E-Paper
Advertisement

మీ ఫ్రిజ్‌లో ఈ 3 సెట్టింగ్స్ మార్చకపోతే.. కూలింగ్ తగ్గి, కరెంట్ బిల్లు మోత మోగుతుంది!

మీ ఫ్రిజ్‌లో ఈ 3 సెట్టింగ్స్ మార్చకపోతే.. కూలింగ్ తగ్గి, కరెంట్ బిల్లు మోత మోగుతుంది!
Advertisement

Fridge cooling tips: ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్‌లో మనల్ని కాపాడే ఏకైక నేస్తం ఫ్రిజ్. అయితే.. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఫ్రిజ్ కూలింగ్ తగ్గడం. దీని వల్ల లోపల ఉన్న పాలు, కూరగాయలు త్వరగా పాడైపోవడమే కాకుండా.. కరెంట్ బిల్లు కూడా ఊహించని విధంగా పెరుగుతుంది. చాలా మంది ఫ్రిజ్ రిపేర్ వచ్చిందని కంగారు పడతారు. కానీ కేవలం కొన్ని చిన్న సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ ఫ్రిజ్‌ను మళ్ళీ సూపర్ కూలింగ్‌కు తీసుకురావచ్చు. అవేంటో ఇప్పడు.. తెలుసుకుందాం.

1. థర్మోస్టాట్ సెట్టింగ్ మార్చండి:
చలికాలంలో మనం ఫ్రిజ్ టెంపరేచర్‌ను తక్కువలో ఉంచుతాం. కానీ వేసవి రాగానే.. బయట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఫ్రిజ్ లోపల చల్లదనాన్ని నిలబెట్టడానికి థర్మోస్టాట్‌ను ‘Summer’ మోడ్‌కు లేదా హైకి మార్చాలి. సాధారణంగా ఎండాకాలంలో.. సెట్టింగ్ 4 నుంచి 6 మధ్య ఉంచడం బెస్ట్.

Advertisement

2. డోర్ గ్యాస్కెట్ చెక్ చేయండి:
ఫ్రిజ్ తలుపుకున్న రబ్బర్ బీడింగ్ వదులైతే, లోపలి చల్లని గాలి బయటకు పోతుంది. దీని వల్ల కంప్రెసర్ ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. ఫలితంగా.. కరెంట్ బిల్లు పెరుగుతుంది. ఒక చిన్న కాగితాన్ని డోర్ మధ్యలో పెట్టి లాగి చూడండి. అది సులభంగా వచ్చేస్తే మీ గ్యాస్కెట్ మార్చాలని అర్థం.

3. గాలి ఆడేలా ఖాళీ ఉంచండి: 
ఫ్రిజ్ నిండా వస్తువులను కుక్కేయకండి. గాలి సరిగ్గా సర్క్యులేట్ అవ్వకపోతే.. కూలింగ్ సరిగ్గా ఉండదు. అలాగే.. ఫ్రిజ్‌ను గోడకు ఆనించి ఉంచకూడదు. గోడకు, ఫ్రిజ్ వెనక భాగానికి కనీసం 6 నుంచి 10 అంగుళాల దూరం ఉండాలి. దీని వల్ల కంప్రెసర్ నుంచి వచ్చే వేడి గాలి సింపుల్‌గా బయటకు పోతుంది.

Advertisement

4. కాయిల్స్ శుభ్రం చేయండి :
ఫ్రిజ్ వెనక లేదా కింద ఉండే కండెన్సర్ కాయిల్స్‌పై దుమ్ము పేరుకుపోతే.. అది వేడిని బయటకు పంపలేదు. దీని వల్ల ఫ్రిజ్ కూలింగ్ సామర్థ్యం 30% వరకు తగ్గిపోతుంది. నెలకు ఒకసారి మెత్తని బ్రష్‌తో ఈ దుమ్మును తుడి చేయండి.

5. వేడి వస్తువులను నేరుగా పెట్టకండి:
వండిన వంటకాలను వేడి వేడిగా ఫ్రిజ్‌లో పెట్టడం అతి పెద్ద తప్పు. ఇది లోపల ఉన్న ఉష్ణోగ్రతను పెంచి.. కంప్రెసర్‌పై భారం వేస్తుంది. వస్తువులు గది ఉష్ణోగ్రతకు వచ్చాకే లోపల పెట్టండి.

పెరిగే ఎండలకు అనుగుణంగా మీ ఫ్రిజ్ సెట్టింగ్స్‌లో మార్పులు చేయడం వల్ల ఆహారం తాజాగా ఉండటమే కాకుండా.. కరెంట్ బిల్లు భారం కూడా తగ్గుతుంది. పైన పేర్కొన్న చిట్కాలను పాటిస్తే.. మీ పాత ఫ్రిజ్ కూడా కొత్తదానిలా కూలింగ్ ఇస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×