// // Kadapa: షార్ట్ ఫిలిం తీసేందుకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి -->
E-Paper
Advertisement

Kadapa: కడపలో విషాదం.. షార్ట్ ఫిలిం తీసేందుకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Kadapa: కడపలో విషాదం.. షార్ట్ ఫిలిం తీసేందుకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి
Advertisement

Kadapa: కడప జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం ఒక షార్ట్ ఫిలిమ్ తీయడం కలిసిన కొందరు యువకుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలిచివేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎనిమిది మంది యువకులు ‘ఫ్రంట్‌లైన్ ప్రెస్’ అనే పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు.

ఈ క్రమంలోనే వారు తమ తదుపరి షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం వల్లూరు మండలం, పుష్పగిరి గ్రామ సమీపంలోని పెన్నా నది వద్దకు చేరుకున్నారు. షార్ట్ ఫిలిం తీసే పనిలో నిమగ్నమై ఉండగా ఊహించని విధంగా ప్రమాదం చోటుచేసుకుంది. నదిలో లోతు తెలియకపోవడం వల్ల హరిబాబు(25), హర్షవర్ధన్(22), కృష్ణచైతన్య (20) అనే ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. వెంట ఉన్న మిగిలిన స్నేహితులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా.. హరిబాబు, హర్షవర్దన్ మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే కృష్టచైతన్య మృతదేహం కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కళ్లముందే స్నేహితులు ప్రాణాలు కోల్పోవడంతో మిగిలిన యువకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉపాధి వెతుక్కుంటూ తమ కలలను సాకారం చేసుకోవాలనుకున్న ఈ యువకుల మృతి ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఫ్రెండ్ అని నమ్మితే.. రూ.2.36 కోట్లు హాంఫట్.. కొండాపూర్ టెక్కీకి భారీ టోకరా!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×