E-Paper
Advertisement

Hyderabad Drugs Case: పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్!

Hyderabad Drugs Case: పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్!
Advertisement

Hyderabad Drugs Case: హైదరాబాద్‌ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపింది. ఒక ప్రముఖ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ, పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం నగరంలో చర్చనీయాంశమైంది. పంజగుట్ట నాగార్జున సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు ఒకే కాలేజీలో చదువుతున్నారు. వీరి వద్ద నుంచి 10 గ్రాముల MDMA అనే నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి వ్యసనాల బారిన పడటం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ విద్యార్థులకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతున్నాయి? వీరి వెనుక ఉన్న ప్రధాన నిందితులు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో వారి భవిష్యత్తు అంధకారమవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విద్యాసంస్థల సమీపంలో నిఘా మరింత కఠినతరం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

ALSO READ:మేడారం జాతరలో ‘ఇప్పపువ్వు’ ఘుమఘుమలు.. భక్తులను మురిపిస్తున్న ఆరోగ్యకరమైన లడ్డు!

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×