E-Paper
Advertisement

Astronauts Food: వ్యోమగాములు.. తమ మలాన్నే ఆహారంగా తింటారా?

Astronauts Food: వ్యోమగాములు.. తమ మలాన్నే ఆహారంగా తింటారా?
Advertisement

టైటిల్ చదవగానే.. ముఖం వికారంగా పెట్టారేంటీ? మరి దాన్ని తినేవారి పరిస్థితి ఏమిటీ? ఇంతకీ వ్యోమగాములు నిజంగానే తమ మలాన్ని మళ్లీ ఆహారంగా తీసుకుంటారా? ఇందులో నిజమెంత? అసలు ఈ విషయం వైరల్ అవ్వడానికి కారణాలేమిటీ?

ఔను, నిజమే.. కానీ..

వ్యోమగాములు.. తమ మలాన్ని తిరిగి ఆహారంగా తీసుకోవాలన్నది నిజమే. కానీ, దాన్ని అమలులోకి తీసుకురాలేదు. అయితే, దీనిపై ప్రయోగాలైతే విజయవంతం అయ్యాయి. అంతరిక్షంలోకి వెళ్లాక ఆహారం దొరకడం చాలా కష్టం. అక్కడికి భూమి నుంచి సరిపడా ఆహారాన్ని తీసుకెళ్లడం కూడా కష్టం. మరి, వారు తీసుకెళ్లిన ఆహారం మొత్తం అయిపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న పరిశోధకులకు కలిగింది. అందుకే వారు మలాన్ని తిరిగి ఆహారంగా మార్చే ప్రక్రియను కనుగొన్నారు.

మూత్రాన్ని రియూజ్ చేసినట్లే..

Advertisement

అంతరిక్షానికి కావల్సినన్ని నీళ్లు తీసుకెళ్లలేరు. అందుకే, వ్యోమగాములు తమ మూత్రాన్ని రిసైకిల్ చేసుకుని మళ్లీ తాగుతారు. మరి మూత్రాన్ని రిసైకిల్ చేసుకుని తాగుతున్నప్పుడు.. మలాన్ని ఎందుకు మళ్లీ ఆహారం తినకూడదూ? అనే ప్రశ్నే.. ఈ ఆవిష్కరణకు కారణమైంది. నాసా వంటి అంతరిక్ష ప్రయోగ సంస్థలు భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహంపై ప్రయోగాలు చేయనున్నాయి. అక్కడికి చేరిన తర్వాత వ్యోమగాములకు ఎలాంటి ఆహారం దొరకదు. అందుకే.. ఈ ప్రయోగం చేశారు. వ్యోమగాముల ఆకలి కష్టాన్ని తీర్చేందుకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు.

మలాన్ని ఆహారంగా ఎలా మారుస్తారు?

మలాన్ని ఆహారంగా తింటారంటే అర్థం.. డైరెక్టుగా తినేస్తారని కాదు. ఇందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. దానివల్ల మలం శుభ్రమై.. తిరిగి ఆహారంగా మారుతుంది. దాని నుంచి ఎలాంటి దుర్వాసన రాదు. వ్యోమగాములు విసర్జించే మలాన్ని మంచి బ్యాక్టీరియా(మైక్రోబ్స్ – Microbes)తో చేర్చడం ద్వారా తిరిగి ఆహారంగా మార్చుతారు.

Advertisement

ఈ మేరకు వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు రూపొందించారు. అది మలాన్ని, మూత్రాన్ని వేర్వేరుగా సేకరిస్తుంది. వ్యోమగాములు విసర్జించిన మలం పెద్ద ట్యూబ్ లేదా ట్యాంకర్‌లాంటి బయోరియాక్టర్‌లోకి వెళ్తుంది. అందులో ఉండే మైక్రోబ్స్ మలినాలను తొలగిస్తాయి. అందులో ఆక్సిజన్ ఉండదు. దానివల్ల తిన్న ఆహారం గ్యాస్‌గా మారుతుంది. ముఖ్యంగా మిథేన్‌గా రూపాంతరం చెందుతుంది.

మరో మైక్రోబ్ గ్రూప్.. మిథేన్ గ్యాస్‌ను తింటాయి. ఆ మైక్రోబ్‌లను మిథైలోకాకస్ కాప్సులాటస్ (Methylococcus capsulatus) అంటారు. అవి చాలా వేగంగా పెరుగుతాయి. అవి చాలా గట్టిగా.. పోషకాలతో నిండి ఉంటాయి. వాటిలో 50 శాతం ప్రోటీన్, 35 శాతం ఫ్యాట్ ఉంటుంది. చివరికి ఆ మిశ్రమం ఒక పేస్టులా మారుతుంది. దానికి రుచిని జోడించి.. రియల్ ఫుడ్‌లా మార్చుతారు. దాని నుంచి ఎలాంటి దుర్వాసన రాదు.

దాని రుచి ఎలా ఉంటుంది?

మలం నుంచి పుట్టిన ఆహారం అంటే.. దాని టేస్టు ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే పెన్ స్టేట్ యూనివర్శిటీ 2017-18 కాలంలో దీనిపై ప్రయోగాలు చేసింది. ఇందుకు NASA ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. 2024-25 సంవత్సరంలో కూడా నాసా క్లెమ్సన్ యూనివర్శిటీకి నిధులు కేటాయించి దీనిపై మరిన్ని పరిశోధనలు చేయించింది. అయితే, ఏ ఒక్కరూ దీన్ని తినేందుకు ప్రయత్నించలేదు. మైక్రోబ్స్ వల్ల ఇది కాస్త ఉప్పగా.. వగరగా ఉండవచ్చని, దానికి జోడించే ఫ్లేవర్‌ను బట్టి రుచి మారొచ్చని చెబుతున్నారు.

Also Read: భూమికి ‘చొట్ట’ – టర్కీలో కుంగిపోతున్న నేల.. పైకి లేస్తున్న పర్వతాలు, జరగబోయేది ఇదేనా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×