.. ఎందుకో తెలుసా..?
Advertisement

Gold Slipper: చాలామంది ఎదుటివారిపై కోపం వస్తే చెప్పుతో కొడతా అంటారు. ఈ మధ్యకాలంలో పొలిటికల్ లీడర్లు చెప్పుతో కొడతామని తమ ప్రత్యర్థి పార్టీల నేతలను హెచ్చరిస్తున్నారు. చెప్పు అంటే విలువలేనిది అని అందరూ భావిస్తారు. అందుకే వాటిని గుమ్మం ముందే వదిలి ఇంటిలోకి వెళతారు. కానీ ఈ చెప్పులు చాలా కాస్ట్లీ గురూ ..! అక్షరాల 69 లక్షల 40 వేల రూపాయిలు. ఎందుకు అంత ఖరీదంటారా? ఆ చెప్పుల్లో 1.2 కేజీల గోల్డ్ ఉంది. అందుకే అది కాస్ట్లీ. చెప్పులేంటి?.. బంగారం ఉండటం ఏంటి అనుకుంటున్నారా? అయితే చెప్పుల్లో గోల్డ్ కథ తెలుసుకుందాం..!

ఓ ఫ్లైట్ బెంగళూరు విమానాశ్రయంలో దిగింది. ప్రయాణికులందర్నీ చెక్ చేసి కస్టమ్స్ అధికారులు బయటకు పంపుతున్నారు. ఇంతలో ఓ ప్రయాణికుడు ధరించిన చెప్పులపై కస్టమ్స్ అధికారులకు డౌట్ వచ్చింది. క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ చెప్పుల అడుగుభాగంలో గోల్డ్ ను గుర్తించారు. ఆ బంగారం ఎంత ఉందో వేయింగ్ మిషన్ పై ఉంచారు. ఆ గోల్డ్ ఎంత ఉందో చూసి.. కస్టమ్స్ అధికారులు షాక్ తిన్నారు. ఆ గోల్డ్ 1.2 కేజీలు ఉంది. మార్కెట్ లో ఈ బంగారం విలువ అక్షరాల 69.40 లక్షలు. దీంతో ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇంతకీ ఆ విమానం బ్యాంకాక్ నుంచి బెంగళూరు వచ్చింది.

Advertisement

సినిమాల్లో చూపించే స్మగ్లింగ్ సీన్లను తలదన్నే రీతిలో స్మగ్లర్లు తమ క్రిమినల్ క్రియేటివిటీ చూపిస్తున్నారు. చాలా సినిమాల్లో స్మగ్లింగ్ ఎలా చేస్తారో చూపించారు. పుష్ప మూవీలో ఎర్ర చందనాన్ని పాల వ్యానుల్లో ఎలా తరలిస్తారో చూశాం. కానీ రియల్ లైఫ్ లో స్మగ్లర్లు సినిమా దర్శకుల క్రియేటివిటీని మించి ఆలోచిస్తున్నారు.

ముఖ్యంగా విదేశాల నుంచి భారత్ కు డ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. విమానాశ్రయాల్లో ఇలాంటి కేసులు ఈ మధ్యకాలంలో భారీగా వెలుగుచూస్తున్నాయి. ఎయిర్ పోర్టుల్లో గోల్డ్ సీజ్ కేసులు కామన్ గా మారిపోయాయి. కొందరు లోదుస్తుల్లోనూ బంగారం తరలిస్తూ పట్టుబడిన వారు ఉన్నారు. ఇలా స్మగ్లింగ్ ముఠాలు న్యూ ఐడియాస్ తో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కొందరే పట్టుబడుతున్నారు. దొరకని స్మగ్లర్లు ఎంతో మంది ఉన్నారు. బీ అలెర్ట్ @ ఎయిర్ పోర్ట్స్..!

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×