// // Aishwarya Rajesh: గ్లామర్ పాత్రలపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Aishwarya Rajesh: గ్లామర్ పాత్రలపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్… వల్గర్ కాదంటూ!

Aishwarya Rajesh: గ్లామర్ పాత్రలపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్… వల్గర్ కాదంటూ!
Advertisement

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ పరిచయం అవసరం లేని పేరు సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె తమిళ, తెలుగు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తమిళ తెలుగు భాషలో సుమారు 40 కి పైగా సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం మరిన్ని అవకాశాలను అందుకుంటూ తీరికలేకుండా గడుపుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

గ్లామర్ అంటే స్కిన్ షో కాదు..

ఇప్పటివరకు ఐశ్వర్య రాజేష్ తన కెరియర్లో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య  రాజేష్ సినిమాలలో నటిస్తున్నారు అంటే ఎంతో పద్ధతిగా కనిపిస్తారనే భావన ప్రేక్షకులకు ఉంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఇప్పటివరకు మీ సినిమాలలో ఎక్కడ గ్లామర్ పాత్రలలో కనిపించలేదు . గ్లామర్ పాత్రలో చేయలేకపోయాను అనే భావన మీలో ఉందా అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఐశ్వర్య రాజేష్ సమాధానం చెబుతూ నా దృష్టిలో గ్లామర్ అంటే వేరు వల్గర్ అంటే వేరని తెలిపారు. గ్లామర్ వల్గర్ కాదని  ఐశ్వర్య రాజేష్ క్లారిటీ ఇచ్చారు. ఒక అమ్మాయి చూడటానికి అందంగా కనిపిస్తే చాలా గ్లామర్ గా ఉందని భావిస్తాము గ్లామర్ అనేది స్కిన్ షో కాదని ఐశ్వర్య తెలిపారు.

లేడీ ఓరియంటెడ్ సినిమాలు..

Advertisement

తనకు ఇలాంటి గ్లామర్ పాత్రలలో ఎందుకు అవకాశాలు రాలేదు తెలియదు కానీ అవకాశాలు వస్తే నటిస్తానని ఈమె తెలియజేశారు. ఇక ఐశ్వర్య రాజేష్ తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించడమే కాకుండా లేడి ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించారు. ఇలా ఎప్పుడు ఒకే తరహా పాత్రలకు పరిమితమైన ఐశ్వర్య రాజేష్ అవకాశం వస్తే గ్లామర్ పాత్రలలో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. మరి ఈ ముద్దుగుమ్మకు ఆ తరహా పాత్ర ఏ డైరెక్టర్ ఇస్తారో వేచి చూడాలి.

దివంగత నటుడు రాజేష్ కుమార్తె..

Advertisement

ఐశ్వర్య రాజేష్  సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిస్తే ఈమె తండ్రి దివంగత నటుడు రాజేష్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తెలుగు, తమిళ సినిమాలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఉన్నఫలంగా ఈయన మరణించడంతో రాజేష్ గురించి ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలియదు. ఇక రాజేష్ సోదరి ప్రముఖ నటి శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈమె ఐశ్వర్య రాజేష్ కు స్వయాన మేనత్త అవుతారు. హాస్యనటిగా శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

Also Read: Varanasi Movie: జక్కన్న కొత్త స్ట్రాటజీ.. సినిమా పేరు లేకుండా ఆ నగరంలో పోస్టర్లు, రిలీజ్ తేదీతో సహా..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×