E-Paper
Advertisement

బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్..

బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్..
Advertisement

NTRNeel Glimpse: టాలీవుడ్ గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (జూనియర్ ఎన్టీఆర్), కేజీఎఫ్, సలార్ చిత్రాల సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అటు నందమూరి అభిమానుల్లో, ఇటు సగటు సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతూ, మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను పంచుకుంది.

Read also-‘పెద్ది’ ట్రైలర్‌ గురించి రిషబ్ శెట్టి పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే ఫ్యాన్‌కు పండగే..

అర్ధరాత్రి 11:52 గంటలకి..

Advertisement

చిత్ర యూనిట్ తాజాగా పెట్టిన పోస్ట్ ప్రకారం.. ఈ రాత్రి 11:52 గంటలకి NTRNeel చిత్రానికి సంబంధించిన ‘ఫస్ట్ గ్లింప్స్’ విడుదల కానుంది. “కేవలం మరికొన్ని గంటల్లోనే ఎన్టీఆర్-నీల్ ప్రపంచాన్ని మీరు చూడబోతున్నారు.. ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టి, అక్కడి పాత్రలను కలవడానికి సిద్ధంగా ఉండండి” అంటూ చిత్ర నిర్మాణ సంస్థలు ఎమోజీలతో సహా ఒక పవర్‌ఫుల్ పోస్ట్‌ను షేర్ చేశాయి. సాధారణంగా టీజర్లు లేదా గ్లింప్స్‌లు ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో విడుదలవుతుంటాయి. కానీ, ప్రశాంత్ నీల్ తన మార్క్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ అర్థరాత్రి వేళను లాక్ చేయడం విశేషం. ఈ టైమింగ్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

Read also-ఆ సాంగ్ కోసం మాధురి దీక్షిత్ పడిన కష్టం చూస్తే కన్నీళ్ళాగవు భయ్యా.. గర్భవతిగా ఉన్నా

Advertisement

ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే డార్క్ థీమ్, భారీ ఎలివేషన్లు, అరాచకమైన యాక్షన్ సీక్వెన్సులు గుర్తొస్తాయి. ఇక ఎన్టీఆర్ లాంటి పవర్‌హౌస్ పర్ఫార్మర్‌ను ఆయన ఎలా చూపిస్తాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ గ్లింప్స్ ద్వారా కేవలం ఎన్టీఆర్ లుక్ మాత్రమే కాకుండా, ఈ సినిమా ఏ నేపథ్యంలో సాగుతుంది, ఇందులో ఎలాంటి క్యారెక్టర్లు ఉండబోతున్నాయనే హింట్ కూడా ఇవ్వనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×