// // GoBoult Tenet Pro: 75 గంటల బ్యాటరీ లైఫ్‌తో సరికొత్త ఇయర్‌బడ్స్ లాంచ్! -->
E-Paper
Advertisement

రూ.1500 లోపు నోరువెళ్లబెట్టే ఫీచర్లు.. ఏకంగా 75 గంటల బ్యాటరీతో కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్!

రూ.1500 లోపు నోరువెళ్లబెట్టే ఫీచర్లు.. ఏకంగా 75 గంటల బ్యాటరీతో కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్!
Advertisement

GoBoult Tenet Pro: ప్రముఖ ఆడియో బ్రాండ్ గోబౌల్ట్ (GoBoult) భారత మార్కెట్లోకి సరికొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది. ‘గోబౌల్ట్ టెనెట్ ప్రో’ (GoBoult Tenet Pro) పేరుతో లాంచ్ అయిన ఈ మోడల్.. ఈ ఏడాది జనవరిలో వచ్చిన టెనెట్ ఇయర్‌బడ్స్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వచ్చింది. పాత మోడల్ డిజైన్‌ను కొనసాగిస్తూనే.. ఇందులో సరికొత్త హార్డ్‌వేర్ ఫీచర్లను కంపెనీ జోడించింది.

ఆకట్టుకునే ధర, ఆఫర్లు:

భారత మార్కెట్లో గోబౌల్ట్ టెనెట్ ప్రో ధరను రూ.1,699గా నిర్ణయించారు. అయితే లాంచింగ్ ఆఫర్ కింద పరిమిత కాలం పాటు వీటిని కేవలం రూ.1,499కే సొంతం చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. క్రిమ్సన్ రెడ్, ఫ్రాస్ట్ వైట్, ఆలివ్ గ్రీన్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇవి లభిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్‌ను గోబౌల్ట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

అద్భుతమైన ఆడియో క్లారిటీ:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ 13mm డైనమిక్ డ్రైవర్లతో వస్తాయి. ఇవి ఏఏసీ (AAC), ఎస్‌బీసీ (SBC) ఆడియో కోడెక్స్‌ను సపోర్ట్ చేస్తాయి. దీంతో పాటలు వినేటప్పుడు మంచి బేస్, స్పష్టమైన సౌండ్ లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో 32 డెసిబెల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఉంది. ఇది బయటి శబ్దాలను అడ్డుకుని ప్రశాంతంగా మ్యూజిక్ ఆస్వాదించడానికి సాయపడుతుంది. అలాగే కాల్స్ మాట్లాడేటప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా క్లియర్‌గా వినిపించడం కోసం దీనిలో 4 మైక్రోఫోన్లతో కూడిన ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని వాడారు.

Also Read: భారత్‌లోకి Poco సరికొత్త ఫోన్.. ఏకంగా 8000mAh బ్యాటరీతో రచ్చ లేపనున్న M8 Power!

కనెక్టివిటీ, గేమింగ్ ఫీచర్లు:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్‌లో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఉంది. దీంతో ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రెండింటికీ ఇవి సపోర్ట్ చేస్తాయి. గేమర్స్ కోసం ఇందులో 45 మిల్లీసెకన్ల లో-లేటెన్సీతో కూడిన ‘కాంబ్యాట్ గేమింగ్ మోడ్’ ఇచ్చారు. వీటితో పాటు ఏఐ వాయిస్ అసిస్టెంట్, కస్టమ్ ఈక్వలైజర్ సెట్టింగ్స్ కోసం గోబౌల్ట్ యాంప్ యాప్ (AmpApp) సపోర్ట్ కూడా ఉంది.

భారీ బ్యాటరీ లైఫ్, సరికొత్త డిజైన్:

ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఈ ఇయర్‌బడ్స్ ఏకంగా 75 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. టైప్-సి పోర్ట్ ద్వారా ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఇయర్ బడ్స్ ఆర్బిట్ క్యాప్సూల్ డిజైన్, ఫ్రాస్ట్ వ్యూ షెల్ వంటి ప్రత్యేకతలతో స్టైలిష్‌గా కనిపిస్తాయి. చెవుల ఆకృతికి సరిపోయేలా ప్రత్యేకంగా లీడార్ (LiDAR) మ్యాపింగ్ టెక్నాలజీతో వీటిని రూపొందించారు. చెవుల్లో సరిగ్గా కుదురుకోవడానికి వాక్యూమ్ లాక్ ఇయర్ షెల్, ఎలిప్టికల్ ఇయర్ టిప్స్ సాయపడతాయి. వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం వీటికి ఐపీఎక్స్5 (IPX5) రేటింగ్ కూడా ఉంది.

Also Read: రూ.21,000 బడ్జెట్‌లో 48 గంటల బ్యాటరీ బ్యాకప్.. Realme Narzo 100x భారత్‌లోకి వచ్చేసిందోచ్!

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×