E-Paper
Advertisement

ఎండలు 50 డిగ్రీలు దాటినా డోంట్ కేర్.. ఈ Desert Rose AC ఉంటే ఇల్లు స్విట్జర్లాండే!

ఎండలు 50 డిగ్రీలు దాటినా డోంట్ కేర్.. ఈ Desert Rose AC ఉంటే ఇల్లు స్విట్జర్లాండే!
Advertisement

Haier Desert Rose AC: ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మామూలుగా లేవు. ఈ వేడి సెగలకు బయట అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. అయితే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే ఇక ఇంట్లో ఉన్న ఏసీలు కూడా సరిగ్గా కూలింగ్ ఇవ్వక ఉక్కిరిబిక్కిరి అవుతుంటాయి. ఇప్పుడీ సమస్యకు చెక్ పెడుతూ ఎంతటి ఎండలనైనా తట్టుకునేలా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ హయ్యర్ Desert Rose పేరుతో సరికొత్త సూపర్ హెవీ డ్యూటీ ఏసీలను మార్కెట్లోకి తెచ్చింది. ఇవి చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాదు.. పనితీరులోనూ చాలా మెరుగ్గా ఉంటాయని కంపెనీ చెబుతోంది.

మన మూడ్‌ను బట్టి కూలింగ్..

ఈ ఏసీల్లో ఉన్న ‘ఏఐ అట్మాక్స్’ అనే టెక్నాలజీ ఏసీకి బ్రెయిన్‌లా పనిచేస్తుంది. ఇది కేవలం గాలిని చల్లబరచడమే కాకుండా.. బయట ఎండ ఎంత ఉంది? మీ గదిలో ఎంత వేడి ఉంది? అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల గది మరీ ఐస్‌లా అయిపోకుండా, మనకు హాయిగా ఉండేలా చూస్తుంది. ఇక జియోఫెన్సింగ్ అనే అదిరిపోయే ఫీచర్ ఒకటి ఉంది. మీరు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఇంటికి ఒక 100 మీటర్ల దూరంలో ఉండగానే ఏసీ దానంతట అదే ఆన్ అయిపోతుంది. మీరు తలుపు తీసేసరికి గది చల్లగా ఉంటుంది.

Advertisement

Read Also: ఈ గ్యాడ్జెట్ ఉంటే.. పాత కర్టెన్లనే స్మార్ట్‌గా మార్చేయొచ్చు, గోడకు రంధ్రం కూడా పెట్టక్కర్లేదు!

కరెంట్ బిల్లు కూడా తక్కువే..

ఏసీ వేయాలంటే ముందుగా గుర్తొచ్చేది కరెంట్ బిల్లే. కానీ ఈ ఏసీలో ఉన్న ఏఐ ఎకో మోడ్, హ్యూమన్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఆ భయాన్ని తగ్గిస్తాయి. గదిలో ఎవరూ లేరని ఏసీ గుర్తిస్తే.. వెంటనే పవర్ సేవింగ్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దీనివల్ల అనవసరంగా కరెంట్ వేస్ట్ అవ్వదు. పైగా ఎంత పవర్ ఖర్చవుతుందో కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.

క్లీనింగ్ తలనొప్పి ఉండదు..

Advertisement

ఏసీ వాడేవారికి సర్వీసింగ్, క్లీనింగ్ అంటే పెద్ద పని అనిపిస్తుంటుంది కదా. కానీ ఈ ఏసీలో లోపలి యూనిట్‌తో పాటు బయట ఉండే యూనిట్ కూడా దానంతట అదే క్లీన్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనివల్ల దుమ్ము పేరుకుపోదు, గాలి కూడా స్వచ్ఛంగా వస్తుంది. అలాగే ‘సూపర్ సోనిక్ కూలింగ్’ అనే ఫీచర్ ద్వారా కేవలం 10 సెకన్లలోనే గదిని చల్లబరచడం దీని ప్రత్యేకత.

ధర వివరాలిలా..

ఈ కొత్త రేంజ్ ఏసీల ధరలు రూ.55,990 నుంచి మొదలవుతున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో లేదంటే మీకు దగ్గర్లోని ఏసీ షోరూమ్స్‌లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎండలు ముదిరేలోపే మంచి ఏసీ తీసుకోవాలి అనుకునేవారికి ఇదొక స్మార్ట్ ఛాయిస్ అవుతుంది.

Read Also: ఫోన్ తీయాల్సిన పనిలేదు.. నథింగ్ ఏఐ గ్లాసెస్ వచ్చేస్తున్నాయి, అన్నీ కళ్లద్దాలతోనే ఇక!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×