E-Paper
Advertisement

Google Pixel 11 Pro Fold ధర లీక్.. పాత మోడల్‌పై ఏకంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్!

Google Pixel 11 Pro Fold ధర లీక్.. పాత మోడల్‌పై ఏకంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్!
Advertisement

Google Foldable Phones: గూగుల్ పిక్సెల్ ప్రియులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. సరికొత్త ఫీచర్లతో రాబోతున్న ‘పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్’ ఫోన్ లాంచ్ డేట్, ధర వివరాలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. ఆగస్టు 12న జరగబోయే ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో పిక్సెల్ 11 సిరీస్‌తో పాటు ఈ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను గూగుల్ పరిచయం చేయనుంది. అదే సమయంలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

త్వరలోనే సరికొత్త ఫోల్డబుల్ ఫోన్:

స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్‌ను గూగుల్ త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఆగస్టు 12న ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్ మోడళ్లతో పాటు ఈ లగ్జరీ ఫోల్డబుల్ ఫోన్ కూడా విడుదల కానుంది. భారత్‌లో దీని 16GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.1,74,999 నుండి రూ.1,89,999 మధ్య ఉండవచ్చని సమాచారం.

Advertisement

Also Read: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. భారీగా పడిపోయిన iPhone Air.. అసలు కారణం ఇదేనా?

అదిరిపోయే కెమెరా, డిస్‌ప్లే ఫీచర్లు:

ఈ కొత్త ఫోన్‌లో గూగుల్ అదిరిపోయే అప్‌గ్రేడ్స్ ఇస్తోంది. దీనిలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు రెండు 48 మెగాపిక్సెల్ కెమెరాలను వెనుక వైపు ఇస్తున్నారు. ఇది 5x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం రెండు స్క్రీన్లపై 10.5 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. ఇక 6.5 ఇంచుల కవర్ డిస్‌ప్లే, లోపల 8.5 ఇంచుల పెద్ద ఫోల్డింగ్ స్క్రీన్‌ను ఇస్తున్నారు. ఇవి ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపించేలా 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తున్నాయి.

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్:

Advertisement

ఈ ఫోన్ సరికొత్త టెన్సర్ జీ6 (Tensor G6) ప్రాసెసర్‌తో నడవనుంది. ఇది ఫోన్ వేగాన్ని, పనితీరును అద్భుతంగా పెంచుతుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రాబోతున్న ఈ ఫోన్‌లో 4800mAh బ్యాటరీని అమర్చారు. ఇది 30W వైర్డ్ ఛార్జింగ్, 23W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వడమే కాకుండా ఎక్కువ సమయం బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

పాత మోడల్‌పై భారీ ఆఫర్లు:

కొత్త ఫోన్ వస్తున్న తరుణంలో.. ప్రస్తుతం ఉన్న పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధరను గూగుల్ భారీగా తగ్గించింది. రూ.1,72,999 ధర గల ఈ ఫోన్ ఇప్పుడు రూ. 1,58,499కే లభిస్తోంది. దీనికి తోడు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.35,900 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ ఫోన్‌ను కేవలం రూ.1,22,599కే సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ కండిషన్‌ను బట్టి ఈ ఎక్స్ఛేంజ్ ధర మారుతుందని గమనించాలి.

Also Read: లైవ్ పెర్ఫామర్ల కోసం సోనీ సరికొత్త ఇయర్ మానిటర్స్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×