E-Paper
Advertisement

Google Pixel 10 Price Drop: ఈ ఒక్క ట్రిక్ వాడితే.. లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 10పై రూ.12వేల డిస్కౌంట్ పక్కా!

Google Pixel 10 Price Drop: ఈ ఒక్క ట్రిక్ వాడితే.. లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 10పై రూ.12వేల డిస్కౌంట్ పక్కా!
Advertisement

Google Pixel 10 Price Drop: గతేడాది చివరిలో విడుదలైన గూగుల్ పిక్సెల్ ఫోన్లకు మార్కెట్లో ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చే ఆండ్రాయిడ్ ఫోన్లను ఇష్టపడేవారు గూగుల్ పిక్సెల్‌పై వచ్చే ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పుడా నిరీక్షణకు తెర పడింది. ప్రముఖ రీటైల్ సంస్థ విజయ్ సేల్స్.. గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ Pixel 10పై కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో టెక్ ప్రియులంతా ఖుషీ అయిపోతున్నారు.

భారీ ధర తగ్గింపు:

గూగుల్ పిక్సెల్ 10 భారత మార్కెట్లో విడుదలైనప్పుడు.. 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.79,999. ప్రస్తుతం విజయ్ సేల్స్ ఎలాంటి కండీషన్స్ లేకుండానే రూ.5,000 ధర తగ్గించి, దీనిని రూ.74,999కే అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా కొత్త ఫోన్లపై ఇంత త్వరగా ఫ్లాట్ డిస్కౌంట్ రావడం చాలా అరుదు. కాబట్టి.. గూగుల్ పిక్సెల్ అభిమానులకు ఈ ఆఫర్ మంచి ఛాన్స్ అనే చెప్పాలి.

Advertisement

Also Read: అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్.. సగం ధరకే శాంసంగ్ గెలాక్సీ S24 FE, మళ్లీ ఇలాంటి డీల్ రాదు!

బ్యాంకు ఆఫర్లతో పండగే:

బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకుంటే.. HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా EMI ద్వారా కొనుగోలు చేస్తే ఏకంగా రూ.7,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ ICIC బ్యాంక్ కార్డు దారులైతే 5% వరకు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్లన్నీ కలిపితే.. అసలు ధర కంటే దాదాపు రూ.12,000 వరకు ఆదా అవుతుంది. దీంతో పిక్సెల్ 10 ఫోన్‌ను రూ.67,999కే దక్కించుకోవచ్చు.

అధునాతన టెక్నాలజీ:

Advertisement

Google Pixel 10 కేవలం పేరుకే కాదు.. పనితీరులోనూ టాప్ క్లాస్ అనిపించుకుంటోంది. దీనిలో గూగుల్ స్వయంగా రూపొందించిన శక్తివంతమైన టెన్సర్ G5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీంతో ఫోన్ స్పీడ్ పెరగడమే కాకుండా, బ్యాటరీ లైఫ్ కూడా మెరుగ్గా ఉంటుంది. ఇక 6.3 అంగుళాల యాక్చువా OLED డిస్‌ప్లే ఇచ్చే విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఏడేళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్:

పిక్సెల్ ఫోన్లంటేనే కెమెరాకు పెట్టింది పేరు. దీనిలో ఉన్న 48MP మెయిన్ కెమెరా, టెలిఫొటో, అల్ట్రావైడ్ లెన్స్‌ల కాంబినేషన్ ఫొఫోటోగ్రఫీని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తుంది. దీనికి తోడు Google Gemini AI, Magic Editor వంటి ఫీచర్లు ఫొటోలను ఎడిట్ చేయడంలో సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఆండ్రాయిడ్ 16తో వచ్చే ఈ ఫోన్‌కు గూగుల్ ఏకంగా 7ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఇస్తామని ప్రకటించడం విశేషం.

Also Read: అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న AI కళ్లద్దాలు.. టెక్నాలజీ సృష్టించిన అద్భుతం ఇది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×