// // Trifold Phone Comparison| గెలాక్సీ Z ట్రైఫోల్డ్ vs హువాయ్ మేట్ XT.. రెండు కొత్త ట్రై ఫోల్డ్‌ ఫోన్లు.. ఏది బెటర్ -->
E-Paper
Advertisement

Trifold Phone Comparison: గెలాక్సీ Z ట్రైఫోల్డ్ vs హువాయ్ మేట్ XT.. రెండు కొత్త ట్రై ఫోల్డ్‌ ఫోన్లు.. ఏది బెటర్

Trifold Phone Comparison: గెలాక్సీ Z ట్రైఫోల్డ్ vs హువాయ్ మేట్ XT.. రెండు కొత్త ట్రై ఫోల్డ్‌ ఫోన్లు.. ఏది బెటర్
Advertisement

Samsung Galaxy Z TriFold vs Huawei Mate XT comparison| ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌ వేగంగా పెరుగుతోంది. గత సంవత్సరం కంటే 2025లో 14 శాతం సేల్స్ పెరిగాయి. ముఖ్యంగా అగ్రస్థానంలో శాంసంగ్ 64శాతం షేర్ సాధించింది. గెలాక్సీ Z సిరీస్‌కి జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. జూలై 2023లో వచ్చిన Z ఫోల్డ్ 7కి డిమాండ్ చాలా పెరిగింది. ఇందులో 8 అంగుళాల లోపలి స్క్రీన్, 6.5 అంగుళాల కవర్ స్క్రీన్, 200MP కెమెరా ఉన్నాయి.

రెండో స్థానంలో హువాయ్ ఉంది. గత ఏడాది కంటే 10% ఎక్కువ ఫోల్డబుల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. Mate X సిరీస్ మొదటి ట్రై-ఫోల్డ్ ఫోన్. సెప్టెంబర్‌లో కొత్త మోడల్ ప్రకటించింది. తర్వాతి స్థానాల్లో వివో, మోటోరోలా ఫోన్లు ఉండగా.. త్వరలోనే షావోమీ కూడా ట్రై ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేయనుంది.

Advertisement

ఈ నేపథ్యంలో తాజాగా శామ్‌సంగ్ కొత్తగా గెలాక్సీ Z TriFold తాజాగా విడుదల చేసింది. అంతకు ముందు హువాయ్ Mate XT గత ఏడాది వచ్చింది. ఈ రెండు ఫోన్ల మధ్య ఇప్పుడు నేరుగా పోటీ నెలకొంది. ఈ రెండు ఫోన్లలో ఏది బెటర్ అనేది వీటి ఫీచర్లు పోల్చి చూద్దాం.

రెండు ఫోన్ల ధర ఎంత?

శామ్‌సంగ్ గెలాక్సీ Z TriFold ధర రూ.2.2 లక్షలు. డిసెంబర్ 12 నుంచి దక్షిణ కొరియాలో లభిస్తుంది. త్వరలో ఇతర దేశాలకూ వస్తుంది. హువాయ్ మేట్ XT ధర రూ.2.35 లక్షలు. హువాయ్ లో ఎక్కువ కలర్ వేరియంట్స్ ఉన్నాయి. శాంసంగ్‌లో కేవలం క్రాఫ్టెడ్ బ్లాక్ మాత్రమే.

డిజైన్, బరువు ఎలా ఉన్నాయి?

Advertisement

శాంసంగ్ రెండు హింజ్‌లతో లోపలికి మడుస్తుంది. హువాయ్ ఒకే హింజ్‌తో బయటికి ఫోల్డ్ అవుతుంది. శాంసంగ్ బరువు 309 గ్రాములు, హువాయ్ మేట్ 298 గ్రాములు. రెండు పెద్ద ఫోన్లు అయినా మడత చేయగానే జేబులో సులువుగా పడతాయి.

డిస్‌ప్లే సైజ్ ఎంత?

శామ్‌సంగ్ ఓపెన్ చేస్తే 10 అంగుళాల స్క్రీన్, కవర్ స్క్రీన్ 6.5 అంగుళాలు, 120Hz రిఫ్రెష్ రేట్. హువాయ్ ఓపెన్ చేస్తే 10.2 అంగుళాలు కానీ రిఫ్రెష్ రేట్ 90Hz మాత్రమే. ఫోల్డ్ చేసినప్పుడు హువాయ్ లో రెండు చిన్న స్క్రీన్స్ ఉంటాయి.

ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ ఏది బెటర్?

శామ్‌సంగ్‌లో సూపర్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 3nm చిప్ + ఆండ్రాయిడ్ 16 + OneUI 8 ఉన్నాయి. హువాయ్‌లో Kirin 9010 చిప్ + హార్మోనీ OS 4 ఉన్నాయి. రెండింట్లోనూ 16GB RAM ఉంది. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కావాలంటే శామ్‌సంగ్ బెస్ట్.

కెమెరా ఎలా ఉంది?

శామ్‌సంగ్: 200 మెగాపిక్సెల్ మెయిన్ + 12MP అల్ట్రావైడ్ + 10MP టెలిఫోటో, రెండు 10MP సెల్ఫీ కెమెరాలు.
హువాయ్ మేట్ XT : 50 మెగాపిక్సెల్ మెయిన్ (అడ్జస్టబుల్ అపర్చర్) + 12MP పెరిస్కోప్ టెలిఫోటో.
ఫోటో క్వాలిటీ చూసుకుంటే శామ్‌సంగ్ ముందుంటుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ ఎలా ఉన్నాయి?

రెండు ఫోన్లలోనూ 5600mAh బ్యాటరీ ఉంది.
శామ్‌సంగ్: 45W వైర్డ్ + 15W వైర్‌లెస్ ఛార్జింగ్
హువాయ్: 66W వైర్డ్ + 50W వైర్‌లెస్ ఛార్జింగ్
త్వరగా ఛార్జ్ కావాలంటే హువాయ్ గెలుస్తుంది.

ఏ ఫోన్ కొనాలి?

త్వరగా ఛార్జింగ్ + ఎక్కువ కలర్స్ కావాలంటే .. హువాయ్ మేట్ XT తీసుకోండి.
బెస్ట్ కెమెరా + ప్రపంచవ్యాప్త సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కావాలంటే శామ్‌సంగ్ గెలాక్సీ Z TriFold బెటర్ ఆప్షన్.
ధర పరంగా చూసుకుంటే శామ్‌సంగ్ ట్రైఫోల్డ్ రూ.15,000 తక్కువ

రెండూ భవిష్యత్ టెక్నాలజీ అద్భుతాలే! మీ అవసరం, బడ్జెట్ బట్టి ఎంచుకోండి. ఏది కొనుగోలు చేసినా మీ చేతిలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నట్లే.

Also Read: ప్రజలపై నిఘా.. గూఢచర్యం చేస్తున్న వై ఫై రూటర్లు..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×