E-Paper
Advertisement

Rajinikanth : నీలాంబరి పాత్రను మిస్ చేసుకున్న ఐశ్వర్యరాయ్, అసలు బ్యాక్ స్టోరీ ఏంటంటే?

Rajinikanth : నీలాంబరి పాత్రను మిస్ చేసుకున్న ఐశ్వర్యరాయ్, అసలు బ్యాక్ స్టోరీ ఏంటంటే?
Advertisement

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో కొన్ని ప్రత్యేకమైన చిత్రాలలో పడయప్ప ఒకటి. ఇదే సినిమాను తెలుగులో నరసింహ పేరుతో డబ్బింగ్ చేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాతిక సంవత్సరాల తరువాత ఆ సినిమా చేశారు. ఇప్పటికీ కూడా ఆ సినిమాకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మరోసారి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. అలానే ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఈ సినిమా విడుదలవుతుంది. మొత్తానికి ఈ సినిమా వెనకున్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను సూపర్ స్టార్ రజినీకాంత్ వీడియో రూపంలో తెలిపారు.

ఐశ్వర్యరాయ్ కు కథ నచ్చలేదు 

Advertisement

ఈ సినిమాలో నీలాంబరి అనే పాత్రకు ఐశ్వరరాయ్ కరెక్ట్. ఆవిడే ఈ పాత్రను చేయాలి. రజనీకాంత్ కి అనిపించిందట. అప్పుడు రవికుమార్ సర్ ఆవిడ చాలా బిజీగా ఉంది. చాలా ట్రై చేస్తున్నాను. మూడు నాలుగు సంవత్సరాలు మంచి బిజీగా ఉన్నారు అని చెప్పారు.

అయినా ఈ పాత్రకి ఆమె కరెక్ట్ ఒక రెండు సంవత్సరాలు ఎదురు చూసిన పర్లేదు అని రజనీకాంత్ కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ పాత్ర ఆమెకు చేయడం ఇష్టం లేదు అని చెప్పేసారట. ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం ఎదురు చూడటం అనవసరం అని రజనీకాంత్ వదిలేశారు.

శ్రీదేవి, మీనా ఎవరు సెట్ కాలేదు

Advertisement

ఆ తర్వాత నీలాంబరి అనే పాత్రను ఎవరు చేస్తారు అని రవికుమార్ ని అడిగారట రజనీకాంత్. అయితే శ్రీదేవి , మీనా, మాధురి దీక్షిత్ అని చాలామంది పేర్లు చెప్పారట రవికుమార్. కానీ ఎవరికీ కూడా ఆ కళ్ళలో ఆ పొగరు కనిపించడం లేదు. ఏం చేద్దాం అని అనుకున్న తరుణంలో హైదరాబాదు నుంచి రవికుమార్ ఫోన్ చేశారు.

సార్ నేను మీకు ఒక పేరు చెప్తాను కొంచెం ఆలోచించండి అని చెప్పారట. ఆ తర్వాత రమ్యకృష్ణ పేరు చెప్పారట. అయితే కొన్ని రోజులు తర్వాత లిఫ్ట్ లో నుంచి రమ్యకృష్ణ నడిచి వస్తుంటే ఆ కళ్ళల్లో పవర్ రజనీకాంత్ కి కనిపించిందట. ఆ తర్వాత రెండు కేజీలు వెయిట్ అనగానే పెరిగింది అంటే సూపర్ గా ఉంటుంది అని అనిపించింది. మొత్తానికి నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయారు.

ఇప్పటికీ రమ్యకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించిన కూడా నీలాంబరి అనే పాత్ర ఆమె కెరియర్ కి చాలా ప్రత్యేకంగా ఉండిపోతుంది. నీలాంబరి, శివగామి పాత్రలు రమ్యకృష్ణ కెరియర్ లో చిరస్థాయిగా మిగిలిపోతాయి. మొత్తానికి ఎవరు చేయవలసిన పాత్రలు వాళ్ల కోసమే రాసిపెట్టి ఉన్నాయి అన్నట్లు ఐశ్వర్యరాయ్ చేయాల్సిన పాత్ర రమ్యకృష్ణ చేశారు.

Also Read: Bandi Saroj Kumar : మీ బిహేవియర్ బాలేదు… అఖండ2 నిర్మాతలపై బండి సరోజ్ ఆగ్రహం

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×