E-Paper
Advertisement

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ
Advertisement

Google Introduction: టెక్నాలజీ నేపథ్యంలో కొత్త కొత్త మోసాలు పుట్టుకొస్తున్నాయి. ఏదో విధంగా వినియోగదారులను మోసాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా వాయిస్ క్లోనింగ్ పేరుతో మోసగాళ్లు చేస్తున్న ఫేక్ కాల్ డిటెక్షన్ కోసం కొత్త ఫీచర్‌ను రెడీ చేసింది గూగుల్. దీన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం

Advertisement

టెక్నాలజీ యుగంలో మోసాలకు కొదవలేదు. ఫోన్ మొదలు అన్నింటికీ లింకు కావడంతో ఇదే అదునుగా భావించి మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తొలుత కాల్స్ చేసి వినియోగదారుల నుంచి కోట్లకు కోట్లు కొల్లగొట్టిన ఆర్థిక మోసగాళు, ఇకపై ఏఐ ఆధారంగా కాల్స్ చేయడం మొదలు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఒరవడి క్రమంగా పెరుగుతోంది. దీన్ని ముందుగానే పసిగట్టిన గూగుల్.. వాటి చెక్ పెట్టేందుకు దృష్టి పెట్టింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మన ఇంట్లోని వ్యక్తి గొంతుతో మోసపూరిత కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్ యూజర్ల కోసం ఫేక్ కాల్ డిటెక్షన్ పేరుతో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది గూగుల్. రానున్న ఫీచర్ ద్వారా యూజర్లకు మరింత రక్షణ లభించనుంది.

Advertisement

వాయిస్ బేస్డ్ కాల్స్‌కు ఇకపై చెక్

గూగుల్ విడుదల చేయనున్న కొత్త ఫీచర్ రియల్ టైమ్‌లో పని చేస్తుంది. మీ ఫోన్‌లో ఉన్న నెంబర్ల నుంచి కాల్ వచ్చినప్పుడు నిజంగా ఆ వ్యక్తి డివైజ్ నుంచి వచ్చిందా? లేదా తెర వెనుక పరిశీలించనుంది. ఆర్సీఎస్ టెక్నాలజీ ద్వారా సైలెంట్ సిగ్నల్ పంపడం ద్వారా కాల్స్‌ని నిర్ధారించుకుంటుంది.

ఒకవేళ ఎవరైనా మోసగాడు బంధువుల నెంబర్‌ను స్పూఫ్ చేసి ఏఐ గొంతుతో అనుకరించి కాల్ చేసినా ఈ ఫీచర్ క్షణాల్లో పసిగట్టేస్తోంది. సదరు వినియోగదారుడికి కాల్ వస్తే స్క్రీన్‌పై హెచ్చరిక చూపించనుంది. వెంటనే కాల్ కట్ చేసే ఆప్షన్ ఇవ్వనుంది కొత్త ఫీచర్. ఇటీవల కాలంలో ఏఐ వచ్చిన తర్వాత వాయిస్ క్లోనింగ్ మోసాలు విపరీతంగా పెరిగాయి.

ALSO READ: ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

కుటుంబ సభ్యులు ప్రమాదంలో ఉన్నట్లు ఫోన్ చేసి నమ్మించి డబ్బులు గుంజడం వంటివి జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 400 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని కలిగిస్తున్నాయని నిపుణుల అంచనా. గూగుల్ తీసుకువచ్చిన ఈ ఫీచర్ రానున్న ఎంతగానో వినియోగదారులకు ఉపయోగపడనుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×