E-Paper
Advertisement

Android To iPhone: గూగుల్ గేమ్ ఛేజింగ్ ఫీచర్.. ఇకపై యాప్స్ లేకుండానే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు ఫైల్ షేరింగ్

Android To iPhone: గూగుల్ గేమ్ ఛేజింగ్ ఫీచర్.. ఇకపై యాప్స్ లేకుండానే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు ఫైల్ షేరింగ్
Advertisement

Android To iPhone File Share| ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు ఐఫోన్‌కి పంపాలంటే తల పట్టుకునేంత కష్టంగా ఉండేది. ఏదో ఒక థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి, వై-ఫై హాట్‌స్పాట్ ఆన్ చేయాలి, లేదా బ్లూటూత్‌లో నెమ్మదిగా ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇక అదంతా గతం! గూగుల్ కొత్తగా ఒక మ్యాజిక్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏ యాప్ అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి ఫైల్స్ షేర్ చేయొచ్చు.

దీని పేరు క్విక్ షేర్ (“Quick Share”). ఇది గూగుల్ యొక్క కొత్త వెర్షన్ షేరింగ్. ఆపిల్ టెక్నాలజీ సాయం లేకుండానే గూగుల్ ఈ టెక్నాలజీని తయారు చేసింది. ఐఫోన్‌లో ఎయిర్ డ్రాప్ (AirDrop) అనే ఫైల్ షేరింగ్ ఫీచర్ లాగానే ఇది పనిచేస్తుంది, కానీ ఇది ఆండ్రాయిడ్-ఐఫోన్ మధ్య బ్రిడ్జ్ లాంటి పనిచేస్తుంది!

ఆండ్రాయిడ్ టు ఐఫోన్ ఫైల్ ఎలా పంపాలి? చాలా సింపుల్:

Advertisement

ఐఫోన్‌లో సెట్టింగ్స్ – ఎయిర్ డ్రాప్ – ఎవరివన్ ఫర్ 10 మినట్స్ ( Settings → AirDrop → “Everyone for 10 minutes”) ఫీచర్ ను ఆన్ చేయండి
ఆండ్రాయిడ్ ఫోన్‌లో Quick Share ఓపెన్ చేసి ఫైల్స్ సెలెక్ట్ చేయండి
దగ్గరలో ఉన్న ఐఫోన్ ఆటోమాటిక్ గా కనిపిస్తుంది – దాన్ని ట్యాప్ చేయండి
ఐఫోన్‌లో “Accept” నొక్కితే… సెకన్లలో వ్యవధిలో నే ఫైల్స్ షేరింగ్ పూర్తి అవుతుంది.

కొత్త ఫీచర్ చాలా సేఫ్

క్విక్ షేర్ లో పూర్తి ఎన్‌క్రిప్షన్ ఉంటుంది – ఎవరూ మధ్యలో చూడలేరు. ఫైల్స్ ఎక్కడా సర్వర్‌లో సేవ్ కావు. పర్సనల్ ఫోటోలు, డాక్యుమెంట్స్ కూడా నిర్భయంగా షేర్ చేయొచ్చు.

ఇప్పుడు ఎవరికి వర్క్ అవుతుంది?

Advertisement

ప్రస్తుతం Google Pixel 10 సిరీస్‌లో ఫుల్‌గా వర్క్ అవుతుంది. కానీ రాబోయే నెలల్లో శాంసంగ్, వన్ ప్లస్, షావోమీ, రియల్ మి, ఒప్పో – అన్ని పెద్ద బ్రాండ్స్‌కి ఈ ఫీచర్ వస్తుంది. రాబోయే కొత్త ఫోన్లు ఈ ఫీచర్ ని ఇంటిగ్రేట్ చేస్తాయి.

పాత పద్ధతి ఫైల్ షేరింగ్ లో సమస్యలు ఇవే..

షేర్‌ఇట్, జెన్డ్, SHAREit లాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాడ్స్ చాలా ఇబ్బందికరంగా ఉండేవి. ప్రైవసీ ఉండదు. చాలా స్లోగా ఫైల్ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. కొన్ని యాప్స్ అయితే ఫైల్ షేరింగ్ కోసం ఛార్జెస్ చెల్లించాలని అడుగుతాయి.
ఇప్పుడు ఈ సమస్యలన్నీ పరిష్కారం అయినట్లే. ఇంటర్నెట్, బ్లూటూత్, లొకేషన్ ఆన్ ఉంటే చాలు… రెండు ఫోన్లు దగ్గరపెట్టి సెకన్లలో పని అయిపోతుంది.

భవిష్యత్తులో ఈ ఫీచర్ మరింత విస్తరణ

ల్యాప్‌టాప్, ట్యాబ్‌లెట్‌లకూ ఈ ఫీచర్ వస్తుంది
ఆండ్రాయిడ్ vs ఐఫోన్ అనే అడ్డంకి పూర్తిగా తొలగిపోతుంది
ఏ ఫోన్ కొన్నా భయపడాల్సిన అవసరం ఉండదు.

ఇంత సింపుల్, ఇంత ఫాస్ట్, ఇంత సేఫ్ ఫీచర్ ఇప్పటివరకు ఎవరూ లేదు. గూగుల్ ఈసారి నిజంగానే గేమ్ మార్చేసింది! మీ ఫోన్‌లో ఈ ఫీచర్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి… లేదంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసేయండి. ఇకపై ఫైల్స్ షేర్ చేయడం అంటే అంతా సెకండ్స్ లో అయిపోతుంది.

Also Read: హెడ్‌ఫోన్స్‌లో సమస్య వస్తే ఫ్రిజ్‌లో పెట్టండి.. వైరల్ అవుతున్న వింత ట్రెండ్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×