E-Paper
Advertisement

2025 Roundup: 2025లో గూగుల్‌ను షేక్ చేసిన టాప్ సెర్చ్‌లు ఇవే!.. ఇంతకీ మీరేం వెతికారో గుర్తుందా?

2025 Roundup: 2025లో గూగుల్‌ను షేక్ చేసిన టాప్ సెర్చ్‌లు ఇవే!.. ఇంతకీ మీరేం వెతికారో గుర్తుందా?
Advertisement

2025 Roundup: తాజాగా గూగుల్ తన Year in Search 2025 నివేదికను విడుదల చేసింది. ఈ సంవత్సరం(2025) ముగియడానికి మరికొన్ని రోజులే మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో 2025లో భారతదేశ ప్రజలు ఏ విషయాలను ఎక్కువగా వెతికారో ఆ జాబితా స్పష్టంగా చూపిస్తోంది. 2025 సెర్చ్‌లలో క్రికెట్, కృత్రిమ మేధ (AI), ఎంటర్‌టైన్‌మెంట్ టాప్ కేటగిరీలుగా నిలిచాయి. ఈ నివేదిక ప్రకారం.. 2025లో భారతదేశంలో అత్యంత ట్రెండింగ్ సెర్చ్ ఏమిటంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). దేశవ్యాప్తంగా క్రికెట్ పట్ల ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. IPL తర్వాత, గూగుల్ ఏఐ చాట్‌బాట్ Gemini రెండో స్థానంలో ఉండటం ప్రత్యేకం. దీని ప్రకారం మన దేశంలో Artificial Intelligence పట్ల ఆసక్తి ఎంత వేగంగా పెరుగుతోంది, ప్రజలు కొత్త టెక్నాలజీని ఎంత ఆసక్తిగా స్వీకరిస్తున్నారో స్పష్టమవుతోంది.

అంతా ఏఐ మాయ:

2025లో అత్యధికంగా వెతికిన అంశాలను గూగుల్ అక్షర క్రమంలో విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ తారలు, IPLలోని అద్భుత క్షణాలు వినియోగదారుల ప్రశ్నల్లో ఆధిపత్యం చెలాయించాయి. ముఖ్యంగా, గూగుల్‌ సొంత ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లైన Gemini, Nano Banana Proల గురించి ప్రజలు విపరీతంగా సెర్చ్ చేశారు. వాటిలో Google Gemini ప్రపంచవ్యాప్తంగా #2 ట్రెండింగ్ శోధనగా నిలవడం విశేషం. ఇక కృత్రిమ మేధస్సు విస్తృత ప్రపంచాన్ని అన్వేషించేందుకు, Grok కూడా ట్రెండింగ్ శోధనగా ముందుకు వచ్చింది.

అగ్రస్థానంలో ‘ఏంటీ వక్ఫ్ బిల్లు?’:

Advertisement

Googleలో భారతీయ యూజర్లు ఎక్కువగా వెతికిన అంశాల్లో ‘What is Waqf Bill?’ (ఏంటీ వక్ఫ్ బిల్లు?) అనే అంశం టాప్‌లో నిలిచింది. ఇక అంతర్జాతీయ టాపిక్‌ల విషయానికి వస్తే.. పహల్గాం దాడి అనంతరం ఆర్మీ ఆపరేషన్‌ను మిలియన్ల మంది లైవ్‌గా ట్రాక్ చేయడంతో, ‘ఆపరేషన్ సింధూర్’ గురించి భారీ స్థాయిలో శోధనలు జరిగాయి.

మహా కుంభ్ గురించి ఆరా:

2025లో సంచలనం సృష్టించిన భారతీయ క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్, వైభవ్ సూర్యవంశీలు ట్రెండింగ్ వ్యక్తులుగా నిలిచారు. అదే సమయంలో మహా కుంభ్ వంటి ప్రధాన ఈవెంట్ల గురించి తెలుసుకోవడంలో ప్రజలు ఆసక్తి చూపారు. అలాగే Earthquake near me, Air Quality near me వంటి ఆచరణాత్మక సమాచార కోసం గూగుల్‌ను ఎక్కువగా ఉపయోగించుకున్నారు.

Advertisement

అలాగే, Phu Quoc వంటి ప్రదేశాలకు ట్రిప్ ప్లాన్ చేయడం, #67 meme వెతకడం వంటి విషయాలకు కూడా ప్రజలు ఎక్కువ సమయం కేటాయించారు. దివంగత ప్రముఖులను గుర్తుచేసుకుంటూ, ధర్మేంద్ర వంటి ఐకాన్‌ల గురించి కూడా గూగుల్‌లో భారీగా సెర్చింగ్ జరిగాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×