E-Paper
Advertisement

MSME Loans: ఎంఎస్ఎంఈలకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. పూచీకత్తు లేకుండా రూ.25 లక్షల రుణాలు

MSME Loans: ఎంఎస్ఎంఈలకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. పూచీకత్తు లేకుండా రూ.25 లక్షల రుణాలు
Advertisement

MSME Loans: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పరిశ్రమలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. మంచి ట్రాక్ రికార్డ్, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న పరిశ్రమలకు రూ.25 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలను అందించవచ్చని నిర్ణయించింది. MSME రుణాలకు సంబంధించిన ఆదేశాలను సవరించింది. ప్రస్తుతం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. తాజాగా ఈ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

“బ్యాంకులు, ఎంఎస్ఈ యూనిట్ల మంచి ట్రాక్ రికార్డ్, ఆర్థిక స్థితి ఆధారంగా రూ.25 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలు అందిచవచ్చు” అని ఆర్బీఐ తెలిపింది.
అలాగే, అవసరమయ్యే చోట బ్యాంకులు క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ప్రయోజనాన్ని పొందవచ్చని తెలిపింది. అయితే బ్యాంకులు మంజూరు చేసిన పూచీకత్తు రహిత రుణాలకు బంగారం, వెండిని పూచీకత్తుగా పెట్టుకోవడం ఆర్బీఐ ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా భావించవచ్చని పేర్కొంది.

Advertisement

పరిమిత ఆస్తులు కలిగిన సూక్ష్మ, చిన్న సంస్థలకు పూచీకత్తు లేకుండా క్రెడిట్ అందించడమే తమ లక్ష్యమని ఆర్బీఐ పేర్కొంది. తాజా ఆదేశాలు ఏప్రిల్ 01, 2026 నుంచి అమల్లోకి వస్తాయి.

ఎంఎస్ఎంఈలకు సడలింపులు

బెంచ్‌ మార్క్ కింద ఎంఎస్ఎంఈలకు రుణాల పరిమితులను, సడలింపులను రీసెట్ నిబంధనలను మూడు నెలలకు తగ్గించారు. దేశీయ ఉత్పత్తి రంగానికి కలగకుండా ప్రభుత్వం ఎస్ఎంఎంఈలకు మినహాయింపులు, సడలింపులు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. సూక్ష్మ సంస్థలకు ఆరు నెలలు, చిన్న సంస్థలకు మూడు నెలల పాటు పలు రకాల సడలింపులు పొడిగించనున్నారు.

Advertisement

Also Read: ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం.. ఎంపీసీ మీటింగ్ లో కీలక అంశాలివే

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×