E-Paper
Advertisement

Google AI Course: ఏఐ నేర్చుకోండి కేవలం 10 గంటల్లో.. కొత్త ప్రొగ్రామ్ లాంచ్ చేసిన గూగుల్

Google AI Course: ఏఐ నేర్చుకోండి కేవలం 10 గంటల్లో.. కొత్త ప్రొగ్రామ్ లాంచ్ చేసిన గూగుల్
Advertisement

Google AI Course Certification| గూగుల్ కొత్తగా ఒక AI ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను కోర్సెరాలో లాంచ్ చేసింది. ఈ కోర్సును సుమారు 10 గంటల్లో పూర్తి చేయవచ్చు. నిజ జీవితంలో ఉపయోగపడే AI నైపుణ్యాలను త్వరగా ప్రజలు నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా AI లర్నింగ్ స్కిల్స్ పెంచడానికి గూగుల్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగం.

నిత్యం అవసరమయ్యే పనులకు తగినట్లు రూపకల్పన

ఈ సర్టిఫికేషన్ ప్రొగ్రామ్‌లో సాధారణ AI గురించి మాత్రమే కాకుండా, ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంపొందించడానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగం కోసం వెతికేవారికి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. రీసెర్చ్ స్కిల్స్, కమ్యూనికేషన్, కంటెంట్ క్రియేషన్, డేటా అనాలిసిస్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్ వంటి అంశాలు ఉంటాయి. మొత్తం ఏడు చిన్న కోర్సులు, ఆ తరువాత చివర్లో ఒక క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ ఉంటాయి. పూర్తి చేసినవారికి గూగుల్ నుంచి ప్రొఫెషనల్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ సర్టిఫికేషన్‌తో మీ రెజ్యూమ్‌‌కు మరింత బలం చేకూరుతుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచుకోవచ్చు.

AI టూల్స్‌తో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్

Advertisement

కోర్సు చేసేవారికి మూడు నెలలు గూగుల్ AI Proకి ఉచిత యాక్సెస్ ఇస్తారు. దీంతో అడ్వాన్స్‌డ్ AI టూల్స్‌ను ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ టూల్స్‌లో:

Gemini (మల్టీమోడల్ AI టాస్క్‌లకు)
NotebookLM (AI సహాయంతో రీసెర్చ్ చేయడానికి)
AI Studio (కస్టమ్ వర్క్‌ఫ్లోలు బిల్డ్ చేయడానికి) ఉన్నాయి. థియరీలో కాకుండా ప్రాక్టికల్ AI సిస్టమ్స్‌తో పని చేయడం నేర్చుకుంటారు.

ఎవరు ఈ కోర్సు చేయాలి?

Advertisement

ఈ కోర్సు చాలా మందికి సరిపోతుంది. ప్లానింగ్, అనాలిసిస్, కమ్యూనికేషన్‌లో AI ఉపయోగించే ఉద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ కోర్సు చేయడానికి పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. కోర్సు పూర్తి చేసిన తర్వాత AI ప్రాజెక్ట్‌ల పోర్ట్‌ఫోలియో తయారు చేసుకోవచ్చు. ఇది ఎంప్లాయర్లకు మీ నైపుణ్యాలను చూపిస్తుంది.

ఇప్పుడు ఎందుకు ముఖ్యం?

ప్రపంచవ్యాప్తంగా AI నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు, అర్హతల మధ్య పెద్ద గ్యాప్ ఉంది. భారతదేశంలో 2027 నాటికి 10 లక్షలకు పైగా AI ఉద్యోగాలు ఖాళీగా ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇలాంటి చిన్న, ప్రాక్టికల్ కోర్సులు ఈ గ్యాప్‌ను తగ్గిస్తాయి. త్వరగా నైపుణ్యాలు సంపాదించి కొత్త కొత్త టెక్నాలజీ ఉద్యోగాలకు సిద్ధం కావచ్చు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్రెట్ సెట్టింగ్.. ఆన్‌లైన్‌లో ఉన్నా ఆఫ్‌లైన్ చూపించవచ్చు.. ఇలా చేయండి

ఫ్లెక్సిబుల్, కెరీర్ ఫ్రెండ్లీ

ఈ సర్టిఫికెట్ కోర్సెరాలో ఉంది. సొంత సమయానికి తగ్గట్టు చదవవచ్చు. ఉద్యోగం చేసేవారికి ఇది చాలా సౌకర్యవంతం. పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్‌ను LinkedIn లేదా రెజ్యూమ్‌లో షేర్ చేయవచ్చు. ఇది ఎంప్లాయర్లకు మీ AI నైపుణ్యాలను చూపిస్తుంది.

AI లెర్నింగ్ ప్రొగ్రామ్స్‌

గూగుల్ గత కొన్ని సంవత్సరాలుగా AI శిక్షణను విస్తరిస్తోంది. టీచర్లకు AI ట్రైనింగ్, కమ్యూనిటీల్లో AI స్కిల్స్ హబ్‌లు వంటివి చేస్తోంది. ఈ 10 గంటల సర్టిఫికెట్ జాబ్-రెడీ స్కిల్స్‌పై దృష్టి పెడుతుంది.

గూగుల్ 10 గంటల AI ప్రొఫెషనల్ సర్టిఫికెట్ త్వరగా, ప్రాక్టికల్‌గా AI నైపుణ్యాలు నేర్చుకోవడానికి మంచి అవకాశం. నిజమైన AI టూల్స్‌తో పని చేసి, గుర్తింపు పొందిన సర్టిఫికెట్ తీసుకోవచ్చు. కెరీర్ మొదలు పెట్టేవారు లేదా అభివృద్ధి కోరుకునేవారికి ఇది త్వరగా వ్యాల్యూ పెంచుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×