E-Paper
Advertisement

Google Assistant: ఆండ్రాయిడ్ యూజర్లకు గట్టి షాక్.. గూగుల్ అసిస్టెంట్ తొలగింపు

Google Assistant: ఆండ్రాయిడ్ యూజర్లకు గట్టి షాక్.. గూగుల్ అసిస్టెంట్ తొలగింపు
Advertisement

Google Assistant Shutdown | ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ గట్టి షాకిచ్చింది. ప్రధాన ఆండ్రాయిడ్ యాప్‌ అయిన గూగుల్ అసిస్టెంట్ ఇకపై అందుబాటులో ఉండదు. 9 సంవత్సరాల క్రితం లాంచ్ అయిన గూగుల్ అసిస్టెంట్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని గూగుల్ కంపెనీ షట్ డౌన్ చేయబోతోంది.

2026లో పూర్తిగా షట్‌డౌన్

గూగుల్ అసిస్టెంట్ యాప్ ఇకపై పూర్తిగా తొలగించబడుతుంది. ఈ వాయిస్ కమాండ్ సర్వీస్ 2016లో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు మిలియన్ల ఆండ్రాయిడ్ డివైసుల నుంచి అదృశ్యమవబోతోంది. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం మరికొన్ని నెలల్లోఅమలు చేయబోతోంది. 2026 మార్చి నాటికి గూగుల్ అసిస్టెంట్ సర్వీస్ పూర్తిగా నిలిపివేయబడుతుంది.

గూగుల్ అధికారిక ప్రకటన

Advertisement

గూగుల్ ఈ మేజర్ మార్పును ఇటీవల అధికారికంగా ప్రకటించింది. అసిస్టెంట్ యాప్ పూర్తిగా తొలగించబడుతుందని.. అని గూగుల్ సపోర్ట్ పేజీలలో స్పష్టం చేసింది. ఇది ఫోన్లు, టాబ్లెట్లు, కనెక్టెడ్ డివైసులన్నింటినీ ప్రభావితం చేస్తుంది. అసిస్టెంట్ సర్వీస్ లాగే గూగుల్ ముందు కూడా పాపులర్ ప్రొడక్టులను మూసేసిన చరిత్ర ఉంది. ఉదాహరణకు, గూగుల్ డ్యూయో (Google Duo)ని ఇంతకుముందు తొలగించింది.

సిరి, అలెక్సాకి పోటీగా

ప్రారంభంలో సిరి, అలెక్సాకి గూగుల్ అసిస్టెంట్ పోటీగా వచ్చింది. కానీ ఇప్పుడు అది గూగుల్ ఎకోసిస్టమ్‌లో ఇంటిగ్రేట్ అయింది. యూజర్లు వాయిస్ కమాండ్‌లతో డివైసులను కంట్రోల్ చేసేవారు. ఈ గ్లోబల్ ట్రెండ్ ఇప్పటికీ బలంగా ఉంది. కానీ గూగుల్ ఇప్పుడు అసిస్టెంట్ నుంచి తొలగిస్తూ.. జెమిని AIని ప్రమోట్ చేస్తోంది. జెమిని ఒక అడ్వాన్స్‌డ్ AI ప్రొడక్టుల సెట్. ఇందులో అసిస్టెంట్‌కు మించి మరిన్ని ఫీచర్లు ఇస్తుంది.

గూగుల్ జెమిని

Advertisement

గూగుల్ అసిస్టెంట్ స్థానాన్ని జెమిని AI భర్తి చేస్తుంది. గూగుల్ గెమిని AI అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. మార్చి చివరి నాటికి అన్ని ఇంప్రూవ్‌మెంట్లు విడుదల చేస్తారని అంచనా. ఒరిజినల్ అసిస్టెంట్ యాప్ డౌన్‌లోడ్ చేయడం లేదా కొత్త డివైసుల్లో ఇన్‌స్టాల్ చేయడం ఇకపై సాధ్యం కాదు. అసిస్టెంట్ లాంటి కమాండ్‌లను జెమిని అర్థం చేసుకుంటుంది.. అంతకుమించి నేచురల్‌గా మాట్లాడటానికి అవకాశం ఇస్తుంది. ఇది గూగుల్ యాప్‌లు, సర్వీసులతో సులభంగా కనెక్ట్ అవుతుంది.

ఆండ్రాయిడ్ డివైజ్‌లపై ప్రభావం

గూగుల్ చేసే ఈ మార్పు అన్ని రకాల ప్రొడక్టులను ప్రభావితం చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి టాబ్లెట్ల వరకు, కార్ సిస్టమ్‌లు, ఇతర స్మార్ట్ డివైసులు కూడా జెమిని వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవుతాయి. జెమిని ఈ డివైజ్‌లన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. హోమ్ స్పీకర్లు, టీవీలు, స్మార్ట్ డిస్‌ప్లేలు కూడా జెమిని ఆధారితంగా మారతాయి. జెమిని ఆధారిత కొత్త హోమ్ స్పీకర్‌ను గూగుల్ త్వరలోనే తీసుకురాబోతోంది.

షట్‌డౌన్ టైమ్‌లైన్

గూగుల్ అసిస్టెంట్ షట్‌డౌన్ టైమ్‌లైన్ చూస్తే.. ప్రస్తుత గెమిని వెర్షన్లు త్వరలోనే ఫేజ్ అవుట్ అవుతాయి. 2025 క్యాలెండర్ ఇయర్ చివరి రోజు వరకు అసిస్టెంట్ పనిచేస్తుంది. గూగుల్ జెమిని హోమ్ AI బీటా వెర్షన్‌ను నెల క్రితమే ప్రవేశపెట్టింది. ఇది ఫోన్‌లతో పాటు స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్‌ను మేనేజ్ చేస్తుంది. యూజర్లు జెమిని ఉపయోగించడం నేర్చుకోవాల్సి ఉంటుంది. గూగుల్ సపోర్ట్ పేజ్‌లు అప్‌డేట్ చేసి, జెమిని యూజ్ గైడ్‌ని జారీ చేస్తుంది.

ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది చాలా పెద్ద మార్పు. గూగుల్ తన AI ఫ్యూచర్ వైపు వేగంగా ముందుకు సాగుతోంది. అసిస్టెంట్ తొలగింపు ఇందులో కీలక అడుగు. అసిస్టెంట్ లాంటి క్లాసిక్ ఫీచర్లు ముగుస్తున్నా.. జెమిని మరిన్ని అడ్వాన్స్‌డ్ కెపాబిలిటీలు ఇస్తుంది. యూజర్లు ఇప్పుడే జెమిని ట్రై చేసి కొత్త టెక్నాలజీకి క్రమంగా అలవాటు పడాలి.

Also Read: ప్రజలపై నిఘా.. గూఢచర్యం చేస్తున్న వై ఫై రూటర్లు..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×