// // Gmail Flickering Issue: జీమెయిల్ ఓపెన్ చేస్తే స్క్రీన్ ఊగుతోందా? గూగుల్ కీలక నిర్ణయం! -->
E-Paper
Advertisement

శాంసంగ్ ట్యాబులు, ఫోల్డబుల్ ఫోన్లలో జీమెయిల్ కొత్త బగ్.. రంగంలోకి గూగుల్, ఇలా ఫిక్స్ చేసుకోండి!

శాంసంగ్ ట్యాబులు, ఫోల్డబుల్ ఫోన్లలో జీమెయిల్ కొత్త బగ్.. రంగంలోకి గూగుల్, ఇలా ఫిక్స్ చేసుకోండి!
Advertisement

Gmail Flickering Issue: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ-మెయిల్ సర్వీస్ జీమెయిల్. ఇటీవలే యూజర్ల సౌకర్యార్థం సరికొత్త సైన్‌అప్ ఫీచర్లను పరీక్షిస్తున్న గూగుల్.. ప్రస్తుతం ఒక వింత సమస్యను ఎదుర్కొంటోంది. ఆండ్రాయిడ్ టాబ్లెట్లు, ఫోల్డబుల్ ఫోన్లు వాడుతున్న పలువురు యూజర్లు తమ జీమెయిల్ యాప్ స్క్రీన్ విపరీతంగా ఫ్లికరింగ్ (రెప్పపాటులా కదలడం) అవుతోందని గూగుల్ ఫోరమ్స్, సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.

ఏమిటీ సమస్య?

తాజా నివేదికల ప్రకారం.. ఆండ్రాయిడ్ టాబ్లెట్లు, ఫోల్డబుల్ ఫోన్లలో జిమెయిల్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ నిరంతరం కదులుతూ ఇబ్బంది పెడుతోంది. దీనివల్ల ఈ-మెయిల్స్‌లో ఉన్న అక్షరాలు సరిగ్గా కనిపించక, చదవడానికి వీల్లేకుండా పోతోందని యూజర్లు చెప్తున్నారు. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9, గెలాక్సీ ట్యాబ్ ఏ11+, అలాగే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ వాడుతున్న వారికి ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతోంది.

యూజర్ల ప్రయత్నాలు:

Advertisement

ఈ ఇబ్బందిని గమనించిన ఒక యూజర్ మే 16న గూగుల్ సపోర్ట్ ఫోరమ్‌లో దీనిపై ఫిర్యాదు చేశారు. యాప్‌ను ఫోర్స్ స్టాప్ చేయడం, క్యాచీ డేటాను క్లియర్ చేయడం, ట్యాబ్లెట్‌ను రీస్టార్ట్ చేయడం వంటి అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని సదరు యూజర్ పేర్కొన్నారు. యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.

Also Read: రూ.15వేల బడ్జెట్‌లో 7,000mAh బ్యాటరీ ఫోన్.. దుమ్మురేపుతున్న Moto G37 Power!

స్పందించిన గూగుల్:

Advertisement

ఈ సమస్యపై గూగుల్ ప్రతినిధులు స్పందించినట్లు తెలుస్తోంది. ఈ బగ్ గురించి గూగుల్ సంస్థకు సమాచారం అందిందని, వారు దీనిని పరిశీలిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూ (WebView)లో తలెత్తిన లోపం వల్లే శాంం‌సంగ్ డివైజ్‌లలో ఈ ఫ్లికరింగ్ సమస్య వస్తుండవచ్చని అంచనా వేస్తున్నారు. గూగుల్ దీనిపై అధికారికంగా ప్రకటించనప్పటికీ.. త్వరలోనే శాశ్వత పరిష్కారంతో కూడిన అప్‌డేట్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది.

తాత్కాలిక చిట్కాలివే:

కంపెనీ నుండి పూర్తిస్థాయి అప్‌డేట్ వచ్చే వరకు యూజర్లు కొన్ని తాత్కాలిక చిట్కాలను పాటించవచ్చు. ఫోల్డబుల్ ఫోన్ వాడుతున్న వారైతే.. మొదట జీమెయిల్ యాప్‌ను పోర్ట్రెయిట్ మోడ్‌లో ఓపెన్ చేసి, ఆపై ల్యాండ్‌స్కేప్ మోడ్‌కి మార్చాలి. ఆ తర్వాత తిరిగి పోర్ట్రెయిట్ మోడ్‌కి రొటేట్ చేస్తే స్క్రీన్ సాధారణ స్థితికి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు ప్లే స్టోర్‌కి వెళ్లి ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూ యాప్‌ను అప్‌డేట్ చేయడం, జీమెయిల్ స్టోరేజ్ క్యాచీని క్లియర్ చేయడం ద్వారా కూడా ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు.

Also Read: Oppo Reno 16 Series లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. అదిరిపోయే ఫీచర్లతో ఆ రోజున గ్రాండ్ ఎంట్రీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×