E-Paper
Advertisement

సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య ఏం లేదా ..?

సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య ఏం లేదా ..?
Advertisement

sudigali Sudheer Rashmi: సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్…ఇద్దరు ప్రేమలో ఉన్నారా లేదా..?ఇదిపుడు ఆడియన్స్ కి ఒక బేతాళ ప్రశ్నలా మారిపోయింది.నిజానికి ప్రేక్షకుల మనస్సులో ఈ ప్రశ్న అంత ఈజీగా మొలకెత్తలేదు. 2013లో జబర్దస్త్’ కామెడీ షో మొదలైనప్పటి నుండి ఆ స్టేజ్ పై వీళ్ళు వేసుకున్నవేసుకున్న సెటైర్లు, పేల్చుకున్న జోకులు, పండించిన లవ్ ట్రాక్ లు ( స్క్రిప్టెడ్ అయినప్పటికీ),చేసిన స్టేజ్ పెర్ఫామెన్స్ లు అన్నీ కలగలుపుకుని వీరిద్దరి మధ్య ఎదో ఉంది అనేంతలా ఆడియన్స్ ని ఆకట్టుకుని అలరించాయి.మరీ ముఖ్యంగా 2015 నుండి 2018ల మధ్య ఈ జోడీ మధ్య కెమిస్ట్రీ ఒక రేంజ్ లో పేలింది.అది కాస్తా డీ డాన్స్ షోతో మరింత స్ట్రాంగ్ అయింది.

సుధీర్ చూపులు – రష్మి సిగ్గులు

అయితే ఇవన్నీ టీఆర్పీ రేటింగ్‌ల కోసం ఆయా మేనేజ్మెంట్ ముందుగానే ప్లాన్ చేసే స్క్రిప్ట్ లే. అయినప్పటికీ సుధీర్ రష్మి ని ప్రేమగా చూడటం, దానికి రష్మి సిగ్గు పడిపోవడం వంటివి చూసిన ఆడియన్స్ వీరి మధ్య ప్రేమ ఉందని ఫిక్స్ అయిపోయారు. వీళ్ళిద్దరు స్టేజ్ పై చేసిన హంగామా అలాంటిది మరి. పైగా వీరిద్దరి మధ్య ఎదో ఉంది అని ఇబ్బడి ముబ్బడిగా వార్తలు వైరల్ అయినా ఎక్కడా అబ్బే అదేం లేదు అని ఖండిచకపోవడం ఈ వార్తలకి మరింత బూస్టప్ ఇచ్చినట్టు అయింది.ఇంకేం ఎక్కడ చూసినా వీరి ప్రేమాయణ పాటాలే.పైగా 2019 లోసుదీర్ చేసిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమా ప్రమోషన్లకి రష్మి సాలిడ్ సపోర్ట్ చేయడంతో కన్ఫాం అని ఫిక్స్ అయిపోయారంతా.

Advertisement

also read :బాక్సాఫీస్ ‘పెద్ది’ అరాచకం.. 400 కోట్ల క్లబ్‌లో రామ్ చరణ్.. నేడే మెగాస్టార్‌తో కలిసి గ్రాండ్ సక్సెస్ మీట్!

అయితే తర్వాత టీవీ షోలకి గ్యాప్ ఇచ్చి సినిమాలతో బిజీ అవడం, అడపాదడపా శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి స్పెషల్ ఈవెంట్స్ లో ఈ జంట మెరిసినప్పటికీ, పాత రోజుల్లో ఉన్న ఆ వింటేజ్ లవ్ ట్రాక్ మళ్లీ రిపీట్ కాలేకపోయింది.

మా మధ్య ఏం లేదు బాబోయ్ 

Advertisement

అయితే, ఈ రూమర్ స్ప్రెడ్ అయిన చాలా ఏళ్ళకి అబ్బే మా మధ్య అలాంటిది ఏమీ లేదు,మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఖండించినప్పటికీ జనం నమ్మని పరిస్థితి.కారణం పలు ఫెసివల్స్ కి చేసిన టీవీ ఈవెంట్స్ లో వీరిద్దరూ పెళ్లి స్కిట్స్ వేయడమే.నిజానికి ఆడియన్స్ దేన్నీ అయితే బాగా చూసేందుకు, వినేందుకు ఇష్టపడతారో వాటినే టీవీ మేనేజ్మెంట్ కంటిన్యూ చేస్తుంది.అలా ప్లాన్డ్ గా చేసిన స్కిట్స్ తో ఇద్దరు ఇండస్ట్రీలో కెరీర్ బాగా ప్లాన్ చేసుకున్నారు.

also read :నేషనల్ అవార్డుల వార్ ..చిరంజీవి బన్నీని టార్గెట్ చేశాడా…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

ఎటొచ్చి అవి  నమ్మిన ఆడియన్సే ..

ఇక ప్రస్తుతం గోట్ అనే సినిమాతో పాటు డీ వంటి క్రేజీ షోలకి సుధీర్ యాంకర్ గా బిజీగా మారిపోగా, ‘ఆహా’ (aha) వారి”ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఇన్‌ఫ్లుయెన్సర్ రియాలిటీ షో వంటి వాటితో రష్మి బిజీ అయిపోయింది.ఇక తాజాగా ఈ రియాలిటీ షో స్ట్రీమింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రష్మి చేసిన కామెంట్స్ వీరి మధ్య ఏం లేదని మరోసారి ప్రూవ్ చేస్తున్నాయ్.
మొత్తానికిఈ స్క్రిప్టెడ్ లవ్ స్టోరీ ఇద్దరి కెరీర్ కి మాంచి ఊపు ఇవగా, టీవీ మేనేజ్మెంట్ కి సాలిడ్ TRP తెచ్చిపెట్టాయ్.ఎటొచ్చి అవి నిజమేమో అని నమ్మిన ఆడియన్సే ……..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×