E-Paper
Advertisement

GoBoult Smartwatches: గోబౌల్ట్ ముస్తాంగ్ సిరీస్‌లో.. స్టాలియన్, రేసర్, మసిల్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర, ఫీచర్లు ఇవే!

GoBoult Smartwatches: గోబౌల్ట్ ముస్తాంగ్ సిరీస్‌లో.. స్టాలియన్, రేసర్, మసిల్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర, ఫీచర్లు ఇవే!
Advertisement

GoBoult Smartwatches: ప్రముఖ స్వదేశీ బ్రాండ్ ‘గోబౌల్ట్’ (GoBoult).. ముస్తాంగ్ సిరీస్ (Mustang Series)లో భాగంగా మూడు స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది. ముస్తాంగ్ స్టాలియన్ (Mustang Stallion), ముస్తాంగ్ రేసర్ (Mustang Racer), ముస్తాంగ్ స్ప్రింట్ టీడబ్ల్యూఎస్ (Mustang Sprint TWS) వేరియంటల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. బైక్ రైడర్స్ ను ఈ వాచ్ లు ఎంతగానో ఆకట్టుకుంటాయని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వాచ్ ల ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Mustang Stallion

ముస్తాంగ్ సిరీస్ లైనప్ లో ఇది ప్రీమియం స్మార్ట్ వాచ్ గా ఉంది. 1.43 అంగుళాల AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. ఆటోమోటివ్ హార్డ్ వేర్ డిజైన్ తో ఇది రూపొందింది. పిస్టన్ – హెడ్ పవర్ స్విచ్, స్పీడో మీటర్ ఆధారిత రోటేటింగ్ బెజెల్, ఇగ్నిషన్ స్టైల్ లివర్, టెక్చర్డ్ క్రౌన్ వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది . బ్లూటూత్ కాలింగ్, హెల్త్ మానిటరింగ్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్, కస్టమ్ ముస్తాంద్ వాచ్ ఫేసెస్ ఇందులో ఉన్నాయి. దీని అసలు ధర రూ.14,999 కాగా లాంచ్ స్పెషల్ ప్రైస్ కింద రూ.3,999కే అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

Mustang Racer

Advertisement

స్టాలియన్ మోడల్ తరహాలోనే ఇది కూడా 1.43 అంగుళాల హై క్వాలిటీ AMOLED డిస్ ప్లేతో రూపొందింది. బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్, SpO2, స్లీప్ ట్రాకింగ్ వంటి హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్, నోటిఫికేషన్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. ఈ వాచ్ మార్కెట్ ప్రైస్ రూ.12,999 కాగా, ప్రీఆర్డర్ / లాంచ్ ఆఫర్ కింద రూ.2,999కే అందిస్తున్నారు.

Also Read: Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో ట్విస్ట్.. తెరపైకి జూకర్ బర్గ్, మస్క్ ఫొటోలు.. డిన్నర్‌లో ఎంజాయ్ చేస్తూ..!

Mustang Muscle

Advertisement

ఈ వాచ్ లార్జ్ కర్వ్డ్ డిస్ ప్లేతో లాంచ్ అయ్యింది. అల్లాయ్ వీల్ స్టైల్ హాప్టిక్ క్రౌన్స్, హెల్త్ & ఫిట్‌నెస్ ట్రాకింగ్, డ్యూయల్ రేసింగ్ స్ట్రైప్స్‌తో GT స్టైల్ స్ట్రాప్, బ్లూటూత్ కాలింగ్, స్పోర్ట్స్ మోడ్స్ వంటి ఫీచర్లతో దీనిని తీసుకొచ్చారు. ఈ ముస్తాంగ్ లైనప్ లో అతి తక్కువ ధర కలిగిన వాచ్ గా ఇది ఉంది. దీని ధర రూ.1,999. ముస్తాంగ్ సిరీస్ లోని సిరీస్ లోని స్మార్ట్ వాచ్ లు 5-7 రోజుల బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉండనున్నాయి.

Also Read: AP Telangana Water Dispute: కేంద్ర జలశక్తి మంత్రితో చంద్రబాబు భేటి.. టెన్షన్‌లో తెలంగాణ నేతలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×