E-Paper
Advertisement

Google Maps: ఫ్రెండ్‌లాగా మాట్లాడే గూగుల్ మ్యాప్స్ ఫీచర్.. ప్రయాణ సమయాల్లో ఎలా ఉపయోగించాలంటే

Google Maps: ఫ్రెండ్‌లాగా మాట్లాడే గూగుల్ మ్యాప్స్ ఫీచర్.. ప్రయాణ సమయాల్లో ఎలా ఉపయోగించాలంటే
Advertisement

Google Maps| గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పుడు చాలా పెద్ద మార్పు వచ్చింది. గూగుల్ మ్యాప్స్ తన యూజర్స్ కోసం ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీని పేరు Ask Maps. ఈ ఫీచర్ ఒక ఫ్రెండ్‌లాగా గూగుల్ మ్యాప్స్‌ యూజర్‌తో మాట్లాడుతుంది. దీని కోసం ఎలాంటి కీవర్డ్స్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు పూర్తి వాక్యాలలో ప్రశ్నలు అడగవచ్చు. రియల్-వరల్డ్ సమస్యలకు సరైన సమాధానాలు ఇస్తుంది. ట్రావెల్, నావిగేషన్ మరింత సులభంగా, త్వరగా అవుతాయి.

Ask Maps అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

Ask Maps అనేది గూగుల్ మ్యాప్స్ లోపలే ఉండే వర్చువల్ అసిస్టెంట్ లాంటిది. మీరు సాధారణంగా మాట్లాడినట్టు ప్రశ్నలు అడగవచ్చు. ఇది కాంటెక్స్ట్ అర్థం చేసుకుని సరైన సమాధానాలు ఇస్తుంది. ఉదాహరణకుజజ “నా ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉంది, దగ్గర్లో ఉన్న హోటల్ చూపించు” అని అడగవచ్చు. లేదా “రాత్రి లైట్లు ఉన్న టెన్నిస్ కోర్ట్ ఎక్కడ ఉంది?” అని అడిగితే సరైన గూగుల్ మ్యాప్స్ అనువైన స్థలాలు సజెస్ట్ చేస్తుంది. ఒకే వాక్యంలో ఎన్ని కండీషన్లు అయినా అర్థం చేసుకుంటుంది.

రోజువారీ ఉపయోగంలో ఎలాంటి బెనిఫిట్స్?

Advertisement

ఈ ఫీచర్ డైలీ ట్రావెల్, బయటకు వెళ్లే ప్లాన్‌లకు చాలా ఉపయోగకరం. నిశ్శబ్దంగా ఉండే కేఫేలు, జనం తక్కువగా ఉన్న చోట్లు అడగవచ్చు. రాత్రి ఓపెన్ ఉన్న స్థలాలు కూడా సులభంగా దొరుకుతాయి. ఒకే ప్రశ్నలో బహుళ కండీషన్లు చెప్పవచ్చు. సెర్చ్ చేయడానికి సమయం, శ్రమ ఆదా అవుతుంది. స్నేహితుడిలా మాట్లాడినట్టు సలహాలు వస్తాయి.

ఎక్కడ అందుబాటులో ఉంది? భాషలు ఏమిటి?

ప్రస్తుతం Ask Maps అమెరికా, ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో మాత్రమే పనిచేస్తుంది. త్వరలో ఇతర భాషలు, ముఖ్యంగా హిందీ సపోర్ట్ రావాలని గూగుల్ ప్లాన్ చేస్తోంది. ఇది మరిన్ని యూజర్లకు ఉపయోగకరంగా మారుతుంది.

ఎలా ఉపయోగించాలి?

Advertisement

ముందుగా గూగుల్ మ్యాప్స్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి. లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. సెర్చ్ బార్ కింద Ask Maps బటన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసి మీ ప్రశ్న టైప్ చేయండి లేదా వాయిస్‌లో అడగండి. కీవర్డ్స్ కాకుండా పూర్తి సెంటెన్స్‌లలో అడగండి. ఒకే ప్రశ్నలో అంతా వివరంగా చెప్పండి. మీ ప్రశ్నలను అర్థం చేసుకుని ఈ కొత్త ఫీచర్ మరింత కచ్చితమైన సమాధానాలు ఇస్తుంది.

ఆస్క్ మ్యాప్స్ ఎందుకు భిన్నంగా ఉంది?

సాధారణ మ్యాప్స్‌లో కీవర్డ్స్ టైప్ చేయాలి. Ask Mapsలో స్నేహితుడితో మాట్లాడినట్టు అడగవచ్చు. పర్సనలైజ్డ్ సమాధానాలు ఇస్తుంది. జనరిక్ సజెషన్స్ కాకుండా మీ అవసరాలకు తగిన సలహాలు ఇస్తుంది. ట్రావెల్ ప్లానింగ్ సులభంగా, త్వరగా అవుతుంది.

రోజువారీ యూజర్లకు లాభాలు

డైలీ నావిగేషన్‌లో గందరగోళం తగ్గుతుంది. సమీపంలో ఉన్న ఉత్తమ ఆప్షన్లు సులభంగా దొరుకుతాయి. సెర్చ్ చేయడానికి సమయం ఆదా అవుతుంది. ట్రిప్‌లు మరింత ఎఫిషియెంట్‌గా ప్లాన్ చేయవచ్చు.

Also Read: అదుపు తప్పిన రోబో.. హెటల్‌లో టేబుల్స్, ప్లేట్లు పగలగొట్టి డ్యాన్స్.. ఏం జరిగిందంటే

Ask Maps ఫీచర్ గూగుల్ మ్యాప్స్‌కు చాలా స్మార్ట్ అడిషన్. AIతో రియల్-వరల్డ్ నావిగేషన్ అవసరాలను కలిపి ఇస్తుంది. సెర్చ్ చేయడం మరింత సహజంగా, యూజర్-ఫ్రెండ్లీగా మారింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే మ్యాప్స్ ఉపయోగించే విధానమే మారిపోతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×