E-Paper
Advertisement

Amazon Hacker’s:- అమెజాన్‌పై హ్యాకర్ల కన్ను.. జాగ్రత్తగా ఉండడానికి సూచనలు…

Amazon Hacker’s:- అమెజాన్‌పై హ్యాకర్ల కన్ను.. జాగ్రత్తగా ఉండడానికి సూచనలు…
Advertisement

Amazon Hacker’s:- ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ అనేవి లేవు. ఏది కావాలంటే అది.. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతికి అందే విధంగా ఉండేది కాదు. అయినా అప్పుడే జీవితాల్లో ఎక్కువ ప్రైవసీ అనేది ఉండేదని అప్పటి తరం వారు అంటుంటారు. కానీ స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, ఓటీటీ లాంటి వాటిలో మునిగిపోయిన ఈ జెనరేషన్‌కు.. ఆ విలువ అర్థం కాదని విమర్శిస్తుంటారు. ఇలాంటి వాటి వల్లే క్రైమ్ రేట్ కూడా పెరిగింది. ప్రస్తుతం హ్యాకర్లు ఓ కొత్త పద్ధతిలో డబ్బులను చోరీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

ఈరోజుల్లో బయటికి వెళ్లి షాపింగ్ చేయడానికి, గంటలు గంటలు షాపింగ్ మాల్స్‌లో నిలబడి డ్రెస్సులను సెలక్ట్ చేసుకోవడానికి చాలామందికి ఓపిక ఉండడం లేదు. అందుకే వారికి ఈజీగా దొరికిన సొల్యూషన్ షాపింగ్ యాప్స్. ఇతర షాపింగ్ యాప్స్‌తో పోలిస్తే అమెజాన్‌కు ఫాలోయింగ్ బాగానే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు పెడుతూ.. కస్టమర్లను ఆకర్షించడంలో ఈ యాప్ ముందుంటుంది. అయితే ఈ యాప్ ద్వారా హ్యాకర్లు కస్టమర్లను ఎలా టార్గెట్ చేస్తున్నారు, వారి అకౌంట్‌లోని డబ్బులను ఎలా దొంగలిస్తున్నారు అనే విషయాలు తాజాగా బయటికొచ్చాయి.

అమెజాన్‌లో షాపింగ్ చేయడం ఈజీ, అది వద్దు అనుకుంటే పలు ప్రక్రియలను పాటించాల్సి ఉన్నా.. అది కూడా ఈజీనే. కానీ ఎప్పుడైనా ఒక ఖాళీ పార్సెల్ మీరు ఆర్డర్ చేయకపోయినా.. మీ పేరుతో మీ ఇంటికొచ్చిందా..? అయితే జాగ్రత్తలు ఉండాలని హెచ్చరిస్తున్నారు టెక్ నిపుణులు. మామూలుగా మీ ఆర్డర్ చేయకపోయినా మీ ఇంటికి పార్సెల్ వస్తే అది మీది కాదని లైట్ తీసుకుంటారు. కానీ దాని వెనుక చాలాపెద్ద కుట్ర ఉంటుందని వారు చెప్తున్నారు. ‘సుజీచో’ వంటి కంపెనీ నుండి మీరు ఆర్డర్ చేయకపోయినా పార్సెల్ వస్తే.. జాగ్రత్త ఉండాలంటున్నారు.

Advertisement

సుజీచో నుండి వచ్చే పార్సెల్స్‌లో ఏమైన ఉండవచ్చు, లేదా ఖాళీగా కూడా ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ ఆర్డర్.. ఒక ట్రాకింగ్ నెంబర్‌తో పాటు వస్తుంది. ప్యాకేజ్ డెలివరీ అని కూడా ఉంటుంది. డెలివరీ బాయ్‌కు 5 స్టార్ రేటింగ్ కూడా చూపిస్తుంది. ఒకవేళ అందులో ఏం లేదు కదా నాకెందుకులే అని లైట్ తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. అలాంటి ప్యాకేజ్ ఏమైనా వస్తే.. వెంటనే అమెజాన్‌కు రిపోర్ట్ చేయమని సూచిస్తున్నారు. ఒక్కొక్కసారి రిపోర్ట్ చేసినా కూడా ప్యాకేజ్ వెనక్కి వెళ్లదని, అలాంటి సందర్భాల్లో కూడా కస్టమర్లు ఏదో ఒక విధమైన చర్యలు తీసుకోవాలంటున్నారు.

ఈ ఫేక్ ప్యాకేజీల ద్వారా కస్టమర్ల అకౌంట్ వివరాలు తీసుకొని.. వాటిని తప్పుగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇలాంటి వాటి నుండి దూరంగా ఉండడం కోసం వారు పలు సూచనలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అమెజాన్ ఆర్డర్లు చెక్ చేసుకుంటూ ఉండాలి, మీ పేరు మీద రివ్యూలు ఏమైనా పోస్ట్ అయ్యాయేమో చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్ మార్చుకుంటే ఉంటే మంచిది.. ఇవన్నీ చేస్తూ హ్యాకింగ్ నుండి తమను తాము కాపాడుకోవాలని నిపుణులు తెలిపారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×