E-Paper
Advertisement

Galaxy Book 6: 16 ఇంచ్ పెద్ద స్క్రీన్‌గల శాంసంగ్ పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్స్ లాంచ్.. ఫుల్ ఫీచర్స్, ధర, డిస్కౌంట్ వివరాలు

Galaxy Book 6: 16 ఇంచ్ పెద్ద స్క్రీన్‌గల శాంసంగ్ పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్స్ లాంచ్.. ఫుల్ ఫీచర్స్, ధర, డిస్కౌంట్ వివరాలు
Advertisement

Galaxy Book 6: కొరియా టెక్ కంపెనీ శాంసంగ్ తన కొత్త గెలాక్సీ బుక్ 6 సిరీస్‌ ల్యాప్‌టాప్స్ ఇండియాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ బుక్ 6 అల్ట్రా, గెలాక్సీ బుక్ 6 ప్రో, స్టాండర్డ్ గెలాక్సీ బుక్ 6 మోడల్స్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు వేగవంతమైన పర్‌ఫామెన్స్, ప్రీమియం డిజైన్ కావాల్సిన వినియోగదారుల కోసమే ప్రధానంగా రూపొందించింది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఈ ల్యాప్‌టాప్‌లు లభ్యం అవుతాయి.

ధరల వివరాలు, ఆఫర్లు

గెలాక్సీ బుక్ 6 అల్ట్రా ల్యాప్‌టాప్ ధర రూ.2,42,990 నుంచి మొదలవుతుంది.
గెలాక్సీ బుక్ 6 ప్రో ధర రూ.1,78,990 నుంచి ప్రారంభమవుతుంది (16GB ర్యామ్ + 512GB స్టోరేజ్).
స్టాండర్డ్ గెలాక్సీ బుక్ 6 ధర రూ.1,27,990 నుంచి లభిస్తుంది.
శాంసంగ్ ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఇస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 24 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం ఉంది. విద్యార్థులు చెల్లుబాటు అయ్యే స్టూడెంట్ ID చూపిస్తే 10శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

గెలాక్సీ బుక్ 6 అల్ట్రా ఫీచర్లు

Advertisement

ఈ సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ మోడల్ గెలాక్సీ బుక్ 6 అల్ట్రా. ఇందులో 16 ఇంచ్ WQXGA+ ఆమోలెడ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. 2880*1800 రిజల్యూషన్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉండటం వల్ల బయట కూడా స్పష్టంగా చూడవచ్చు.
ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 Evo ప్రాసెసర్, ఇంటెల్ NPU (50 TOPS), NVIDIA GeForce 5070 GPU ఉన్నాయి. 32GB వరకు ర్యామ్, 1TB వరకు SSD స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. 1080p ఫుల్ HD వెబ్‌క్యామ్, బ్యాక్‌లిట్ కీబోర్డ్, హాప్టిక్ టచ్‌ప్యాడ్ ఉన్నాయి. 80.20Wh బ్యాటరీతో 140W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

గెలాక్సీ బుక్ 6 ప్రో ఫీచర్లు

గెలాక్సీ బుక్ 6 ప్రో అల్ట్రా కంటే తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు ఇస్తుంది. 16 ఇంచ్ ఆమోలెడ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్, Intel Arc గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇది రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్‌కు బాగా సరిపోతుంది. 16 ఇంచ్ మోడల్‌లో 78.07Wh బ్యాటరీ, 14 ఇంచ్ మోడల్‌లో 67.18Wh బ్యాటరీ ఉంది. ఇది తేలికగా, పోర్టబుల్‌గా ఉంటుంది.

Advertisement

Also Read: బ్యాటరీ లేకుండా నడిచే స్మార్ట్‌వాచ్.. ఎలా పని చేస్తుందంటే

స్టాండర్డ్ గెలాక్సీ బుక్ 6 ఫీచర్లు

స్టాండర్డ్ గెలాక్సీ బుక్ 6 తక్కువ ధరలో బ్యాలెన్స్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది. 16 ఇంచ్ టచ్‌స్క్రీన్, 16 ఇంచ్ నాన్-టచ్, 14 ఇంచ్ నాన్-టచ్ ఆప్షన్లు ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో 16 ఇంచ్ WUXGA IPS టచ్‌స్క్రీన్ ఉంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సిరీస్ 3 ప్రాసెసర్, ఇంటెల్ NPU (49 TOPS) ఉన్నాయి. ఇది రోజువారీ ఉపయోగం, ఆఫీస్ పనులకు చాలా మంచి ఆప్షన్.

శాంసంగ్ గెలాక్సీ బుక్ 6 సిరీస్ వివిధ రకాల వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. అల్ట్రా మోడల్ హై పర్‌ఫామెన్స్, గ్రాఫిక్స్ కావాల్సిన ప్రొఫెషనల్స్‌కు సరిపోతుంది. ప్రో మోడల్ పర్‌ఫామెన్స్, పోర్టబిలిటీ మధ్య బ్యాలెన్స్ చూపిస్తుంది. స్టాండర్డ్ మోడల్ రోజువారీ ఉపయోగం కోసం మంచి వాల్యూ ఇస్తుంది.

ముఖ్య గమనిక: ఈ కథనంలో మీకు తెలిపిన శాంసంగ్ పెద్ద స్క్రీన్ ల్యాప్‌టాప్స్ ఫీచర్స్, ధరలు.. ఆయా కంపెనీ ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. కొనుగోలు చేసే సమయంలోల్యాప్‌టాప్స్ బాగా పరిశీలించి కొనాలని సూచన. మీరు కొనుగోలు చేసే సమయానికి పై పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ ఈ విషయాలకు బాధ్యత వహించదు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే .

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×