E-Paper
Advertisement

బయటకు వెళ్తే పాడవుతారని పిల్లలతో ఇంట్లోనే పాడుపనులు… ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు

బయటకు వెళ్తే పాడవుతారని పిల్లలతో ఇంట్లోనే పాడుపనులు… ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు
Advertisement

Psychological Drama :ఓటీటీలో లెక్కలేనన్ని సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అందులో మోస్ట్ డిస్టర్బింగ్ సినిమాలు కూడా బాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఈ మూవీ విచిత్రంగా, డిస్టర్బ్ చేసే విధంగా, ఇదివరకెన్నడూ చూడని కొత్త కథతో ఉంటుంది. బుర్రకు పదును పెట్టే ఆ సినిమా పేరే ‘డాగ్‌టూత్’ (Dogtooth). మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సినిమాలో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. దానికి కాంపౌండ్ గోడలు, ఎత్తైన ఫెన్సింగ్‌… బయటి ప్రపంచం ఏమాత్రం సంబంధం ఉండదు. ఈ ఇంట్లో ఒక తండ్రి, తల్లి, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉంటారు. ఈ పిల్లలు వయసులో పెద్దవారైనా, పుట్టినప్పటి నుంచి ఆ గోడలు దాటి బయటకు అడుగు పెట్టి ఉండరు. తండ్రి మాత్రమే రోజూ ఫ్యాక్టరీకి వెళ్తాడు. మిగిలిన వాళ్ళంతా ఆ ఇంట్లోనే జైల్లో ఖైదీల్లా బయటకు రాకుండా ఉంటారు.

Advertisement

ఇంట్లో జరిగే ప్రతిది తల్లిదండ్రుల కంట్రోల్ లోనే జరుగుతుంది. పిల్లలకు బయటి ప్రపంచాన్ని భయంకరంగా చూపించడానికి అన్ని అబద్దాలే చెప్తారు ఆ పేరెంట్స్. అంతేకాదు ‘సముద్రం’ అంటే పెద్ద కుర్చీ, ‘టెలిఫోన్’ అంటే ఉప్పు, ‘జాంబీస్’ అంటే పసుపు పువ్వులు అని నేర్పుతారు. విమానాలు ఆకాశంలో ఎగురుతున్న బొమ్మలని, అవి కింద పడితే ఆడుకోవచ్చని చెబుతారు. ఈ వింత డిక్షనరీతో పిల్లల మనసులను పూర్తిగా తమ కంట్రోల్ లోనే ఉంచుకుంటారు.

కానీ కొడుకు లైంగిక అవసరాల కోసం తండ్రి ఓరోజు ఫ్యాక్టరీలో పని చేసే క్రిస్టినా అనే అమ్మాయిని డబ్బులిచ్చి ఇంటికి తీసుకువస్తాడు. ఆమె రాకతో కథలో బిగ్గెస్ట్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. క్రిస్టినా రహస్యంగా పెద్ద కూతురికి పాపులర్ హాలీవుడ్ సినిమాల టేపులు ఇస్తుంది. ఆ సినిమాలు చూసిన తర్వాత ఆ అమ్మాయికి బయటి ప్రపంచం మీద తీవ్ర ఆకర్షణ కలుగుతుంది. అలాగే ఆమె స్వేచ్ఛ కోసం తహతహలాడుతుంది. ఆమె ఇంట్లో నేర్చుకున్న విషయాలకు భిన్నంగా ప్రవర్తించడం, సినిమా డైలాగులు చెప్పడం, విచిత్రంగా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది.

Advertisement

ఇదంతా గమనించిన తండ్రి క్రిస్టినాకు పనిష్మెంట్ ఇస్తాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటడంతో తండ్రి పిల్లలకు ఒక కండిషన్ పెడతాడు. పై దవడలోని కోరపన్ను ఊడిపోయినప్పుడే వాళ్ళు బయటి ప్రపంచంలో జీవించడానికి సిద్ధమవుతారు అన్నది ఆ కండిషన్. మరి ఆ కండిషన్ కు అతని కూతురు ఎలా రియాక్ట్ అయ్యింది ? క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

ఇండియాలో ఈ సినిమా ప్రస్తుతం MUBI OTT ప్లాట్‌ఫామ్‌లో సబ్‌స్క్రిప్షన్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని దేశాల్లో Amazon Prime Videoలో రెంట్ కి అందుబాటులో ఉంది. కానీ తెలుగు డబ్బింగ్ లేదు. గ్రీక్ దర్శకుడు Yorgos Lanthimos 2009లో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఆస్కార్ నామినేషన్ పొందిన ఈ చిత్రం ఆధునిక తల్లిదండ్రుల పెంపకంపై ఒక సెటైరికల్ మూవీ. మన మనసును కలచివేసే ఒక సైకలాజికల్ ఎక్స్‌పెరిమెంట్.

Read Also: 17 మందిని పొట్టన పెట్టుకున్న సీరియల్ కిల్లర్… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి మావా ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×