E-Paper
Advertisement

Headphones vs earphones vs earbuds: బ్రాండెడ్ అని కొనేస్తున్నారా? ఈ తేడాలు తెలియకపోతే మీ డబ్బులన్నీ వృధానే!

Headphones vs earphones vs earbuds: బ్రాండెడ్ అని కొనేస్తున్నారా? ఈ తేడాలు తెలియకపోతే మీ డబ్బులన్నీ వృధానే!
Advertisement

Headphones vs earphones vs earbuds: సాధారణంగా చాలామందికి మ్యూజిక్ అంటే ఒక ఎమోషన్. అందుకే మార్కెట్‌లోకి కొత్తగా ఏ హెడ్‌ఫోన్స్ వచ్చినా, బడ్స్ రిలీజ్ అయినా సరే.. వాటి లుక్స్ చూడగానే ఫిదా అయిపోయి వెంటనే కొనేస్తుంటారు. ఫీచర్లతో సంబంధం లేకుండా, ట్రెండ్‌లో ఉన్నాం కదా అని వేల రూపాయలు ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి.. అంత ఖరీదైన గ్యాడ్జెట్ కొన్నాక, అది మీ అవసరానికి సెట్ అవ్వకపోతే ఆ డబ్బులన్నీ వృధానే కదా?

చూడటానికి అన్నీ ఒకేలా అనిపించినా.. హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ మధ్య టెక్నాలజీ పరంగా చాలా తేడాలు ఉంటాయి. సౌండ్ క్వాలిటీ నుంచి కంఫర్ట్ వరకు ప్రతిదీ వేరు. అందుకే బ్రాండ్ పేరు చూసి మోసపోకుండా.. మీ లైఫ్‌స్టైల్‌కు ఏది కరెక్టో తెలుసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో మీ జేబుకు చిల్లు పడకుండా, బెస్ట్ మ్యూజిక్‌ను అందించే ఆ గ్యాడ్జెట్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యత్యాసాలు ఇవే:

Advertisement

ఈ మూడింటిలో హెడ్‌ఫోన్స్ సైజు పరంగా చూసుకుంటే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. ఇవి తల పైనుంచి పెట్టుకునేలా ఉండి, చెవులను పూర్తిగా కప్పేస్తాయి. వీటిలో ఉండే కుషన్లు బయటి శబ్దాలు రాకుండా అడ్డుకుంటాయి. సోనీ వంటి బ్రాండ్లలో మనం ఇలాంటి ప్రీమియం మోడళ్లను చూడొచ్చు. మరోవైపు ఇయర్‌బడ్స్ చాలా చిన్నవిగా ఉండి, చెవిలో ఇమిడిపోతాయి. ప్రస్తుతం వస్తున్న ట్రూలీ వైర్‌లెస్ బడ్స్ చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. ఎలాంటి వైర్లు లేకుండా కేవలం చిన్న బాక్సులో పెట్టుకోవచ్చు.

Also Read: మ్యూజిక్ లవర్స్‌కు పండగే.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో ఒప్పో కొత్త బడ్స్ లాంచ్!

ఇయర్‌ఫోన్స్ అంటే?

Advertisement

చాలామంది ఇయర్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఇయర్‌ఫోన్స్ సాధారణంగా వైర్లతో అనుసంధానించబడి ఉంటాయి. గతంలో మనం ఫోన్లతో పాటు వచ్చే 3.5mm జాక్ ఉన్న వైర్లనే ఇయర్‌ఫోన్స్ అంటాం. అయితే, ఇప్పుడు నెక్‌బ్యాండ్ రూపంలో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ కూడా వచ్చాయి. ఇవి మెడ చుట్టూ ధరించేలా ఉంటుంది. దీంతో ఉపయోగించుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇయర్‌బడ్స్‌తో పోలిస్తే ఇవి పోగొట్టుకునే అవకాశం తక్కువగా ఉంటుంది.

హెడ్‌ఫోన్సే ముందు పుట్టాయి:

చరిత్రలోకి వెళ్తే మొట్టమొదట హెడ్‌ఫోన్లే అందుబాటులోకి వచ్చాయి. 1890లలో వీటిని టెలిఫోన్ రిసీవర్లుగా పిలిచేవారు. కాలక్రమేణా 1937లో పర్సనల్ లిజనింగ్ కోసం వీటిని వాడటం మొదలైంది. అందుకే ఇప్పటికీ హెడ్‌ఫోన్స్ అనే పదాన్ని ఒక సంప్రదాయంగా అన్ని రకాల ఆడియో పరికరాలకు వాడుతుంటాం.

సౌండ్ క్వాలిటీలో ఏది బెస్ట్?

మీరు గనుక మ్యూజిక్‌ను మంచి క్వాలిటీతో వినాలనుకుంటే.. హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. వీటి సైజు పెద్దది కాబట్టి.. దీనిలో పెద్ద డ్రైవర్లను, బ్యాటరీలను అమర్చి ఉంటాయి. దీంతో సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అయితే, ఇవి కాస్త బరువుగా ఉండటంతో ప్రయాణాల్లో ఇబ్బందిగా అనిపించవచ్చు.

తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్స్:

ఒకవేళ మీరు జిమ్‌కు వెళ్తున్నట్లయితే లేదా ప్రయాణాల్లో చిన్నగా, తేలికగా ఉండే గ్యాడ్జెట్ కావాలనుకుంటే ఇయర్‌బడ్స్ లేదా నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌ను ఎంచుకోవచ్చు. ఇవి ధరలో కూడా అన్ని రకాల బడ్జెట్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Also Read: బడ్జెట్ ధరలో ప్రీమియం హెడ్‌ఫోన్స్.. 120 గంటల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×