E-Paper
Advertisement

ఇయర్‌‌బడ్స్ vs ఇయర్‌‌ఫోన్స్ vs హెడ్‌ఫోన్స్.. ఈ మూడింట్లో ఏది బెస్ట్?

ఇయర్‌‌బడ్స్ vs ఇయర్‌‌ఫోన్స్ vs హెడ్‌ఫోన్స్.. ఈ మూడింట్లో ఏది బెస్ట్?
Advertisement

Headphones vs Earphones vs Earbuds: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరా కచ్చితంగా ఉండే యాక్సెసరీ ఏదైనా ఉందంటే అది ఆడియో డివైజే. అయితే మార్కెట్‌లోకి వెళ్తే హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఇలా రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. దీంతో వాటిలో ఏది సెట్ అవుతుంది? దేనిలో సౌండ్ క్వాలిటీ బాగుంటుంది? ఏది వాడితే చెవులకు సేఫ్? అనే ప్రశ్న సహజంగానే మెుబైల్ యూజర్లకు ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూడింటికి మధ్య తేడా? దేనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.

కంఫర్ట్ పరంగా చూస్తే..

ఇయర్‌బడ్స్, ఇయర్‌ఫోన్స్ చాలా చిన్నగా లైట్ వెయిట్ తో ఉండటం వల్ల జేబులో వేసుకుని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. జిమ్‌లో వర్కవుట్స్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు ఇవి సౌకర్యంగా అనిపిస్తాయి. హెడ్ ఫోన్స్ విషయానికి వస్తే.. ఇవి కాస్త బరువుగా, పెద్దగా ఉంటాయి. అయితే ఇవి చెవి లోపలికి కాకుండా.. తలపై నుండి చెవులను కవర్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ సమయం వాడినా పెద్దగా ఇబ్బంది అనిపించదు. క్లాసులు విన్నా, ఆఫీస్ కాల్స్ మాట్లాడినా చెవుల లోపల నొప్పి రాకుండా ఉంటాయి.

ఆడియో క్వాలిటీ

Advertisement

మ్యూజిక్‌ను ఆస్వాదించే వారికి, గేమర్స్‌కు హెడ్‌ఫోన్స్ ఎప్పుడూ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. హెడ్‌ఫోన్స్‌లో ఉండే ఆడియో ప్రొడ్యూస్ చేసే స్పీకర్ల సైజు చాలా పెద్దవిగా ఉంటాయి. దీనివల్ల బేస్ అద్భుతంగా ఉండి.. ప్రతీ చిన్న సౌండ్ కూడా చాలా క్లియర్ గా, సహజంగా వినిపిస్తుంది. మరోవైపు ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ చిన్నగా ఉండటం వల్ల వాటిలో స్పీకర్ సైజ్ కూడా చిన్నదే ఉంటుంది. ప్రస్తుత టెక్నాలజీతో ఇయర్‌బడ్స్ కూడా మంచి ఆడియో క్వాలిటీ ఇస్తున్నప్పటికీ.. హెడ్ ఫోన్స్ స్థాయిని అందుకోవడం కష్టమనే చెప్పాలి.

నాయిస్ క్యాన్సిలేషన్

బయటి శబ్దాలు డిస్టర్బ్ చేయకుండా ‘నాయిస్ క్యాన్సిలేషన్’ (ANC) ఫీచర్ ఉపయోగపడుతుంది. హెడ్‌ఫోన్స్ చెవులను పూర్తిగా కవర్ చేస్తాయి కాబట్టి వాటి డిజైన్ వల్లే సగం బయటి శబ్దాలు వినపించవు. దీనికి తోడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ జతకావడం వల్ల నెక్ట్స్ లెవెల్ అనుభూతి యూజర్లకు లభిస్తుంది. అటు ఇయర్‌బడ్స్‌లో కూడా ANC ఫీచర్ ఉన్నప్పటికీ హెడ్‌ఫోన్స్ స్థాయిలో 100% బయటి శబ్దాలను అడ్డుకోలేకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బ్యాటరీ లైఫ్

Advertisement

ఇయర్‌బడ్స్ సైజు చిన్నది కాబట్టి వాటిలో చిన్న బ్యాటరీలు ఉంటాయి. సాధారణంగా ఇవి సింగిల్ ఛార్జ్‌పై 5 నుండి 8 గంటలు వస్తాయి. కేస్‌తో కలిపితే 24-30 గంటలు రావొచ్చు. కానీ హెడ్ ఫోన్స్ సైజ్ లో పెద్దవి కాబట్టి వాటి బ్యాటరీ కూడా పెద్దగానే ఉంటుంది. వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 30 నుండి 50 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తాయి. ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయే అలవాటు ఉన్నవారికి హెడ్‌ఫోన్స్ బెస్ట్ అని చెప్పవచ్చు.

చెవులకు ఏది సేఫ్?

ఇయర్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్.. నేరుగా చెవి రంధ్రం లోపలి వరకూ వెళ్తాయి. కాబట్టి ఎక్కువసేపు వాడటం వల్ల చెవిలో గాలి ఆడక బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. సౌండ్ నేరుగా కర్ణభేరికి వెళ్తుంది కాబట్టి ఎక్కువ సౌండ్ పెడితే వినికిడి సమస్య వచ్చేందుకు ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అదే హెడ్ ఫోన్స్.. చెవుల పైభాగంలో ఉంటాయి కాబట్టి కర్ణభేరికి కాస్త గ్యాప్ ఉంటుంది. కాబట్టి లాంగ్ యూసేజ్‌కు హెడ్‌ఫోన్స్ సురక్షితమైనవిగా డాక్టర్లు చెబుతుంటారు. అయితే ఏది వాడినా 60% కంటే ఎక్కువ సౌండ్ పెట్టుకోకపోవడం బెటర్.

Also Read: హార్డ్ వర్క్ వద్దు.. స్మార్ట్ వర్క్ ముద్దు.. ఈ యాప్స్‌తో ఆఫీసు వర్క్ సూపర్ ఈజీ!

ఫైనల్గా ఏది బెస్ట్?

ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ, ఫిట్‌నెస్, రన్నింగ్ లాంటి యాక్టివిటీస్ లో పాల్గొనేవారికి ఇయర్ బడ్ లేదా ఇయర్ ఫోన్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలా కాకుండా ఆఫీస్ వర్క్, గేమింగ్, సినిమా ప్రియులు అయి ఉండి లాంగ్ బ్యాటరీ లైఫ్, బెస్ట్ ఆడియో క్వాలిటీ, చెవుల సేఫ్టీ కోరుకుంటే హెడ్ ఫోన్స్ వైపు వెళ్లొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: రూ.18 వేలలో ఈ రేంజ్ ఫీచర్లా? ఇవి కదా మిడిల్ క్లాస్ మెచ్చే.. పర్ఫెక్ట్ వాషింగ్ మిషన్లు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×