E-Paper
Advertisement

Grok AI Misinformation: ఆస్ట్రేలియా గన్ షూటింగ్ ఘటన తప్పుడు సమాచారం ఇచ్చిన గ్రోక్ ఏఐ.. ఏం చెప్పిందంటే

Grok AI Misinformation: ఆస్ట్రేలియా గన్ షూటింగ్ ఘటన తప్పుడు సమాచారం ఇచ్చిన గ్రోక్ ఏఐ.. ఏం చెప్పిందంటే
Advertisement

Grok AI Bondi Beach shooting Misinformation| ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ గ్రోక్ ఏఐ (Grok) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాలో ఇటీవలే జరిగిన బాండి బీచ్ షూటింగ్ (హింసాత్మక) ఘటన గురించి గ్రోక్ ఇచ్చిన తప్పుడు సమాధానాల కారణంగా ఈ విమర్శలు వచ్చాయి. ఈ చాట్‌బాట్ తపుదోవ పట్టిస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు. ఘటన గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిందని సోషల్ మీడియాలో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశఆరు.

బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్‌ల కోసం వెతుకుతున్నప్పుడు చాలా మంది గ్రోక్ ఏఐ పై ఆధారపడ్డారు. అయితే, స్పష్టమైన సమాచారానికి బదులు. గ్రోక్ ఇచ్చిన అనేక సమాధానాలు గందరగోళానికి దారి తీశాయి. అయితే ఇదంతా తప్పుడు సమాచారం అని తెలిసి అందరూ షాక్ కు గురయ్యారు.

Advertisement

ఈ సంఘటన బ్రేకింగ్ న్యూస్ సమయంలో AI విశ్వసనీయత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. యూజర్లు గ్రోక్ ఇచ్చిన తప్పుడు సమాధానాల స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. ముఖ్యంగా ఎలన్ మస్క్ సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన X ట్విట్టర్ లో వేగంగా వ్యాపించింది.

బాండి బీచ్ షూటింగ్ ఘటన గురించి గ్రోక్ చేసిన పొరపాట్లు

సిడ్నీలోని బాండి బీచ్‌లో జరిగిన తుపాకీ కాల్పుల హింసాత్మక ఘటనలో 16 మంది మరణించారు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి పోలీసులు.. ఒక దాడిచేసిన వ్యక్తి (తండ్రి) ని అక్కడికక్కడే కాల్చి చంపారు. మరొక దాడిచేసిన వ్యక్తి (కొడుకు) గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సరైన సమాచారం కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారు. ఈ క్రమంలో చాలా మంది యూజర్లు సమాధానాల కోసం ఏఐ చాట్‌బాట్‌ల వైపు మళ్లారు.

Advertisement

షూటింగ్ గురించి నెటిజెన్లు ప్రశ్నలు అడగినప్పుడు.. గ్రోక్ అనేక తప్పుడు సమాధానాలను అందించింది. కీలకమైన సమాచారం గురించి పదేపదే తప్పుడు సమాధానాలు ఇచ్చింది. మస్క్ కంపెనీ xAI ద్వారా Grok అభివృద్ధి చేయబడింది.

కాల్పుల ఘటనలో ప్రజలను కాపాడిన హీరోను గుర్తించడంలో తప్పు

తుపాకీ చేతపట్టి అమాయకులపై కాల్పులు జరిపిన దుండగుడిని నిరాయుధుడిని చేయడానికి సహాయం చేసిన 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ అనే వీరోచిత వ్యక్తిని సరిగ్గా గుర్తించడంలో గ్రోక్ ఏఐ విఫలమైంది. ఒక సమాధానంలో.. ఆ హీరోని ఇజ్రాయెల్ బందీగా పేర్కొంది. అంతేకాకుండా, వైరల్ అయిన వీడియోలు నకిలీవి అని వాటి ప్రామాణికతను కూడా ఇది ప్రశ్నించింది. విస్తృతంగా షేర్ చేయబడిన ఫుటేజ్ నకిలీదని AI సూచించింది.

Also Read: ఇంటర్నెట్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? దీనికి కారణం అదే..

కల్పిత వ్యక్తిని సృష్టించిన ఏఐ

కాల్పుల ఘటన హీరో గుర్తింపులో గ్రోక్ మరొక తీవ్రమైన తప్పు చేసింది. హీరో పేరు “ఎడ్వర్డ్ క్రాబ్‌ట్రీ” అని అది పేర్కొంది. అతడిని సీనియర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్‌గా వర్ణించింది. ఈ సమాచారం పూర్తిగా అబద్ధం, కల్పితం. తన తప్పుకు కారణాన్ని గ్రోక్ తర్వాత సూచించింది. ఇది వైరల్ పోస్ట్‌లు, నమ్మదగని ఆన్‌లైన్ కథనాల ద్వారా సేకరించిన సమాచారం అని తన తప్పును ఇతరులపై నిందించింది. ఆ మూలాధారాలలో AI-సృష్టించిన కంటెంట్ ఉండవచ్చని గ్రోక్ అంగీకరించింది.

అసలు సమస్య: బ్రేకింగ్ న్యూస్ సమయంలో ఏఐని నమ్మడం

ఈ సంఘటన ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తింది: బ్రేకింగ్ న్యూస్ సమయంలో AI చాట్‌బాట్‌లు ఎంతవరకు విశ్వసనీయంగా ఉంటాయి? ప్రారంభంలో సమాచారం తరచుగా మారుతూ ఉంటుంది. చాలా తక్కువ ధృవీకరణ ఉంటుంది. AI చేసే చిన్న పొరపాట్లు కూడా తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేస్తాయి. ఇది సంక్షోభాల సమయంలో ప్రజలలో గణనీయమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకే తాజా సమాచారం విషయంలో ఏఐపై ఆధారపడడం తప్పు అనేందుకు ఇదే ఉదాహరణ.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×