E-Paper
Advertisement

Samsung AirDrop: శాంసంగ్‌లో ఎయిర్‌డ్రాప్ ఫీచర్.. ఐఫోన్, గెలాక్సీ మధ్య ఈజీ ఫైల్ షేరింగ్

Samsung AirDrop: శాంసంగ్‌లో ఎయిర్‌డ్రాప్ ఫీచర్.. ఐఫోన్, గెలాక్సీ మధ్య ఈజీ ఫైల్ షేరింగ్
Advertisement

Samsung AirDrop| ఆండ్రాయిడ్ ఫోన్స్ తయారు చేసే కొరియా కంపెనీ శాంసంగ్ తన స్మార్ట్‌ఫోన్లలో పెద్ద అప్‌డేట్ తీసుకొచ్చింది. గెలాక్సీ ఫోన్స్‌లో శాంసంగ్ ఇప్పుడు ఆపిల్ ఎయిర్‌డ్రాప్ (AirDrop) లాంటి ఫైల్ షేరింగ్ ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ క్విక్ షేర్ (Quick Share) ఫ్రేమ్‌వర్క్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, iOS డివైస్‌ల మధ్య ఫైల్స్ సులభంగా షేర్ చేయవచ్చు. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు త్వరగా పంపుకోవచ్చు. ఈ ఫీచర్ రావడంతో రెండు ఎకోసిస్టమ్‌ల మధ్య సమస్యలు తగ్గుతాయి.

క్విక్ షేర్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

Quick Share ద్వారా ఫైల్స్ షేర్ చేయడం చాలా సులభం అవుతుంది. ఇప్పుడు ఆపిల్ డివైస్‌లతో కూడా సీమ్‌లెస్‌గా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. క్లిష్టమైన స్టెప్స్ అవసరం లేదు. ఒకే ట్యాప్‌తో ఫైల్స్ పంపుకోవచ్చు. ఇది యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని చాలా మెరుగుపరుస్తుంది. రెండు ఫోన్ల మధ్య ఫైల్ ట్రాన్స్‌ఫర్ స్మూత్‌గా, వేగంగా జరుగుతుంది.

రోల్‌అవుట్ టైమ్‌లైన్, లభ్యత

Advertisement

ఈ ఫీచర్ రోల్‌అవుట్ మార్చి 23 నుంచి మొదలవుతోంది. మొదట సౌత్ కొరియాలో అందుబాటులోకి వస్తుంది. తర్వాత యూరప్, హాంగ్‌కాంగ్, జపాన్, లాటిన్ అమెరికా మార్కెట్లకు విస్తరిస్తుంది. నార్త్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఆసియా, తైవాన్‌లో కూడా త్వరలో వస్తుంది. దశలవారీగా రోల్ అవుట్ జరుగుతుంది.

ప్రస్తుతం ఏ ఫోన్లలో అందుబాటులో ఉంది?

ఈ ఫీచర్ ప్రస్తుతం గెలాక్సీ S26 సిరీస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. గెలాక్సీ S26 మొదటి డివైస్‌గా సపోర్ట్ చేస్తోంది. శాంసంగ్ త్వరలో మరిన్ని డివైస్‌లకు ఈ ఫీచర్ తీసుకొస్తుంది. ఏ ఏ మోడల్స్‌కు వస్తుందో ఇంకా అధికారికంగా చెప్పలేదు.

ట్రెండ్ మొదలుపెట్టిన గూగుల్

Advertisement

గూగుల్ గత ఏడాది Pixel 10 సిరీస్‌తో ఇలాంటి ఫీచర్ తెచ్చింది. తర్వాత Pixel 9కి కూడా విస్తరించింది. ఇది ఇతర బ్రాండ్లను కూడా ఇలాంటి ఫీచర్ తీసుకురావడానికి ప్రేరేపించింది. Samsung ఇప్పుడు అదే మార్గంలో అడుగుపెట్టింది.

ఈ ఫీచర్ ఎందుకు ముఖ్యం?

Android, iOS మధ్య ఫైల్ షేరింగ్ ఎప్పుడూ సమస్యగానే ఉండేది. ఈ ఫీచర్ ఆ సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది. రెండు ఎకోసిస్టమ్‌ల మధ్య సులభ కమ్యూనికేషన్ వస్తుంది. రెండు ఫోన్లు ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టైం సేవ్ అవుతుంది, సౌకర్యం పెరుగుతుంది.

Also Read: ఐఫోన్లు ఇక సురక్షితం కాదు.. నిమిషాల్లో డేటా చోరీ.. ప్రమాదకరమైన కొత్త స్పైవేర్ ఇదే

గెలాక్సీ S26పై డిస్కౌంట్

శాంసంగ్ కొత్త ఫ్లాగ్‌షిప్ Galaxy S26 ఫోన్‌పై కూడా డిస్కౌంట్ ఇస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.87,999. అయితే ఇప్పుడు రూ.79,999కి దొరుకుతోంది. అయితే రూ.8,000 డైరెక్ట్ తగ్గింపు. ఈ ఆఫర్ మార్చి 21 నుంచి 31 వరకు మాత్రమే. ఆఫ్‌లైన్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో ఈ ఆఫర్ లేదు.

క్విక్ షేర్‌ ఫీచర్‌తో శాంసంగ్ తన ఎకోసిస్టమ్‌ను మరింత మెరుగుపరుస్తోంది. ఎయిర్‌డ్రాప్ లాంటి సపోర్ట్ గెలాక్సీ ఫోన్స్‌లో రావడం ఓ పెద్ద అడుగు. ఫైల్ షేరింగ్ మరింత సులభమవుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×