E-Paper
Advertisement

Google Search Fraud: గూగుల్ సెర్చ్‌లో స్కామ్.. డాక్టర్ నెంబర్ కోసం వెతికితే రూ.18 లక్షల దోపిడీ

Google Search Fraud: గూగుల్ సెర్చ్‌లో స్కామ్.. డాక్టర్ నెంబర్ కోసం వెతికితే రూ.18 లక్షల దోపిడీ
Advertisement

Google Search Fraud| సైబర్ దొంగలు ఆన్‌లైన్‌లో వినూత్న తరహాలో అమాయకులను దోచుకుంటున్నారు. తాజా అలాంటి ఒక ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అనూప్‌షహర్‌ నగరంలో ఒక కుటుంబం రూ.18 లక్షలకు పైగా నష్టపోయింది. ఒక సాధారణ గూగుల్ సెర్చ్ ఈ పెద్ద మోసానికి దారితీసింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి, అతని భార్య బాధితులు. సైబర్ నేరస్థులు ఫేక్ యాప్ ద్వారా వారి స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసి వారి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు లాగేశారు.

మోసం ఎలా చేశారు?

2025 డిసెంబర్ 1న బాధితుడికి అనారోగ్యం వచ్చింది. డాక్టర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చిన ఒక నంబర్‌కు కాల్ చేశాడు. ఆ వ్యక్తి డాక్టర్‌తో సంబంధం ఉన్నట్లు చెప్పాడు. త్వరగా అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. “డాక్టర్ అపాయింట్‌మెంట్” అనే యాప్ డౌన్‌లోడ్ చేయమని చెప్పాడు. అత్యవసర పరిస్థితి కారణంగా బాధితుడు ఆ వ్యక్తి నమ్మి యాప్ ఇన్‌స్టాల్ చేశాడు.

హ్యాకర్లు ఫోన్‌ను ఎలా కంట్రోల్ చేశారు?

Advertisement

యాప్ ఇన్‌స్టాల్ సమయంలో చాలా పర్మిషన్లు అడిగింది. బాధితుడు అన్నీ అనుమతించాడు. ఈ యాప్ ద్వారా హ్యాకర్లు ఫోన్‌కు రిమోట్ యాక్సెస్ పొందారు. స్క్రీన్ యాక్టివిటీ, నోటిఫికేషన్లు చూడగలిగారు. బ్యాంకింగ్ సమాచారం, OTPలు, లాగిన్ డీటెయిల్స్ సులభంగా సేకరించారు. దీంతో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై పూర్తి నియంత్రణ సాధించారు.

బహుళ ట్రాన్సాక్షన్లతో డబ్బు దొంగతనం

బాధితుడు అనారోగ్యంతో ఉండటంతో బ్యాంక్ మెసేజ్‌లు రెగ్యులర్‌గా చూడలేదు. ఫిబ్రవరి 19 నుంచి 25 వరకు హ్యాకర్లు చిన్న చిన్న మొత్తాల్లో డబ్బు బదిలీ చేశారు. అతని ఖాతా నుంచి రూ.10,07,561 ఉపసంహరించారు. భార్య ఖాతా నుంచి ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు రూ.8,54,409 దొంగిలించారు. దీంతో మొత్తం నష్టం రూ.18,61,970.

Advertisement

Also Read: అదుపు తప్పిన రోబో.. హెటల్‌లో టేబుల్స్, ప్లేట్లు పగలగొట్టి డ్యాన్స్.. ఏం జరిగిందంటే

మోసం ఎలా తెలిసింది?

ఫిబ్రవరి 26న బ్యాంక్ నుంచి డెబిట్ మెసేజ్‌లు వచ్చాయి. అనధికారిక ట్రాన్సాక్షన్లు జరిగినట్లు తెలిసింది. వెంటనే బాధితులు బ్యాంక్‌కు సమాచారం ఇచ్చారు. బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేసింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

పోలీస్ దర్యాప్తు, నిపుణుల హెచ్చరిక

పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, బెనిఫిషరీ ఖాతాలను ట్రాక్ చేస్తున్నారు. ఫేక్ యాప్, డిజిటల్ ఎవిడెన్స్‌ను విశ్లేషిస్తున్నారు. సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చే తెలియని నంబర్లపై నమ్మకం ఉంచవద్దు. అధికారిక వెబ్‌సైట్ల నుంచి మాత్రమే కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోండి. తెలియని వారు సూచించిన యాప్‌లు డౌన్‌లోడ్ చేయవద్దు. అనవసర పర్మిషన్లు ఇవ్వవద్దు.

ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటం ఎలా?

మెడికల్ కాంటాక్ట్‌ల కోసం ట్రస్టెడ్ సోర్సెస్ మాత్రమే ఉపయోగించండి. యాప్‌లు ఇన్‌స్టాల్ చేసే ముందు రివ్యూలు, డెవలపర్ డీటెయిల్స్ చూడండి. OTPలు, బ్యాంకింగ్ సమాచారం ఎవరితోనూ షేర్ చేయవద్దు. ప్రతి ట్రాన్సాక్షన్‌కు అలర్ట్స్ ఆన్ చేయండి. ఖాతా యాక్టివిటీని రెగ్యులర్‌గా చెక్ చేయండి. జాగ్రత్తలు పాటిస్తే ఆర్థిక మోసాలను నివారించవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×